రూ.60 వేల ధరలో 65 కి.మీల పైనే మైలేజ్ ఇచ్చే బైక్ కావాలా? అయితే దేశంలో డిమాండ్ ఉన్న ఈ మోడళ్లపై ఓ లుక్కేయండి

ఇండియాలో రోజువారీ ప్రయాణాల కోసం టూవీలర్ తప్పనిసరి. ప్రతిరోజు ఇబ్బంది పడుకుంటూ ఉద్యోగాలకు, కాలేజ్‌లు, ఇతర చిన్న అవసరాల కోసం బస్సులు, ఆటోలు వంటి వాటిల్లో ప్రయాణించడం కంటే ఒక టూవీలర్ కొంటే అన్ని పనులు చేసుకోవచ్చని చాలా మంది బైక్ లేదా స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 80 శాతానికి పైగా ఇళ్లల్లో కనీసం ఒక్క టూవీలర్ అయిన తప్పనిసరిగా ఉంటుంది. ప్రధానంగా దేశంలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. తక్కువ ధరలో రోజవారి ప్రయాణాలకు ఎక్కువ మైలేజ్ అందించే బైక్స్‌లను కొనుగోలు చేయడానికి వారు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే తయారీదారులు కూడా అందుబాటు ధరల్లోనే పలు మోడళ్లు విడుదల చేస్తున్నారు.

ఇటీవల కాలంలో మార్కెట్లో చాలా కొత్త మోడళ్లు లాంచ్ అయ్యాయి. అయితే కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారు ఏ మోడల్‌ను కొనుగోలు చేయలో తెలియక సతమతం అవుతున్నారు. అలాంటి వారి కోసం కొన్ని ఎంపిక చేసిన బడ్జెట్ ధరలో లభించే బైక్స్ గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది.

Best Two Wheelers That Give 65 Km Mileage

Hero Hf 100: మొదటగా హీరో హెచ్‌ఎఫ్ 100 గురించి తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో పేద, మధ్యతరగతి వారు కొనగలిగే విధంగా అతి తక్కువ ధరలో లభించే బైక్స్‌లలో ఇది ప్రసిద్ధ మోడల్. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ.49,999. ఇది ఎక్స్‌ షోరూమ్ ధర. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు ఏకంగా 70 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100కి పైనే ఉంది.

ఇలాంటి సమయంలో ఇంత మైలేజ్ ఇచ్చే బైక్‌ను తీసుకోవడం ద్వారా డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఇంజిన్ విషయానికి వస్తే, 97.2 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 8.02 PS హార్స్‌పవర్, 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు. ఇది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి వాటిని కలిగి ఉంది.

Best Two Wheelers That Give 65 Km Mileage Tvs Spor

TVS Sport: tvs స్పోర్ట్ విషయానికి వస్తే, బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ అందించే వాటిలో ఇది కూడా ప్రసిద్ధ మోడల్. ప్రస్తుతం మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.67,722 నుంచి మొదలుకుని రూ.72,435 మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరికొంత అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోలుకు 70 కి.మీలమ మైలేజ్‌ను అందిస్తుంది.

ఇది 109.7 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 8.19 PS హార్స్‌పవర్, 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జత చేశారు. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కి.మీలుగా ఉంది. బరువు కూడా తక్కువగా 112 కిలోల వరకు ఉంటుంది. ఇది ముందు బల్బ్ రకం హెడ్‌లైట్, సెల్ఫ్-స్టార్ట్ ఆప్షన్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

Best Two Wheelers That Give 65 Km Mileage Tvs Xl100

TVS XL 100: టీవీఎస్ కంపెనీకి చెందిన పేదవారి ఫేవరెట్ మోడల్ ఎక్స్‌ఎల్100 భారతీయ మార్కెట్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. దీని ప్రారంభ ధర రూ.45,999 ఎక్స్-షోరూమ్. ఇది వ్యవసాయ పనులకు అత్యుత్తమైన బైక్. ఈ కొత్త XL 100 మోపెడ్ లీటర్ పెట్రోల్‌కు దాదాపు 65 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

ఎంత లగేజీ ఉన్నప్పటికి కూడా చాలా సులువుగా మోసుకెళ్లే బైక్‌గా దీనికి ప్రజల్లో మంచి పేరుంది. XL 100 మోపెడ్ సస్పెన్షన్ సెటప్‌ కస్టమర్లకు కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌ను అందించారు. డ్రైవింగ్ చేసేసమయంలో స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి ఇది డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఈ మోడల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు ఇతర ఫీచర్స్‌తో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 6, 2025, 10:54 [IST]
English summary
Best two wheelers that give 65 km mileage tvs sport hero hf 100 and xl
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+