షోరూమ్‌కి వెళ్తే సగం మంది వీటినే అడుగుతున్నారు..2025లో దుమ్మురేపిన టాప్ 5 స్కూటర్లు ఇవే

ప్రస్తుత రోజుల్లో సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించాలన్నా లేదా ఆఫీసు పనులకు వెళ్లాలన్నా బైక్ కంటే స్కూటర్లకే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్, కాలిక కింద సామాన్లు పెట్టుకునే స్పేస్, గేర్లతో పనిలేని డ్రైవింగ్ వెసులుబాటు వల్ల ప్రతి ఇంట్లోనూ స్కూటర్ ఒక భాగంగా మారిపోయింది. ముగియనున్న 2025 ఏడాదికి సంబంధించి సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, షోరూమ్‌కు వెళ్లే సగం మంది కస్టమర్లు కేవలం ఈ 5 స్కూటర్లలో ఒకదానినే ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అవేంటో చూద్దాం.

హోండా యాక్టివా (Honda Activa): భారతదేశంలో స్కూటర్ అంటే మొదట గుర్తొచ్చే పేరు యాక్టివా. కొన్నేళ్లుగా మార్కెట్ లీడర్‌గా ఉన్న యాక్టివా, 2025లో కూడా తన నంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంది. ఈ స్కూటర్ పై ఉన్న నమ్మకం, బలమైన బాడీ, అదిరిపోయే మైలేజీ దీని సక్సెస్ సీక్రెట్. యాక్టివా ప్రస్తుతం 110cc, 125cc ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. కేవలం ఫ్యామిలీస్ మాత్రమే కాదు, ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫీచర్ల వల్ల యువత కూడా యాక్టివా వైపు మొగ్గు చూపుతున్నారు.

Best Selling Scooters in India 2025 Honda Activa to TVS NTorq Top 5 Models Ruling the Indian Roads

టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter): యాక్టివాకు గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో నిలిచింది టీవీఎస్ జూపిటర్. ఇందులో ఉన్న పెద్ద చక్రాలు, ఈజీ మొబిలిటీ ఫీచర్ వల్ల గుంతల రోడ్లపై కూడా సాఫీగా వెళ్లవచ్చు. జూపిటర్ కూడా 110cc, 125cc వేరియంట్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇందులో ఉండే ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిలింగ్ (సీటు తీయకుండా పెట్రోల్ కొట్టించుకోవడం) ఫీచర్ కస్టమర్లకు ఎంతో నచ్చుతుంది.

Best Selling Scooters in India 2025 Honda Activa to TVS NTorq Top 5 Models Ruling the Indian Roads

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125): సుజుకి కంపెనీకి అత్యధిక సేల్స్ తెచ్చిపెడుతున్న స్కూటర్ ఇది. క్లాసిక్ రెట్రో లుక్ తో ఉండే యాక్సెస్ 125, యువతను, ఉద్యోగులను బాగా ఆకట్టుకుంటోంది. దీని ప్రారంభ ధర రూ.80,891 కాగా, టాప్ మోడల్ ధర రూ.97,084 వరకు ఉంది. ఇందులో ఉన్న 124cc ఇంజిన్ మంచి పవర్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా, రైడ్ కనెక్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో రైడింగ్ అనుభూతిని మెరుగుపరుస్తుంది.

Best Selling Scooters in India 2025 Honda Activa to TVS NTorq Top 5 Models Ruling the Indian Roads

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS NTorq 125): మీరు స్పోర్టీ లుక్, హై-స్పీడ్ కావాలనుకుంటే ఎన్‌టార్క్ కి తిరుగులేదు. యువతను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ స్కూటర్, కేవలం 7.9 సెకన్లలోనే 0 నుంచి 60 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ఇంజిన్ సౌండ్ కూడా బైక్ లాగా ఉండటం యువతకు ఒక క్రేజ్. బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యాప్ నావిగేషన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Best Selling Scooters in India 2025 Honda Activa to TVS NTorq Top 5 Models Ruling the Indian Roads

హోండా డియో (Honda Dio): ఈ లిస్ట్‌లో ఐదో స్థానంలో నిలిచింది హోండా డియో. స్టైలిష్ గ్రాఫిక్స్, అగ్రెసివ్ ఫ్రంట్ లుక్ వల్ల కాలేజీ స్టూడెంట్స్ కి ఇది ఫేవరెట్. తక్కువ బరువు ఉండటం వల్ల ట్రాఫిక్‌లో సులభంగా దూసుకెళ్లవచ్చు. ఇది కూడా 110cc, 125cc వెర్షన్లలో అందుబాటులో ఉంది. అద్భుతమైన థ్రోటిల్ రెస్పాన్స్ వల్ల ఈ స్కూటర్ నడపడం చాలా సరదాగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, December 29, 2025, 13:56 [IST]
English summary
Best selling scooters in india 2025 honda activa to tvs ntorq top 5 models ruling the indian roads
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+