పార్కింగ్ భయం అవసరం లేదు.. రివర్స్ గేర్ స్కూటర్లు కొనండి! యూత్, ఫ్యామిలీకీ కామన్ ఛాయిస్
కార్లు, ఆటోలు, లారీలు, బస్సులు రివర్స్ గేర్ లేకుండా ఊహించలేం. కానీ ద్విచక్ర వాహనాల్లో ఇది ఎందుకు లేదని మనం ఎప్పుడైనా ఆలోచించామా? బైక్ లేదా స్కూటర్ నడిపిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా "రివర్స్ గేర్ ఉంటే బాగుండు" అనుకుని ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్లలో రివర్స్ మోడ్ ఒక కీలక ఫీచర్‌గా మారింది. ఇరుకైన పార్కింగ్‌లు, ట్రాఫిక్‌లో వెనక్కి తీయాల్సిన సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు కొత్త EV స్కూటర్ కొనాలనుకుంటే, రివర్స్ మోడ్ ఉన్న మోడల్ ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. రోజువారీ ప్రయాణాల్లో ఎక్కువ సౌలభ్యం ఇచ్చే, సరసమైన రివర్స్ మోడ్ EVలపై ఓ లుక్ వేయండి!
Ather Rizta S: బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ ఏథర్ ఎనర్జీ నుంచి వచ్చిన ఏథర్ రిజ్టా విశ్వసనీయమైన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ రిజ్టా S వేరియంట్ ఇప్పుడు మరింత ప్రాక్టికల్‌గా మారడానికి కారణం ఇందులో అందుబాటులో ఉన్న రివర్స్ మోడ్. రోజువారీ వినియోగంలో, ఇరుకైన పార్కింగ్ స్థలాలు లేదా ట్రాఫిక్‌లో స్కూటర్‌ను వెనక్కి తీయాల్సిన సందర్భాల్లో ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

దీని ప్రారంభ ధర రూ. 1.14 లక్షలు(ఎక్స్-షోరూమ్). పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇండియన్ డ్రైవింగ్ సైకిల్(IDC) ప్రకారం రిజ్టా S ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన రేంజ్ను అందిస్తుంది. రోజువారీ ఆఫీస్, పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడం, మార్కెట్ పనులు కలిపినా తరచుగా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల ఇంధన ఖర్చులు తగ్గడమే కాకుండా, మీ జేబుపై భారం కూడా తగ్గుతుంది.
Bajaj Chetak Electric 3001: దశాబ్దాలుగా నమ్మకాన్ని సంపాదించిన చేతక్ బ్రాండ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో కూడా అదే స్థాయి విశ్వసనీయతను చూపిస్తోంది. ఈ సిరీస్‌లోని చేతక్ ఎలక్ట్రిక్ 3001 వేరియంట్ ప్రాక్టికల్ ఫీచర్లు కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపికగా మారింది. ముఖ్యంగా ఇందులో అందుబాటులో ఉన్న రివర్స్ మోడ్, రోజువారీ ప్రయాణాల్లో స్కూటర్‌ను సులభంగా హ్యాండిల్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

చేతక్ 3001 ఒక ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ, పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడదు. ఇందులో 3 kWh బ్యాటరీ ప్యాక్ను అందించారు. కంపెనీ క్లెయిమ్ ప్రకారం, ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఇది 127 కిలోమీటర్ల వరకు రేంజ్ను ఇవ్వగలదు. అంటే డడనగర ప్రయాణాలకు ఇది పూర్తిగా సరిపోతుంది, తరచుగా ఛార్జింగ్ అవసరం లేకుండా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు. ధర విషయానికి వస్తే, రూ. 99,500(ఎక్స్-షోరూమ్) ధరను నిర్ణయించారు.
Hero Vida VX2 Go: హీరో మోటోకార్ప్కు చెందిన ఎలక్ట్రిక్ విభాగం విడా (VIDA) నుంచి వచ్చిన తాజా స్కూటర్ విడా VX2 Go భారత మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రివర్స్ మోడ్‌ను అందించే భారతదేశంలోని అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఈ స్కూటర్‌లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ను అమర్చారు.

ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 92 కిలోమీటర్ల వరకు రేంజ్ను అందిస్తుంది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, కాలేజీ రైడ్స్ లేదా ఇంటి అవసరాలకు ఇది పూర్తిగా సరిపోతుంది. నగర వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ EV, ఖర్చు తగ్గించుకుంటూ ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు అడుగు వేయాలనుకునే వారికి మంచి ఎంపిక. ధర విషయానికి వస్తే, విడా VX2 Go ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 74,000 నుంచే ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








