రోజూ పొలానికి, మార్కెట్‌, ఉద్యోగాలు, స్కూల్‌కు సెట్ అయ్యే బైక్స్! లీటర్ పెట్రోల్‌తో 65+ కిలోమీటర్ల దూరం

ప్రస్తుతం టూవీలర్ లేనిదే రోజువారి పనులు చేసుకోలేని రోజులు వచ్చాయి. ఒకప్పుడు నగరాలకు మాత్రమే పరిమితమైన బైకుల వాడకం ఇప్పుడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించింది. పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా వారికి తగిన బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వాడే బైక్‌లు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండాలి. మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, మైలేజ్ ఎక్కువగా ఉండాలి, ధర చాలా వరకు అందుబాటులో ఉంటూ, మెరుగైన పనితీరును కనబరచాలి.

ఇలాంటి అంశాలు కలిగిన మోడళ్లు ఇప్పుడు దేశీయ మార్కెట్లో అన్ని ప్రాంతాల్లో చాలా లభిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus), హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), టీవీఎస్ రేడియన్ (TVS Radeon) అనే బైక్‌లు గ్రామీణ రోడ్లపై కూడా సులభంగా దూసుకుపోగలవు. వాటి గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

Best Bikes For Village Splendor Plus

Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ దాదాపుగా రెండు దశాబ్దాలుగా భారతదేశ రోడ్లపై తిరుగులేని పాపులారిటీని సంపాదించింది. పేద, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలో లభిస్తూ, పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసే మోడల్‌గా ఇది భారతీయ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి బాగా ఇష్టమైన వాటిలో ఇది ఒకటి. దీని ఎక్స్‌షోరూమ్ ధర వచ్చేసి రూ.77,226 గా ఉంది.

స్ప్లెండర్ ప్లస్ 97.2 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 63 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే మైలేజ్ అనే కొన్ని రోడ్ల పరిస్థితులను బట్టి మారుతుంది. ఓవరాల్‌గా అయితే సగటు వినియోగదారునికి కావాల్సినంత మైలేజ్ అందివ్వగలదు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.8 లీటర్లుగా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది కొత్తగా OBD 2B ప్రమాణాల ప్రకారం అప్‌డేట్ అయింది.

Best Bikes For Village Hf Deluxe

Hero HF Deluxe: హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ గ్రామీణ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించబడినట్లు ఉంటుంది.తక్కువ ధర, బలమైన ఇంజిన్, అధిక మైలేజ్ కలిపి దీన్ని నిజంగా ప్రజల బైకుగా నిలబెట్టాయి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.65,268గా ఉంది. ఇది తక్కువ బడ్జెట్‌లో బైక్ కొంటున్న వారికి గొప్ప అవకాశం. ఇందులో 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు సరిపడేలా పనితీరును అందిస్తుంది.

ఈ ఇంజిన్ 7.9 బీహెచ్‌పి పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని వలన గ్రామీణ రోడ్లపై కూడా ఈజీగా నడుస్తుంది. సాధారణ బైక్‌ల కన్నా తక్కువ నిర్వహణ ఖర్చుతో, ఎక్కువ కాలం నడిపేందుకు HF డీలక్స్ సరైన ఆప్షన్. కంపెనీ ప్రకారం, ఈ బైక్ లీటర్‌కు సుమారు 70 కిలోమీటర్ల మైలేజ్ అందించగలదు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక గొప్ప బైకుగా నిలుస్తుంది.

Best Bikes For Villages tvs radeon

TVS Radeon: టీవీఎస్ రేడియాన్ గ్రామీణ రోడ్లకు సరిగ్గా సూటయ్యే విధంగా ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.72,758గా ఉంది. ఇదే ధరకు బలమైన ఫీచర్లు లభించడం ఈ సెగ్మెంట్‌లో ప్లస్ పాయింట్. ఇందులో 109.7cc సామర్థ్యం గల డ్యూరో లైఫ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.08 బీహెచ్‌పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు దాదాపు 66 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ఇది గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు ఎంతో కీలకమైన అంశం. దూర ప్రయాణాలు, గుంతల రోడ్లపై ప్రయాణాలు చేసేవారికి ఇది పెద్ద ఎకానమీ ప్లస్ అవుతుంది. ఇంకా, టీవీఎస్ రేడియాన్ డిజైన్ కూడా చాలామందిని ఆకట్టుకునేలా ఉంటుంది. క్లాసిక్ డిజైన్, మెటల్ బాడీ టచ్, కాంపాక్ట్ డిజైన్ ఇవన్నీ దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, టీవీఎస్ రేడియన్ గ్రామీణ ప్రజల జీవనశైలికి అనుగుణంగా ఉండేలా డిజైన్ చేయబడిన బైక్.

More from DriveSpark

Article Published On: Tuesday, June 24, 2025, 14:41 [IST]
English summary
Best bikes for villages low maintenance and high mileage more details inside
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+