సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌కు ఉహించని ట్విస్ట్.. ఇలా అవుతుందని కంపెనీ అనుకోలేదు
భారతీయ టూవీలర్ మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న స్కూటర్. స్టైల్, మైలేజ్, నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మనసును దోచుకున్న ఈ స్కూటర్, గత కొన్ని సంవత్సరాలుగా మంచి అమ్మకాలతో సుజుకి కంపెనీకి మద్దతుగా నిలుస్తోంది. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది రవాణా ఖర్చులను తగ్గించడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, తాజాగా విడుదలైన జూలై నెల అమ్మకాల గణాంకాలు కొంత వెనుకంజలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. జూలై 2025లో సుజుకి యాక్సెస్ 125 మొత్తం 68,172 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది. ఇది గత ఏడాది ఇదే నెలలో నమోదైన 71,247 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే సుమారు -4.32% తగ్గుదలగా నిలిచింది. సేల్స్ తగ్గడం కంపెనీకి ఉహించని ట్విస్ట్.
ఈ తగ్గుదల పెద్దగా అనిపించకపోయినా, పోటీ తీవ్రత పెరుగుతున్న ఈ విభాగంలో ఇది గమనించదగ్గ అంశం. ముఖ్యంగా, కొత్త మోడళ్లు, అప్‌డేట్‌డ్ ఫీచర్లు కలిగిన స్కూటర్లు మార్కెట్లోకి రావడంతో యాక్సెస్‌కి సవాళ్లు పెరుగుతున్నాయి. అయినా కూడా, దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ల జాబితాలో యాక్సెస్ 125 మూడవ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమే. రానున్న రోజుల్లో దీని అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో సేల్స్ పెరగనున్నాయి.

హోండా యాక్టివా 2,37,413 యూనిట్ల భారీ విక్రయాలతో ఎప్పటిలాగే మొదటి స్థానంలో దూసుకుపోగా, టీవీఎస్ జూపిటర్ 1,24,876 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానాన్ని సంపాదించింది. మొత్తం మీద, సుజుకి యాక్సెస్ 125 ఇప్పటికీ వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోకుండా, పోటీని తట్టుకుని నిలబడుతున్న స్కూటర్‌గానే కొనసాగుతోంది. కానీ, రాబోయే నెలల్లో అమ్మకాలను మరింత పెంచుకోవాలంటే, కొత్త ఫీచర్లు, ఆకర్షణీయ ఆఫర్లు, వినియోగదారుల అంచనాలకు సరిపోయే అప్‌డేట్‌లు ఇవ్వడం తప్పనిసరి అనిపిస్తోంది.
సుజుకి యాక్సెస్ 125 తన ధర, పనితీరు, విశ్వసనీయతతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దీని 86,000 నుండి రూ.1.04 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉండే ఈ స్కూటర్, సిటీ రైడర్లకు అనువైన మోడల్‌గా నిలుస్తోంది. పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే, 124 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇందులో అందించారు. ఇది 6500 rpm వద్ద 6.2 హార్స్‌పవర్, 5000 rpm వద్ద 10.2 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ శక్తివంతమైన ఇంజిన్ కారణంగా, స్కూటర్ 0 నుండి 60 కి.మీ. వేగాన్ని కేవలం 6.93 సెకన్లలోనే చేరుకుంటుంది. అలాగే గరిష్టంగా గంటకు 90 కి.మీ. వేగాన్ని సాధించగలదు. మైలేజ్ విషయానికి వస్తే 47 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే, 5 లీటర్ల వరకు ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో, పనితీరు కోరుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారింది.
సుజుకి యాక్సెస్ 125 కొత్త మోడల్ ఇప్పుడు లేటెస్ట్ ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా మారింది. ఇందులో 4.2-అంగుళాల TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు, ఇది రైడర్‌కి పూర్తి సమాచారాన్ని అందించడమే కాకుండా, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సౌకర్యాన్ని కూడా ఇస్తుంది. దీని ద్వారా గమ్యస్థానానికి సులభంగా చేరుకోవచ్చు. అదనంగా, USB ఛార్జింగ్ పోర్ట్‌ను అందించడం వల్ల ప్రయాణ సమయంలో మొబైల్ డివైజ్‌లను చార్జ్ చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.

రైడింగ్ కంఫర్ట్ విషయంలో కూడా యాక్సెస్ 125 ప్రత్యేకంగా నిలుస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉండటం వల్ల గట్టి రోడ్లపై కూడా సౌకర్యవంతమైన రైడ్ అనుభవం కలుగుతుంది. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌ల ఎంపికను అందించడం, రైడర్లకు అదనపు భరోసాన్నిస్తుంది. ఇది 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, ఇవి స్కూటర్‌కు స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాకుండా రోడ్ గ్రిప్‌ను మెరుగుపరుస్తాయి.


Click it and Unblock the Notifications








