మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం చూస్తున్నారా… అయితే ఈ స్కూటర్లపై ఓ లుక్కేయండి
దేశంలో టూ వీలర్ వినియోగదారులు రోజురోజుకు పెరుగుతున్నారు. అలా పని మీద బయటకు వెళ్లాలన్నా, ఆఫీసుకు వెళ్లాలన్నా, వీకెండ్లో టూర్‌కు వెళ్లాలన్నా.. బైకో లేదా స్కూటరో ఉండాల్సిందే. టూ వీలర్స్ జర్నీకి మాత్రమే కాదు, డబ్బులు సంపాదించడానికి కూడా కొందరికి ఉపయోగపడుతున్నాయి. స్విగ్గీ, జొమాటో, ర్యాపిడోల్లో పని చేసే గిగ్ వర్కర్స్‌కు టూ వీలర్సే జీవనాధారం. దానిపైనే వాళ్ల బతుకు బండి నడుస్తోంది. మైలేజీలో మెరుగ్గా ఉంటుందని కామన్ మ్యాన్స్ టూ వీలర్స్‌ను ఇష్టపడుతుంటారు. అయితే.. ప్రస్తుతం భారత్ లో తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఏం ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సౌకర్యవంతంగా ఉండడంతో పాటు, మైలేజీ కారణంగా చాలా మంది బైకుల కంటే స్కూటర్లను కొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రభుత్వ కర్బన ఉద్గారాల కట్టడి నిబంధనలకి లోబడి, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని స్కూటర్ల జాబితాను చూద్దాం. ఈ స్కూటర్లలో సుజుకీ, హోండా, యమహా, టీవీఎస్, హీరో వంటివి ఉన్నాయి.

Honda activa 6g: స్కూటర్లలో హోండా యాక్టివా స్కూటర్ దేశంలోనే టాప్ సెల్లర్‌గా కొనసాగుతోంది. బెంగళూరులో దీని ఆన్-రోడ్ ధర ప్రస్తుతం రూ.97,558 వద్ద ప్రారంభమవుతోంది. ఇది 60 kmpl మైలేజీ వరకు అందించగలదని హోండా సంస్థ చెబుతోంది. యాక్టివా 5జీకి అప్‌డేట్‌గా ఇది వచ్చింది.
Suzuki access 125: దిగ్గజ సంస్థ సుజకీ నుంచి వచ్చిన యాక్సెస్ 125 మోడల్ స్కూటర్ ఆన్-రోడ్ ధర బెంగళూరులో రూ.1,03,929 వద్ద ప్రారంభం అవుతుంది. 125 సీసీ సెగ్మెంట్లో స్టైలిష్ డిజైన్‌తో ఉండి, మంచి పర్ఫార్మెన్స్ ఇది అందిస్తుంది. ఈ స్కూటర్ లీటర్‌కు 64 కిలోమీటర్ల మైలేజీ అందించగలదని సుజుకీ సంస్థ చెబుతోంది.

Yamaha fascino 125: బెంగళూరులో యమహా ఫెసినో ధర రూ.1,04,179 వద్ద ప్రారంభం అవుతుంది. ఇది లీటర్ కు 68 కి.మీ.ల మైలేజీ అందించగలదని యమహా సంస్థ చెబుతోంది. 125 సీసీ సెగ్మెంట్ లో మైలేజీ విషయంలో ఇప్పటివరకే టాప్ ఇదే కావడం గమనార్హం.
Hero Pleasure +: దిగ్గజ టూ వీలర్ సంస్థ హీరో నుంచి ఫ్లాగ్‌షిప్ స్కూటర్ అయిన హీరో ప్లెషర్ ప్లస్.. వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. బెంగుళూరులో దీని ఆన్ రోడ్ ధర రూ.1,00,082 వద్ద ప్రారంభం అవుతుంది. ఇది లీటర్‌కు 63 కిలో మీటర్ల మైలేజీ అందించగలదని హీరో సంస్థ అంటోంది.
Tvs jupiter: ఇతర సంస్థల స్కూటర్ల తరహాలోనే.. టీవీఎస్ సంస్థ నుంచి జూపిటర్ మోడల్ స్కూటర్ కూడా సేల్స్‌లో దూసుకుపోతోంది. ఇది లీటర్‌కు 62 కి.మీ.ల మైలేజీ అందించగలదని టీవీఎస్ మోటార్స్ సంస్థ చెబుతోంది. బెంగళూరులోని దీని ఆన్- రోడ్ ధర రూ. 96,757 వద్ద మొదలవుతోంది.
ఈ స్కూటర్లన్నీ కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మోడళ్లే. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వినియోగదారులకు ఇవి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. రోజువారి అవసరాలకు ఇవి చాలా అనువుగా ఉంటాయి. పేద, మధ్య తరగతి వారికి మంచి ఎంపిక అవుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








