లీటర్ పెట్రోల్‌తో 90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్! రూ.70 వేలకే వస్తుంది.. రోజూ ఆఫీసు వెళ్లేవారికి బెస్ట్ చాయిస్
భారతదేశంలో రోజూ స్కూటర్, బైక్ మీదే జీవితం సాగించే మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరలో లభిస్తూ, పెట్రోల్‌పై పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తూ మంచి మైలేజ్ అందించడంలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది మాములు టూవీలర్ కాదు, అది నిత్య జీవన భాగస్వామి. ఏప్రిల్ 2006లో ప్లాటినా బైక్ తొలిసారిగా రోడ్డుపైకి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు దశాబ్దాలకు చేరుకుంటున్నా, దీని డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. రోజూ ప్రయాణించాల్సిన ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు, చిన్న వ్యాపారస్తులు.. ఇలా అనేక రకాల వర్గాలకు ఇది అందుబాటులో ఉండే ఆప్షన్‌గానే నిలుస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా బైక్ కొనాలనుకునే వ్యక్తికి ఇది ఒక పెద్ద ఊరట.
పైగా, పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, ఈ బైక్ 70-90 కి.మీ. పైగా మైలేజ్ ఇవ్వడం పెద్ద ప్లస్ పాయింట్. రోజూ 30-40 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన వారికి ఇది నష్టమేనన్న భావన ఎప్పుడూ రాదు. ఇది చూడటానికి డిజైన్ పరంగా పెద్దగా అలంకారాలు లేకపోయినా, దీనిలో ఉన్న సింప్లిసిటీనే చాలా మందిని ఆకర్షిస్తోంది. వినియోగదారులకు అవసరమైన ఫీచర్లు, కనీసం తక్కువగా అనిపించకుండా ఉండే స్టైలిష్ లుక్స్ ఆకట్టుకుంటాయి.

బజాజ్ ప్లాటినా ఇప్పుడిది రెండు వేరియంట్లలో లభిస్తోంది. ప్లాటినా 100 ధర రూ.70,643 నుంచి ప్రారంభమవుతుంటే, మరోవైపు ప్లాటినా 110 ధర రూ. 74,694(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరగా అందుబాటులో ఉంది. ఈ ధరల్లోనే వినియోగదారులకు ఊహించనంత మైలేజ్ గ్యారంటీగా వస్తుండటం దీని సొంతం. బైక్‌లో 102 సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ వుంది. మిడిల్ క్లాస్ వ్యక్తి కోరుకునేంత శక్తి ఈ బైక్‌కి ఉంటుంది
ఇది 7.7 హెచ్‌పీ పవర్‌ను 7500 rpm వద్ద, 8.3 Nm టార్క్‌ను 5500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. నాలుగు గేర్‌లు.. అన్ని డౌన్ షిఫ్ట్ సిస్టమ్‌తో బైక్ డ్రైవింగ్ ఈజీగా ఉంటుంది. ఒక్క లీటర్ పెట్రోల్‌తో దాదాపు 70-90 కి.మీ. వరకూ నడిపిస్తుంది. అంటే రోజూ పెట్రోల్ ధరలపై కంగారు పడే పరిస్థితి ఉండదు. ఇది మెట్రో సిటీల్లో ట్రాఫిక్‌లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇది తేలికగా పోతుంది.

దీని ఫ్యూయల్ ట్యాంక్ 11 లీటర్లుగా ఉంది. బజాజ్ ప్లాటినాను సాధారణ మైలేజ్ బైక్‌గా చూడకూడదు. దీనిలో ఉన్న ఫీచర్లు, డిజైన్ పరంగా ఇచ్చిన జాగ్రత్తలు, యూజర్ కోసం చక్కగా ప్లాన్ చేసిన అంశాలు.. ఇవన్నీ కలిపి చూస్తే, ఇది క్లాస్‌లో బెస్ట్ అని చెప్పొచ్చు. ప్లాటినా 110 బాడీ డైమెన్షన్స్ పరంగా చూస్తే, దీని పొడవు 2,006 mm, వెడల్పు 713 mm, ఎత్తు 1,100 mmగా ఉంటుంది.
ఇక సీటు ఎత్తు 807 mm, దీని వలన చిన్నవాళ్లకి లేదా పెద్దవాళ్లకైనా డ్రైవింగ్ కంఫర్ట్‌గా ఉంటుంది. మొత్తం బైక్ బరువు 117 కిలోలు మాత్రమే. అంటే హ్యాండ్లింగ్ ఎంతో సులువుగా ఉంటుంది. ఇక ఫీచర్ల విషయంలోనూ ఇది బాగా ఆకట్టుకుంటుంది. ముందుభాగంలో హాలోజన్ హెడ్‌లైట్, ఆకర్షణీయమైన LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, వినియోగదారుల కోసం USB ఛార్జింగ్ పోర్ట్, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇవన్నీ ఉన్నాయి.

డాష్‌బోర్డ్ అనలాగ్ స్టైల్‌లోనే వస్తుంది, కానీ అవసరమైన సమాచారం అన్నీ క్లియర్‌గా కనిపించేలా ఉంటుంది. రైడింగ్ కంఫర్ట్ కోసం బజాజ్ ఇచ్చిన ప్రత్యేక టచ్ ఏమిటంటే - నైట్రోక్స్ టెక్నాలజీతో కూడిన స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్ (SOS) రియర్ సస్పెన్షన్. దీని వల్ల రన్నింగ్ స్మూత్‌గా ఉంటుంది, బంప్స్‌ను సులభంగా తట్టుకోగలదు. దీన్ని రోజువారీ ప్రయాణాల కోసం ఓ పర్ఫెక్ట్ మిషన్ అనచ్చు.


Click it and Unblock the Notifications








