కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే.. రూపాయి ఖర్చు లేకుండా రోజూ తిరగొచ్చు!

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి బడా బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్ ఖర్చు లేకుండా సిటీలో రోజూ తిరగడానికి వీలుగా ఉండటంతో స్టూడెంట్స్ ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు.

త్వరలో చాలా మంది కాలేజీలో అడుగుపెట్టబోతున్నారు కాబట్టి, వాళ్ల కోసం మార్కెట్లో లభించే కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ల లిస్ట్ ఇక్కడ ఉంది. మా లిస్ట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా తక్కువ ధరలో లభిస్తాయి. ఇవి ధర, విశ్వసనీయత రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మంచి ఆప్షన్‌గా నిలుస్తాయి.

Best Electric Scooters

ఓలా ఎస్1 ఎక్స్(Ola S1X): ఇది చాలా తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 108కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 101 కిలోమీటర్లు. 2కిలో‎వాట్(kWh) బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ధర రూ.79,999(ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది. 3కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ అయితే ఫుల్ ఛార్జ్‌పై 176కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

దీని ధర రూ.89,999. దీని టాప్ స్పీడ్ గంటకు 113 కిలోమీటర్లు. ఇక 4కిలో‎వాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ ధర రూ.99,999. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 242కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 123కిలోమీటర్లు. ఈ అన్ని మోడళ్లలో ముందు డిస్క్ బ్రేక్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్టాండర్డ్‌గా ఉంటాయి. ఇవి వైట్, బ్లూ, రెడ్, సిల్వర్, బ్లాక్ అనే 5కలర్ ఆప్షన్స్‌లో లభిస్తాయి.

Hero Vida

హీరో విడా వి2 (Hero Vida V2): కొత్తగా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వి2 లైట్, వి2 ప్లస్, వి2 ప్రో అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.74,000 (ఎక్స్-షోరూమ్). విడా వి2 ప్లస్ మోడల్ ధర రూ.82,800. ఇక విడా వి2 ప్రో మోడల్ ధర కాస్త ఎక్కువ అంటే అది రూ.1,20,300. విడా వి2 లైట్ ఎంట్రీ-లెవెల్ మోడల్.

ఇది 2.2కిలో‎వాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 94 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 69కిలోమీటర్లు. విడా వి2 ప్లస్ మిడ్-లెవెల్ మోడల్ 3.44కిలో‎వాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 143కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 85కిలోమీటర్లు. టాప్-ఎండ్ మోడల్ అయిన విడా వి2 ప్రో 3.94కిలో‎వాట్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

honda

ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు. అన్ని విడా వి2 మోడళ్లలోనూ దాదాపు ఒకే రకమైన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా 7-అంగుళాల టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రీ-జెన్ బ్రేకింగ్, కీ ఎంట్రీ, క్రూజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవి మ్యాట్ నెక్సస్ బ్లూ-గ్రే, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్ వంటి వివిధ కలర్స్‌లో లభిస్తాయి.

హోండా క్యూసి1(Honda QCi1): కొత్త హోండా క్యూసి1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.90,000 (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1.5 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని బ్యాటరీని 330W ఆఫ్-బోర్డ్ ఛార్జర్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు.

Ola

ఈ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ బ్రష్‌లెస్ డిసి మోటార్ ఉపయోగించారు. ఇది 1.8 kW (2.4 bhp) పవర్, 77 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. ఇది కేవలం 9.1 సెకన్లలో గంటకు 0 నుంచి 40కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్(TVS iQube): ఇది స్టాండర్డ్, ఎస్‌టి అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఐక్యూబ్ మోడల్ ధర రూ.1.07 లక్షల నుండి రూ.1.37 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 2.2 kWh, 3.4 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ స్టాండర్డ్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుండి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.

ఇందులో టిఎఫ్‌టి స్క్రీన్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వెహికల్ క్రాష్-టౌ అలర్ట్, 30లీటర్ల సీట్ బూట్ స్పేస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టి మోడల్ ధర రూ.1.56లక్షల నుండి రూ.1.85లక్షల వరకు ఉంటుంది. ఇది 3.4kWh, 5.1kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 100నుండి 150కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇది స్టార్‌లైట్ బ్లూ గ్లోస్సీ, టైటానియం గ్రే మ్యాట్ వంటి వివిధ కలర్స్‌లో లభిస్తుంది.

బజాజ్ చేతక్ 3503(Bajaj Chetak 3503): బజాజ్ చేతక్ 3503 చాలా తక్కువ ధరలో లభిస్తుంది. మధ్య తరగతి ప్రజలు దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 3.5 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. దీని బ్యాటరీని సాధారణ హోమ్ పవర్ సాకెట్ ద్వారా 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాలు పడుతుంది. ఇందులో ఎకో, స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 2, 2025, 10:15 [IST]
English summary
Best electric scooters for college students in india zero fuel cost commute
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+