ఒకసారి ట్యాంక్ నింపితే వందల కిలోమీటర్లు.. లక్ష రూపాయల లోపు మధ్యతరగతి ఫేవరేట్ బైక్‌లు ఇవే!

ఇండియాలో పేద, మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. తమ రోజువారి అవసరాల కోసం కచ్చితంగా టూవీలర్ ఉండాల్సిందే. ఉద్యోగాలకు వెళ్ళడానికి కూలి పనులకు, కాలేజ్‌లకు, వ్యవసాయ పనులకు, ఇతర ఇంటి అవసరాలకు టూవీలర్ లేనిదే ఏ పని జరగని రోజులు ఇవి. అయితే వారంతా కూడా ఎక్కువగా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్‌తో పాటు మెరుగైన పెర్ఫామెన్స్ అందించే వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. అలాంటివి ప్రస్తుతం మార్కెట్లో చాలా ఉన్నాయి. Hero Splendor Plus,Hero HF 100,TVS Radeon,TVS Sport, Hero Super Splendor,Bajaj Platina 100, Honda Shine 125,Hero HF Deluxe,Honda Shine 100 మోడల్స్ దేశంలో మధ్యతరగతి బైకులుగా ఉన్నాయి. వీటి ప్రస్తుత ధర, అలాగే ఫీచర్స్ గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

Hero Splendor Plus: ముందుగా హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ గురించి తెలుసుకుందా. ఇండియాలో హీరో టూవీలర్ అమ్మకాల్లో కంపెనీకి కీలకంగా నిలుస్తున్న మోడల్ ఏదంటే స్ప్లెండర్ ప్లస్ మాత్రమే. దీని ధర రూ. 77,226 నుంచి మొదలుకుని రూ. 79,836 (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయడానికి ఉంటుంది. ఇది 97.2-సిసి పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది. లీటరుకు ఏకంగా 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.

Best Mileage Bikes In India

హీరో స్ప్లెండర్ ప్లస్ చాలా కాలంగా మార్కెట్లో విజయవంతంగా అమ్ముడుపోతుంది. దీన్ని డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ. నగరాలతో పాటు పట్టణ ప్రాంతాలు, గ్రామీణ రోడ్లపై కూడా సునాయసంగా ప్రయాణాన్ని సాగిస్తుంది. ఇది డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో వచ్చింది. పాత మోడల్‌తో పోలిస్తే కొత్తగా అప్‌డేట్ మోడల్‌లో అదనంగా మరిన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ మోడల్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Hero HF 100: హీరో హెచ్‌ఎఫ్ 100 ధర రూ. 49,999(ఎక్స్-షోరూమ్). అతి తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ఇది సరైన ఆప్షన్. ఇది 97.2 సిసి పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీనికి జోడించారు. లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ముందు డ్రమ్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 9.1 లీటర్లు.

Hero Hf 100 Mileage

చాలా తక్కువ ఇంధన వినియోగంతో అధిక దూరం ప్రయాణించే బైక్‌గా మార్కెట్లోకి దీనికి మంచి పేరుంది. హీరో హెచ్‌ఎఫ్ 100 ఎరుపు- నలుపు, నీలం- నలుపు రంగు ఆప్షన్లలో కూడా లభిస్తుంది. కంపెనీ అమ్మకాల్లో ఈ మోడల్ చాలా కీలకంగా ఉంది. చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, రోజు అవసరాల కోసం దీన్ని అధికంగా కొనుగోలు చేస్తారు.

TVS Radeon: టీవీఎస్ రేడియన్ ధర రూ.70,573 నుండి రూ.84,150 (ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 109.7cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను దీనికి జోడించారు. లీటర్ పెట్రోల్‌కు 73.68 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లుగా ఉంది. కొత్త రేడియన్ బైక్ బరువు 113 కిలోలు.

Mileage Bikes In India For Common People

భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. టీవీఎస్ రేడియన్ మెటల్ బ్లాక్, రాయల్ పర్పుల్, బ్లూ, టైటానియా వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. లేటెస్ట్ మోడల్‌లో మొబైల్ ఛార్జింగ్ కోసం USB చార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అన్ని రకాల రోడ్లపై కూడా సాఫీ రైడింగ్ అందిస్తుంది. గుంతల రోడ్లపై కూగా దూసుకెళ్ళడానికి అత్యుత్తమ సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది.

TVS Sport: టీవీఎస్ స్పోర్ట్ ఇండియాలో ప్రసిద్ధ బైక్. ఇది 109.7 సిసి పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.67,722 నుండి రూ. 72,435(ఎక్స్-షోరూమ్) మధ్య కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను దీని ఇంజిన్‌కు జోడించారు. ఇది డ్రమ్ బ్రేక్‌లతో వచ్చింది. అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, సెల్ఫ్-స్టార్ట్ వంటివి దీనిలో ఉన్నాయి.

Common People Under Rs 1 Lakh Bikes

Hero Super Splendor: హీరో సూపర్ స్ప్లెండర్ XTEC విషయానికి వస్తే, దీని ధర రూ.. 84,050 నుంచి రూ. 88,050 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ది 124.7 cc పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. ఇది లీటర్ పెట్రోల్‌కు 69 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ఇంజిన్ 10.84 PS హార్స్‌పవర్, 10.6 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Bajaj Platina 100:
బజాజ్ ప్లాటినా 100 గురించి చూసినట్లయితే దీని ధర రూ. 69,369 (ఎక్స్-షోరూమ్). ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 102cc పెట్రోల్ ఇంజిన్‌తో, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. డ్రమ్ బ్రేక్ ద్వారా రైడర్లకు మరింత రక్షణ అందిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లుగా ఉంది. ఇది బ్లాక్- రెడ్, బ్లాక్- వెండి, బ్లాక్ -గోల్డ్ వంటి కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

Honda Shine 125: హోండా షైన్ 125 ఇండియాలో మధ్యతరగతి వినియోగదారులకు బాగా నచ్చిన వాటిలో ఒకటి. దేశీయంగా దీని ధర రూ. 84,551 నుండి రూ. 88,551(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 123.94 సిసి పెట్రోల్ ఇంజిన్‌లో రన్ అవుతుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను ఇంజిన్‌కు జోడించారు. ఈ బైక్ లీటరుకు 55 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటిని కలిగి ఉంది.

Hero HF Deluxe: హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ. 62,468 నుంచి రూ. 70,348 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 97.2 సీసీ పెట్రోల్ ఇంజన్‌తో, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీని బరువు 110 కిలోలు. ఇది అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఐడిల్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌తో సహా డజన్ల కొద్దీ లేటెస్ట్ ఆప్షన్లను కలిగి ఉంది.

Honda Shine 100: హోండా షైన్ 100 బైక్ 98.98 cc పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. లీటర్ పెట్రోల్‌కు 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దేశీయంగా దీని ధర రూ. 68,767 (ఎక్స్-షోరూమ్) .

More from DriveSpark

Article Published On: Tuesday, March 18, 2025, 13:26 [IST]
English summary
Best mileage bikes in india for common people under rs 1 lakh splendor plus tvs radeon etc
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+