నగరాలు, గ్రామాల్లో సూపర్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చే టాప్ బెస్ట్ స్కూటర్లు.. రూ.80 వేల ప్రారంభ ధర.. 50+ మైలేజ్

ఇండియాలో పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకుని గ్రామీణ ఏరియాల్లో ఉన్న ప్రజల వరకు బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. రోజువారీ పనులు చేసుకోవడానికి టూవీలర్స్ ఇప్పుడు తప్పనిసరి. స్కూటర్ అయితే ఇలాంటి వాటికి చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. గేర్స్ లేకుండా మహిళలు, పురుషులు సులభంగా రైడ్ చేయడానికి ఇవి ఉత్తమమైన ఆప్షన్. ప్రస్తుతం మార్కెట్లో చాలా మోడళ్లు కొనుగోలుకు లభిస్తున్నాయి. కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారు వేటిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. తక్కువ ధరలో లభించడంతో పాటు, మంచి మైలేజ్ అందించే, మెరుగైన ఫెర్ఫామెన్స్‌ను ఇచ్చే స్కూటర్స్‌‌లో హోండా యాక్టివా,సుజుకి యాక్సెస్, హీరో డెస్టినీ, యమహా ఫాసినో వంటి మొదలగు టాప్ మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కొత్త స్కూటర్ కొనాలని అనుకుంటున్న వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ అవుతాయి. వీటి గురించి కింది కథనంలో తెలసుకుందాం.

Honda Activa 125: భారతీయ మార్కెట్లో స్కూటర్ అంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది హోండా యాక్టివానే. యాక్టివా 125 దేశంలో బాగా ప్రసిద్ధి చెందిన మోడల్. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 98,969 నుండి రూ. 1.03 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంది. 123.92 cc పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న ఇది ఫెర్ఫామెన్స్ విషయంలో రారాజు.

Best Perfomance Scooters

యాక్టివా 125 లీటర్ పెట్రోల్‌కు 47 కి.మీల పైనే మైలేజ్ అందిస్తుంది. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో అన్ని చోట్ల కూడా ఇది కనిపిస్తుంది. దీన్ని రైడ్ చేయడం చాలా సులభం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో అప్‌డేట్ అవుతుంది. ఈ స్కూటర్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, 4.2-అంగుళాల TFT కన్సోల్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మెరుగైన LED హెడ్‌లైట్, సస్పెన్షన్ సెటప్ వంటివి ఉన్నాయి.

Suzuki Access 125: యాక్టివా తరువాత ఇండియాలో స్కూటర్ విభాగంలో అత్యంత డిమాండ్ కలిగిన మోడల్ అంటే సుజుకి యాక్సెస్ 125నే. ఇది 124cc పెట్రోల్ ఇంజిన్‌‌తో రన్ అవుతుంది. లీటర్ పెట్రోల్‌కు 45 కి.మీల మైలేజ్ అందిస్తుంది. భారతీయ మార్కెట్లో ప్రారంభ ధర రూ. 81,700. దీని ఆకట్టుకునే డిజైన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇది స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి డజన్ల కొద్దీ ఫీచర్స్‌ను కలిగి ఉంది.

Suzuku Access 125

Hero Destini 125: హీరో డెస్టిని 125 స్కూటర్ విషయానికి వస్తే, మార్కెట్లో ఇది రూ. 82,586 ప్రారంభ ధర నుంచి రూ.92,436 వరకు లభిస్తుంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది 124.6 సిసి ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ప్రధానంగా మైలేజ్ గురించి తెలుసుకున్నట్లయితే లీటర్ పెట్రోల్‌కు దాదాపు 59 కి.మీల దూరం ప్రయాణిస్తుంది.

హీరో డెస్టిని 125 స్కూటర్ లైట్ వెయిట్ బరువుతో వస్తుంది. కంపెనీ పేర్కొన్న దాని దీని బరువు 115 కిలోలు. మహిళలు దీన్ని సులభంగా రైడ్ చేయవచ్చు. దీనిలో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, రైడింగ్‌లో స్కూటర్‌ను మెరుగ్గా కంట్రోల్ చేయడానికి డిస్క్, డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Best Mileage 125cc Scooters

Yamaha Fascino 125: యమహా ఫాసినో 125 స్టైలిష్ లుక్‌తో అందరిని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 49 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 76,133 (ఎక్స్-షోరూమ్). 125సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతున్న ఈ స్కూటర్ 8.04 PS హార్స్‌పవర్, 10.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 4, 2025, 12:40 [IST]
English summary
Best mileage 125cc scooters for city and village use activa access destini fascino
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+