ఛార్జింగ్ పెట్టండి..ఖర్చు లేకుండా రాకెట్లా దూసుకుపోండి..ఈ బైకులు మీ ఇంటి ముందుంటే ఆ కిక్కే వేరు!
నేటి కాలంలో పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తుండటంతో, అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపు మళ్లుతోంది. సాధారణంగా చాలామంది ఈవీ అనగానే స్కూటర్లే అనుకుంటారు, కానీ 2025 నాటికి భారతదేశంలో స్టైలిష్, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైకులు కూడా రాజ్యమేలుతున్నాయి. ఈ బైకులు కేవలం పర్యావరణానికే కాదు, మీ జేబుకు కూడా చాలా మేలు చేస్తాయి.
ఓలా రోడ్‌స్టర్ (Ola Roadster): ఎలక్ట్రిక్ స్కూటర్లతో సంచలనం సృష్టించిన ఓలా సంస్థ, ఇప్పుడు తన రోడ్‌స్టర్ సిరీస్ బైకులతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బైక్ మూడు వేర్వేరు వేరియంట్లలో (Roadster X, Roadster, Roadster Pro) లభిస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.1.04 లక్షల నుండి ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని ప్రో మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. అత్యాధునిక టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, సూపర్ స్పీడ్ దీని ప్రత్యేకతలు.

రివోల్ట్ ఆర్వీ 400 (Revolt RV 400): భారతదేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో వచ్చిన బైక్ ఇది. ఇప్పటికీ మార్కెట్‌లో దీని క్రేజ్ తగ్గలేదు. ఈ బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు వెళ్తుంది. దీని ప్రధాన ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇందులోని బ్యాటరీని మనం సులభంగా బయటకు తీసి (Removable Battery) మొబైల్ లాగా మన ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర సుమారు రూ. 1.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.
అల్ట్రా వయలెట్ ఎఫ్77 మాక్ 2 (Ultraviolette F77 Mach 2): మీరు స్పీడ్, స్పోర్ట్స్ లుక్‌ని ఇష్టపడే వారైతే ఇది మీకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది కేవలం ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు, ఒక సూపర్ బైక్ లాంటి పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 155 కి.మీ, ఒక్క ఛార్జ్‌తో దాదాపు 323 కి.మీ రేంజ్ అందిస్తుంది. దీని ధర రూ.2.99 లక్షల నుండి మొదలవుతుంది. టెక్నాలజీ పరంగా ఇది భారతదేశంలోనే అత్యంత అడ్వాన్స్‌డ్ బైక్ అని చెప్పవచ్చు.

ఓబెన్ రోర్ (Oben Rorr): తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజీ, స్పీడ్ కావాలనుకునే వారికి ఓబెన్ రోర్ ఒక వరం. ఇది కేవలం 3 సెకన్లలోనే 0 నుండి 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 187 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. దీని ధర సుమారు రూ. 1.49 లక్షల వరకు ఉంటుంది. ఇది రోజూ ఆఫీసులకు వెళ్లేవారికి, సిటీ డ్రైవింగ్‌కు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

అల్ట్రా వయలెట్ ఎక్స్47 క్రాస్ ఓవర్ (Ultraviolette X47): అడ్వెంచర్ రైడ్స్ చేయాలనుకునే వారి కోసం, ఎగుడుదిగుడు రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేలా దీనిని డిజైన్ చేశారు. దీని రేంజ్ కూడా దాదాపు 323 కి.మీ వరకు ఉంటుంది. దీని ధర సుమారు రూ. 2.49 లక్షలు. దీని డిజైన్, గ్రిప్ రోడ్డుపై మీకు తిరుగులేని రైడింగ్ అనుభూతిని ఇస్తాయి.


Click it and Unblock the Notifications








