పెట్రోల్ ధరలు పెరిగినా ఏం భయం లేదు.. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ..ఈ రెండు బైక్స్ లో ఏది బెస్ట్ ?

మనదేశంలో టూ వీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus), బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100) అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లుగా నిలిచాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్లు విశ్వసనీయతకు మారుపేరుగా ఉండటమే కాకుండా, లో మెయింటెనెన్స్ కాస్ట్ తో, అధిక ఫ్యూయెల్ కెపాసిటీతో వినియోగదారుల మొదటి ఎంపికగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల రోజువారీ అవసరాలకు ఈ బైక్‌లు చక్కగా సరిపోతాయి. ఈ కథనంలో ఈ రెండు బైక్‌ల ధర, ఫీచర్లను ఓ సారి పోల్చి చూద్దాం.

ధర (Price): కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్ ధరలు రూ. 77,176 నుండి రూ. 80,176 వరకు ఉన్నాయి. అదేవిధంగా, బజాజ్ ప్లాటినా 100 బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 68,890 నుండి ప్రారంభమవుతుంది. ఈ రెండింటిలో బజాజ్ ప్లాటినా 100 కొంచెం తక్కువ ధరను కలిగి ఉంది.

Hero Splendor Plus vs Bajaj Platinum 100 Price

పనితీరు (Performance): హీరో స్ప్లెండర్ ప్లస్ 97.2 సిసి ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 హెచ్‌పి పవర్, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

బజాజ్ ప్లాటినా 100 102 సిసి 4-స్ట్రోక్, డిటిఎస్-ఐ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 7.7 హెచ్‌పి పవర్, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా ఈ రెండు బైక్‌లు దాదాపు సమానంగా ఉన్నాయి.

Hero Splendor Plus

కొలతలు (Dimensions): హీరో స్ప్లెండర్ ప్లస్ పొడవు 2,000 మిమీ, వెడల్పు 720 మిమీ, ఎత్తు 1,052 మిమీ కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మిమీ, వీల్‌బేస్ 1,236 మిమీ. ఈ బైక్ బరువు 112 కేజీలు. 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.

బజాజ్ ప్లాటినా 100 పొడవు 2,006 మిమీ, వెడల్పు 713 మిమీ, ఎత్తు 1,100 మిమీ కలిగి ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200 మిమీ, వీల్‌బేస్ 1,255 మిమీ. ఈ బైక్ బరువు 117 కేజీలు, 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.

Bajaj Platinum 100

ఫీచర్లు (Features): కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హాలోజెన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఐ3ఎస్ (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

బజాజ్ ప్లాటినా 100 అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హాలోజెన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు (డేటైమ్ రన్నింగ్ లైట్స్) వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, ట్యూబ్-టైప్ టైర్లు, యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఈ రెండు బైక్‌లు వాటి ధరలకు తగిన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య :ధర, కొంచెం మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ కోసం చూస్తున్నట్లయితే బజాజ్ ప్లాటినా 100 మంచిది. మంచి రీసేల్ విలువ, తేలికైన హ్యాండ్లింగ్, అదనపు ఫీచర్లైన ఐ3ఎస్, ట్యూబ్‌లెస్ టైర్లను (కొన్ని వేరియంట్‌లలో) కోరుకుంటే హీరో స్ప్లెండర్ ప్లస్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 21, 2025, 17:33 [IST]
English summary
Best budget bike hero splendor plus vs bajaj platina 100 comparison
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+