వినాయక చవితి రోజు కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ మూడు బెస్ట్ మోడల్స్ చూసేయండి!
వినాయక చవితి రోజు కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఆ నిర్ణయం కేవలం ఓ కొనుగోలు కాదు, ఒక శుభారంభం కూడా అవుతుంది. మన సంప్రదాయంలో, వినాయక చవితి రోజు ఏదైనా కొత్త పని ప్రారంభించడం లేదా కొత్త వస్తువు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. శ్రీ గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడు కావడంతో, ఈ రోజున కొనుగోలు చేసిన వాహనం భవిష్యత్తులో మీ ప్రయాణం సాఫీగా సాగేందుకు ఒక మంచి ఆరంభం ఇస్తుందని నమ్మకం. ఈ పండుగ రోజున షోరూమ్‌లకు వెళ్లి తమ కలల బైక్‌ను బుక్ చేసుకుంటారు. కొత్త వాహనం మీద గణపతి బప్పాకు పూజలు చేసి, మొదటి రైడ్‌ను ఆరంభించడం ఒక ప్రత్యేకమైన ఆనందం. రూ.1 లక్ష లోపు మూడు శక్తివంతమైన 125cc బైక్‌ల గురించి ఈ కథనంలో ఇవ్వడం జరిగింది.
Bajaj Pulsar 125: బజాజ్ పల్సర్ 125, రోజువారీ ప్రయాణాల్లో పనితీరు, స్టైల్‌ను సమతుల్యం చేసిన బైక్‌గా పేరుగాంచింది. నగరంలో ట్రాఫిక్ మధ్య సులభంగా నడపడానికి అనువుగా ఉండటమే కాకుండా, హైవేపై కూడా ఇది స్థిరమైన, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది రూ. 85,178 (ఎక్స్-షోరూమ్) సరసమైన ధరలో లభించడం వలన, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌గా మారి, విస్తృత స్థాయి వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఈ బైక్‌లో 11.8 bhp శక్తిని, 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజిన్ అమర్చబడింది, ఇది రోజువారి ప్రయాణాలకు సరిపడా పవర్‌ను అందిస్తుంది. బలమైన వారసత్వం, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో, పల్సర్ 125 ఇప్పటికే చాలామందికి ఇష్టమైన మోడల్‌గా మారింది. వినాయక చవితి రొజు కొత్త బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ఇది బాగానే సెట్ అవుతుంది.
Hero Xtreme 125R: హీరో ఎక్స్‌ట్రీమ్ 125R స్టైలిష్, పనితీరుతో కూడిన బైక్. లేటెస్ట్ రైడింగ్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ మోడల్ బేస్ వేరియంట్ ధర రూ.98,425(ఎక్స్-షోరూమ్)గా ఉండి ఫీచర్లు, పనితీరు పరంగా ఇది విలువైన ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ మోడల్, 11.5 bhp శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది నగరంలో రైడింగ్‌కే కాకుండా, ఓపెన్ రోడ్‌లపై కూడా స్మూత్ అనుభవాన్ని అందిస్తుంది.

ఫీచర్లు, పనితీరు పరంగా ఇది విలువైన ఆప్షన్‌గా నిలుస్తుంది. మెరుగైన ఛాసిస్ నిర్మాణం వలన రోడ్డుపై స్థిరత్వం పెరుగుతుంది, అలాగే స్పోర్టి డిజైన్ రైడర్‌కు యువతరానికి నచ్చే ఆకర్షణను ఇస్తుంది. మొత్తం మీద, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R కేవలం ఒక రోజువారీ ప్రయాణ బైక్ మాత్రమే కాదు, స్టైల్, శక్తి, రైడింగ్ కంఫర్ట్‌ను సమానంగా అందించే ఒక అద్భుతమైన ఎంపిక.
Honda SP 125: హోండా SP 125 తన స్మార్ట్ డిజైన్ మరియు విశ్వసనీయ పనితీరుతో కమ్యూటర్ బైక్ సెగ్మెంట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన మోడల్. రూ. 93,247(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉండటం వలన, ఇది మంచి ఫీచర్లతో కూడిన ఆప్షన్‌గా నిలుస్తోంది. పనితీరు పరంగా, ఇది 10.9 hp శక్తి, 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, రోజువారీ నగర ప్రయాణాలకు సరిపడే పవర్ డెలివరీని అందిస్తుంది.



Click it and Unblock the Notifications








