Women's Day Special Gift: మహిళలకు ఉమెన్స్ డే స్పెషల్ ట్రీట్.. గిఫ్ట్‌గా బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చేయండి
ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women's Day)న ఎంతో ఘనంగా జరుపుతారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులను కాపాడేందుకు, లింగ అసమానతను తొలగించడానికి, వారిని ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఎదగడానికి 'ఉమెన్స్ డే'ను అన్ని దేశాల్లో ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక రోజును వారికి గుర్తిండి పోయేలా చేయడానికి అమ్మ, చెల్లి, భార్య మొదలగు వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్న వారు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా ఇచ్చినట్లయితే వారి ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం స్కూటర్లు వినియోగించే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగాలకు, కాలేజ్‌లు, ఇతర ఇంటి అవసరాలకు వారికి స్కూటర్లు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. మహిళల కోసం చాలా ఎలక్ట్రిక్ మోడళ్లు ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
వాటిలో నుంచి ఒకదాన్ని ఎంపిక చేసుకుని 'ఉమెన్స్ డే'నాడు తమ వారికి అందించినట్లయితే వారికి పెద్ద సర్‌ప్రైజ్ గిఫ్ట్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో మహిళలు సులభంగా నడపడానికి అందుబాటులో ఉన్న ఈవీ స్కూటర్లలో కొన్నింటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. హీరో విడా V2, TVS iQube, ఏథర్ రిజ్టా, బజాజ్ చేతక్ వంటివి బడ్జెట్ ధరలో లభించడంతో పాటు, మంచి బ్యాటరీతో మెరుగైన రేంజ్‌ను అందిస్తాయి.

TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్ ప్రస్తుతం మార్కెట్లో ప్రారంభ ధర రూ.1.07 లక్షల నుంచి రూ. 1.37 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది మహిళలు నడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇ స్కూటర్ 2.2 కిలోవాట్ (kWh), 3.04 కిలోవాట్ (kWh), 5.1 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. పూర్తి ఛార్జ్‌తో 75 నుంచి 150 కి.మీల వరకు రేంజ్‌ను అందిస్తుంది.
Hero Vida V2: దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో నుంచి వచ్చినటువంటి విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో వేరియంట్లలో అందుబాటులో ఉంది. V2 లైట్ ధర రూ.96,000, V2 ప్లస్ ధర రూ.1.15 లక్షలు, టాప్ వేరియంట్ V2 ప్రో ధర రూ.1.35 లక్షలు. ఇవన్నీ కూడా ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ ధఱ స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది.

ఉమెన్స్ డేకు గిఫ్ట్‌గా ఇవ్వాలని అనుకుంటున్న వారు తమ బడ్జెట్‌కు అనుగుణంగా నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక వీటి బ్యాటరీ విషయానికి వస్తే, మొదటి మోడల్ 2.2 కిలోవాట్ (kWh), రెండోది 3.44 కిలోవాట్ (kWh), మూడోది 3.94 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. పూర్తి ఛార్జ్‌తో విడా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ 94 నుంచి 16 కి.మీల రేంజ్ వరకు అందిస్తుంది.
Bajaj Chetak 35 Series: భారతీయ ప్రసిద్ధ టూవీలర్ కంపెనీ బజాజ్‌కు చెందిన చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో బాగా డిమాండ్ మోడల్‌గా ఇటీవల కాలంలో అవతరించింది. ఇది 3501, 3502 వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ.1.20 నుండి రూ. 1.27 లక్షల మధ్య ఉంటుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఇవి పూర్తి ఛార్జ్‌తో 150 కి.మీల రేంజ్ అందిస్తాయి.

Ather rizta: ఏథర్ రిజ్టా విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షల నుండి రూ. 1.46 లక్షల మధ్య కొనుగోలుకు లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది 2.9 కిలోవాట్ (kWh), 3.7 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌తో 120 నుంచి 160 కి.మీల వరకు రేంజ్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








