రోజూ పిల్లల స్కూల్ డ్రాప్, షాపింగ్, ఆఫీస్.. మహిళలకు సరిపోయే పర్ఫెక్ట్ స్కూటర్లు ఇవే!
జూన్ వచ్చేసరికి స్కూళ్లు తెరుచుకున్నాయి. పిల్లల కోసం బాక్సులు రెడీ చేయడం, టైమ్‌కు డ్రాప్ చేయడం ప్రతి తల్లికి నిత్యం జరిగే మిషన్‌లా మారిపోతుంది. అలాంటి తక్షణ పనుల్లో నడిచే మహిళలకు ఒక మంచి స్కూటర్ ఎంతగానో అవసరం. ఇవాళ్టి రోజులలో మహిళలు ఒక్క స్కూల్ డ్రాప్‌కే కాకుండా మార్కెట్‌కు షాపింగ్‌కు, పని స్థలాలకు కూడా అదే వాహనాన్ని వాడతారు. అందుకే తక్కువ బరువుతో, తిరగడానికి సులభంగా ఉండే స్కూటర్ ఉండాలి. ఆపైన ఎక్కువ మైలేజ్‌తో పాటు, స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్స్‌లు, మార్కెట్ కవర్లు పెట్టుకునే స్టోరేజ్ ఉన్న మోడల్స్‌నే వారు ఎక్కువగా ఇష్టపడతారు.
ట్రాఫిక్‌ను తేలిగ్గా మేనేజ్ చేయగలిగేలా ఉండటం, స్టార్ట్-స్టాప్ డ్రైవింగ్‌కి అనుకూలంగా ఉండటంతో పాటు, సురక్షితమైన బ్రేకింగ్ సిస్టమ్ ఉండటం కూడా స్కూటర్ ఎంపికలో కీలకం అవుతోంది. ఇలాంటి అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో కొన్ని స్కూటర్లు మహిళలకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తున్నాయి. మంచి మైలేజ్, విశాలమైన బూట్ స్పేస్, స్మూత్ డ్రైవింగ్‌తో మార్కెట్‌లో కొన్ని స్కూటర్లు రెడీగా ఉన్నాయి. వాటి గురించి కింద తెలుసుకుందాం.

TVS Jupiter 110: ఇది రోజూ స్కూల్ డ్రాప్, షాపింగ్, ఆఫీస్ రైడ్స్‌కు అనువైన మోడల్. దీని ధర రూ.77,000 నుండి రూ.90,000 (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తోంది. ఈ స్కూటర్‌లో 113cc పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. ఇది గరిష్ఠంగా 7.91 PS పవర్, 9.8 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ నగర ప్రయాణాల్లో లీటర్ 48 కి.మీల వరకు మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం ఉంది.
స్కూల్ పిల్లల బ్యాగ్, లంచ్ బాక్స్ ఇతర వస్తువులు పెట్టుకోవడానికి సరిపడా స్థలం దీనిలో ఉంటుంది. జుపిటర్‌లో డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇది రైడింగ్‌కి అదనపు భద్రతను అందిస్తుంది. ట్రాఫిక్‌లో బ్రేకింగ్ శక్తివంతంగా పని చేయడంతో డ్రైవింగ్ మరింత నమ్మకంగా మారుతుంది. ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, యూఎస్‌బీ ఛార్జర్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.

Honda Activa 110: హోండా యాక్టివా 110 చాలా సంవత్సరాలుగా ఇది భారతీయ మార్కెట్లో ఒక పెద్ద బ్రాండ్‌గా నిలుస్తోంది. పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లడానికి మహిళలకు చాలా బెస్ట్ మోడల్. రోజువారీ ప్రయాణాల కోసం మంచి ఆప్షన్. ఈ స్కూటర్ ప్రస్తుతం ఎక్స్-షోరూమ్ ధర సుమారుగా రూ.80,000 ఉంది. దీని 109.51 సీసీ పెట్రోల్ ఇంజిన్ విశ్వసనీయమైన పనితీరుతో పాటు, సగటున 45 కిలోమీటర్లకు మించిన మైలేజ్‌ను అందిస్తుంది
ఇంజిన్ శక్తితో పాటు టెక్నాలజీ పరంగానూ యాక్టివా 110 దూసుకుపోతోంది. ఇందులో 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది, ఇది రైడింగ్ అనుభవాన్ని మరింత స్మార్ట్‌గా మార్చుతుంది. అలాగే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. మహిళలు ఈ స్కూటర్‌ను సులభమైన హ్యాండ్లింగ్ చేయగలరు. అలాగే, మినిమమ్ మెయింటెనెన్స్ హోండా యాక్టివాను నేటికి మహిళలకు తొలి ఎంపికగా నిలబెట్టాయి.

Hero Pleasure Plus: హీరో ప్లెషర్ ప్లస్ మహిళలకు చాలా అనువైన మోడల్. ఇది చాలా తక్కువ ఖర్చుతో లభించడమే కాకుండా, స్టైలిష్ లుక్‌తో వినియోగదారుల అవసరాలకు సరిపోయే అన్ని అంశాలతో వచ్చింది. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ.71,000 నుండి రూ.83,000(ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది. ముఖ్యంగా మహిళల కోసం తేలికగా నడిపేందుకు, స్మార్ట్‌గా కనిపించేలా డిజైన్ చేయబడిన ఈ మోడల్‌లో 110 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉండటం విశేషం.
ఇది లీటరుకు సగటున 50 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు, ఇది రోజువారీ ప్రయాణాల కోసం చాలా చక్కటి ఎంపికగా నిలుస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, క్లియర్ LCD డిజిటల్ డాష్ వంటి లేటెస్ట్ అంశాలు ఉన్నాయి. ఇది నైట్ రైడింగ్‌కి మరింత సురక్షితంగా, క్లియర్ విజిబిలిటీతో సహాయపడతాయి. అలాగే 4.8 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉన్నది, దూర ప్రయాణాలకూ నమ్మకంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








