కళ్లు మూసి తెరిచేలోపు మాయం.. ఆటో ఎక్స్‌పోలో రాకెట్ వేగంతో దూసుకుపోయే బైక్‌ను విడుదల చేసిన BMW
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇది లగ్జరీ కార్లతో పాటు బైక్స్‌ను కూడా విడుదల చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టూవీలర్లను లాంచ్ చేస్తుంది. దేశంలో కార్ల విభాగంతో పాటు, బైక్స్ అమ్మకాల్లో కూడా మెరుగైన సేల్స్‌ను సాధిస్తున్న కంపెనీ తాజాగా S1000 RR బైక్‌ను విడుదల చేసింది. దీనిని 2024 ఏడాది అక్టోబర్‌లో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు దీన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమను మన తిప్పుకునేలా ఎంతో అట్టహసంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో విడుదల చేసింది. జనవరి 17 నుంచి మొదలైన ఈ ఈవెంట్ 22వ తేదీ వరకు జరుగుతుంది.
ఈ షోలో ఇతర వాహన తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను విడుదల చేస్తుండగా, ఇప్పుడు జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ (BMW) S1000 RRను తీసుకొచ్చి భారత టూవీలర్ మార్కెట్లో తన సత్తాను చాటుకోడానికి సిద్ధమైంది. దీని ధర రూ.21.10 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రస్తుతం దీనికి సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ లగ్జరీ బైకును కొనుగోలు చేయాలనుకునే వారు ముందస్తు బుకింగ్ చేసుకోవడం ఉత్తమం. డెలివరీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉంటాయి.

BMW S1000 RR బైక్ 999 cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ స్పోర్ట్ బైక్ దాదాపు 210 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంది. ఇది బ్లూస్టోన్ మెటాలిక్ విత్ మ్యాట్ గ్రాఫిక్స్, బైక్ బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, లైట్‌వైట్ యూని/ఎమ్ మోటార్‌స్పోర్ట్ కలర్ వేరయంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఈ ఇంజిన్ శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంటుంది.
BMW S1000RR బైక్ టాప్ స్పీడ్ 300 కి.మీ. ఇది కేవలం 3 సెకన్లలో 0-100 kmph నుండి వేగాన్ని చేరుకుంటుంది. దీని పెర్ఫామెన్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా కంపెనీ అన్నింటిని అందించింది. దీని చూడటానికి మాస్ లుక్‌తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో చాలా మంది యూత్ ప్రీమియం బైక్‌లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారికి ఇది సరైన ఆప్షన్ అవుతుంది.

ఈ బైక్ కఠినమైన రూపాన్ని కలిగి ఉంది. ఫీచర్స్ పరంగా అధునాతనమైనవి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ ఛాసిస్, హీటెడ్ గ్రిప్ కంట్రోల్, రైన్, రోడ్, రేస్, డైనమిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్స్‌లను కలిగి ఉంటుంది. బ్రేక్‌ను మరింత అప్‌డేట్‌గా ఇవ్వడానికి ఇంటిగ్రేటెడ్ బ్రేక్ డక్ట్‌లతో రీడిజైన్ చేశారు. దీని ట్విన్ హెడ్‌ల్యాంప్ కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చింది.
BMW ఇండియా S 1000 RR బైక్‌తో పాటు ఇంకా ఇదే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో R 1300 GS అడ్వెంచర్‌ను కూడా విడుదల చేసింది. ఈ రెండు బైకులు కూడా చాలా అధునాతనంగా ఉన్నాయి. ఇవి ఇండియాలో BMW మోటోరాడ్ డీలర్‌షిప్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుంగా ఈ ఈవెంట్‌లో కంపెనీ ఇతర మోడళ్లను కూడా ప్రదర్శించింది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








