ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేయనున్న హీరో.. బ్యాటరీకి డబ్బులు కట్టక్కర్లేదట

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో హీరో మోటోకార్ప్ కొత్త విప్లవం సెన్సేషన్ రెడీ అవుతుంది. తమ ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ అయిన విడా నుంచి జూలై 1 న విడా VX2 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే దీని టీజర్లు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ స్కూటర్‌ను 'బ్యాటరీ స్ ఎ సర్వీస్' ప్లాన్ కింద అందించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

Hero

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో వస్తున్న మార్పులను గుర్తించిన హీరో మోటోకార్ప్, విడా అనే బ్రాండ్‌ను క్రియేట్ చేసి మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయిస్తుంది. ఇప్పటికే విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు అదే స్కూటర్ తక్కువ ధర వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది.

దాని ప్రకారమే, హీరో విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ లాగానే, తక్కువ ధరలో హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జూలై 1న మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో కొత్త సమాచారం బయటకు వచ్చింది. అదేంటంటే, కస్టమర్లు ఈ స్కూటర్‌ను 'బ్యాటరీ స్ ఎ సర్వీస్' విధానంలో కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

Hero Bike

ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ ఎంజీ కంపెనీ తమ ఎంజీ విండ్సర్ ఈవీ కారును ఎలా అమ్ముతోందో, అదే పద్ధతిలో హీరో మోటోకార్ప్ కూడా తన విడా VX2ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అమ్మాలని ప్లాన్ చేస్తోంది. దీనివల్ల కస్టమర్లు మొదట్లో చాలా తక్కువ ఖర్చుతో ఈ వెహికల్ కొనుగోలు చేయగలరు. ఆ తర్వాత వారు స్కూటర్‌ను వాడుతున్న కొద్దీ, వాడిన దానికి మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఇది కస్టమర్లలో బ్యాటరీపై భయాలను తొలగిస్తుంది.

అంతేకాకుండా, మరో ఆప్షన్ కూడా ఉంది. వాహనానికి విడిగా, బ్యాటరీకి విడిగా ఫైనాన్స్ ఆప్షన్ ద్వారా కూడా వెహికల్ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. అంటే, కేవలం వాహనానికి మాత్రమే EMI కట్టే విధంగా, బ్యాటరీకి వేరే EMI కట్టేలా ఆప్షన్లు ఉంటాయి. మామూలుగా బ్యాటరీతో సహా పూర్తి స్కూటర్‌ను సొంతంగా కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లకు ఆ ఆప్షన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.

హీరో విడా VX2 వాహనంలో చాలా ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇప్పటికే విడా వాహనంలో మూడు వేర్వేరు వేరియంట్లు ఉన్నాయి. లైట్, ప్లస్, ప్రో. లైట్ వేరియంర్లో 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 94 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. గరిష్టంగా 69 కి.మీ. వేగంతో వెళ్తుంది. ఇందులో ఎకో, రైడ్ మోడ్‌లు ఉంటాయి.

మిడ్-వేరియంట్ అయిన ప్లస్ వేరియంట్లో 3.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 143 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది. గరిష్టంగా 85 కి.మీ. వేగంతో వెళ్తుంది. ఇందులో సిటీ, ఎకో, స్పోర్ట్ అనే రైడ్ మోడ్‌లు ఉంటాయి.

టాప్ వేరియంట్ అయిన ప్రో వేరియంట్లో 3.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 165 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది. గరిష్టంగా 90 కి.మీ. వేగంతో వెళ్తుంది. ఇదే ఆప్షన్లు విడా VX2 స్కూటర్‌లో కూడా ఉంటాయని ఆశించవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఎదురయ్యే ప్రధాన సమస్యలు రెండు: అధిక ధర, బ్యాటరీపై నమ్మకం లేకపోవడం. ఈ రెండింటినీ పరిష్కరించే విధంగా 'బ్యాటరీ స్ ఎ సర్వీస్' అనే పథకాన్ని హీరో తీసుకువచ్చింది. ఇది కచ్చితంగా కస్టమర్ల మధ్య మంచి ఆదరణ పొందుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 19, 2025, 14:40 [IST]
English summary
Beyond the price tag what makes the vida vx2 a potential market disruptor on july 1st
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+