రూ.80 వేలలోపు 75+ కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్‌లు.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే వారం రోజులు..
భారతదేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో, రోజువారీ ప్రయాణాల కోసం అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ప్రత్యేకంగా పల్లెటూరి నుంచి పట్టణ ప్రాంతాల వరకు చాలా మంది వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందే మోటార్‌సైకిళ్లను ఎంచుకుంటున్నారు. అటువంటి వినియోగదారుల కోసం మార్కెట్లో మూడు ప్రాముఖ్యమైన బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100, టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఈ మూడు కూడా మీరు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేకూర్చేలా నిలుస్తాయి. 60 కి.మీల మైలేజ్ అందించడంతో పాటు పనితీరు పరంగా అన్ని వర్గాల వారిని మెప్పిస్తున్నాయి. ఇవి వేరు వేరు కంపెనీలకు చెందిన బైకులు అయినప్పటికి కూడా భారతదేశంలో చాలా మంది అభిమానులను కలిగి ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Honda Shine 100: హోండా షైన్ 100 డిజైన్ పరంగా చూసుకుంటే, ఈ బైక్ మొదటి చూపులోనే ఆకట్టుకునేలా ఉంటుంది. సాధారణంగా 100 సీసీ సెగ్మెంట్ బైక్‌ల డిజైన్ చాలా సాదా గానే ఉంటాయి, కానీ షైన్ 100 మాత్రం అందానికి, ప్రాక్టికాలిటీకి మంచి కలయికగా కనిపిస్తుంది. ఇది కేవలం పనికొచ్చే బైక్ మాత్రమే కాదు, చూడటానికి కూడా స్టైలిష్‌గా ఉంటుంది. ఇది రూ.70 వేల ఎక్స్-షోరూమ్ ధరలో లభిస్తోంది.

ధర పరంగా చూసినట్లయితే చాలా మందికి అందుబాటులో ఉండే ధరలో ఓ నమ్మకమైన, మైలేజ్ మాస్టర్‌ను తీసుకురావచ్చన్నమాట. ఇక పరఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇందులో 98.98 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది స్మూత్‌గా రాణించే 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కలిపి,రోజువారి ప్రయాణాలకు కావలసిన శక్తిని సరిపడిగా అందిస్తుంది. ఇంధన సామర్థ్యం అంటేనే దీని హైలైట్. ఈ బైక్ లీటరుకు సగటున 65 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
పెట్రోల్ ధరలు పెరిగిన కూడా ఈ బైక్‌ను నడపడం కాస్త రిలీఫ్ లానే ఉంటుంది. ఇది టెక్నాలజీ,సేఫ్టీ అంశాల్లోనూ అప్‌డేట్‌గా ఉంది. ఇందులో ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది, స్పీడ్, మైలేజ్ వంటి డేటా క్లియర్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా, సైడ్-స్టాండ్ సెన్సార్ కూడా ఉంది. అంటే స్టాండ్ వేసి బైక్ నడిపే ప్రయత్నం చేస్తే, అది మిమ్మల్ని ముందే హెచ్చరిస్తుంది. ఈ బైక్ డ్రమ్ బ్రేక్స్‌తో వస్తుంది.

Bajaj Platina 100: మైలేజ్ బైక్ అంటే మొదట గుర్తొచ్చేది బజాజ్ ప్లాటినా. ఇది అసలు మైలేజ్ కింగ్ అని చెప్పొచ్చు. గ్రామాల్లో, సిటీలో ట్రాఫిక్‌లో కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇది లీటరుకు 75 నుండి 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఇంజిన్ గురించి చూసినట్లయితే, 102 సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్‌కు జతగా 4-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది.
ఇందులో ఎలక్ట్రిక్ స్టార్టర్ ఉండటం వలన ఒక్క స్విచ్‌తోనే బైక్ స్టార్ట్ అవుతుంది. అదే కాకుండా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా అవసరమైన సమాచారం స్పీడ్, ఇంధనం వంటి అంశాలను స్పష్టంగా చూపిస్తుంది. బరువు విషయానికి వస్తే, ఈ బైక్ కేవలం 117 కిలోలు మాత్రమే ఉంది. అంటే, సీనియర్ పౌరులు లేదా స్లిమ్ బిల్ట్ ఉన్నవారు కూడా దీనిని సులువుగా హ్యాండిల్ చేయగలరు.

Tvs Star City Plus: టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు సరిపోయే, ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి ఉపయోగకరమైన బైక్ ఇది. 70 నుండి 85 కి.మీ/లీటర్ వరకు మైలేజ్ ఇస్తోంది. ఇందులో 10 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉండటంతో, వారం రోజుల ప్రయాణం కోసం ఒకే సారి పెట్రోల్ నింపితే చాలు. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.
డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ ధర రూ.75,286, డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ ధర రూ.79,282 (ఇవి అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు). ఇందులో ఉన్న 109.7 సీసీ ఇంజిన్ బాగా శక్తివంతమైనది. ఇది గరిష్టంగా 6.03 కిలోవాట్లు శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలానే 8.7Nm టార్క్‌ను అందించడంవల్ల, ట్రాఫిక్‌లో స్పీడుగా మొవ్వడానికి, సిగ్నల్స్ వద్ద వేగంగా బయలుదేరడానికి ఇది చాల సాయపడుతుంది.


Click it and Unblock the Notifications








