ఒక్క లీటర్ పెట్రోల్‌తో ఊరంతా తిరగొచ్చు! రూ.67 వేలకే వస్తోంది.. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఎలాంటి టెన్షన్ ఉండదు
హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ రోజువారీ అవసరాల కోసం ఎంతో మంది వినియోగదారులు ఇష్టపడే మోడల్‌గా నిలుస్తోంది. ఇది చాలా కాలంగా తన నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మద్దతు పొందుతూ వస్తోంది. ముఖ్యంగా, అందుబాటులో ఉండే ధర, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉండటంతో, ఇది మిడిల్ క్లాస్ ప్రజలకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు తాజా అమ్మకాల పరంగా చూస్తే, జూన్ నెలలో ఈ బైక్ అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిళ్ల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్‌లో యధావిధిగా విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, హెచ్‌ఎఫ్ డీలక్స్ తన స్థానం కోల్పోకుండా నిలబడటమంటేనే ఈ బైక్‌కి ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.
ఈ బైక్‌ను చాలామంది తమ మొదటి బైక్‌గా భావిస్తూ, కలలుగా కొనుగోలు చేస్తున్నారు. దీని సరళమైన డిజైన్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ లక్షణాలు, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ ఉపయోగం అనే అంశాలతో ప్రజలకు బాగా చేరువ అయింది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ జూన్ 2024లో అమ్ముడైన యూనిట్ల సంఖ్య 89,941 కాగా, ఈ ఏడాది జూన్ 2025లో మాత్రం మొత్తం 1,00,878 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాదిలో అమ్మకాలు 12.16 శాతం పెరిగాయి.

ఇది హీరో కంపెనీకి మంచి గర్వకారణమే కాకుండా, హెచ్‌ఎఫ్ డీలక్స్‌కి ఇంకా ఎంత డిమాండ్ ఉందో సూచిస్తుంది. ఈ జాబితాలో టాప్ స్థానంలో హీరో స్ప్లెండర్ ఉంది, 3,31,057 యూనిట్లతో తన స్థానాన్ని దృఢంగా పట్టుకుంది. రెండవ స్థానంలో హోండా షైన్ నిలిచింది, 1,43,218 యూనిట్ల అమ్మకాలతో. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ హోండా షైన్ బైక్‌కి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
హెచ్‌ఎఫ్ డీలక్స్ ఒక సింపుల్ కానీ స్టైలిష్ లుక్‌తో వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగరాల్లోనూ ఒకేలా కనిపించేలా, అందరికీ నచ్చేలా రూపొందించబడింది. దానికి తోడు, పర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా ఉండటంతో, ప్రతి కుటుంబం ఈ బైక్‌నే ఎంపిక చేస్తోంది. ఇది తక్కువ ధరలో దొరుకుతోంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.67 వేల నుంచి నుండి ప్రారంభమవుతుంది, ఈ ధరకు LED హెడ్‌ల్యాంప్, స్పోర్టీ గ్రాఫిక్స్, ఇంకా బలమైన బాడీ ప్యానల్స్ లభిస్తున్నాయి.

ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 97.2cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. దీంతో 8.02 PS పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ స్మూత్ షిఫ్టింగ్‌ను అందిస్తుంది. రోజువారీ ప్రయాణానికి బాగా సరిపోతుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఇది ఈ బైక్‌కు గొప్ప గుర్తింపు తెచ్చింది. లీటర్‌కు 70 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలదు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న కాలంలో ఇది బెస్ట్.
ఈ బైక్‌లో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. డిజైన్ పరంగా 1965 మి.మీ. పొడవు, 720 మి.మీ. వెడల్పు, 1045 మి.మీ. ఎత్తు కలిగి ఉంది. 165 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌తో గ్రామీణ ప్రాంతాల్లో సాఫీగా ప్రయాణించొచ్చు. 1235 మి.మీ. వీల్ బేస్ వలన సౌకర్యవంతమైన రైడ్‌కు అవకాశం ఉంది. ఇటీవల , హీరో HF డీలక్స్ ప్రో కూడా విడుదల అయింది.
దీని ధర రూ.73,550 ఢిల్లీ ఎక్స్ షోరూమ్. ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 97.2 cc ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. దీన్ని 4-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేశారు. ఇది డైలీ యూజ్ కోసం బాగా సరిపోతుంది. మొత్తానికి చూస్తే, ఇది ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, డ్యూరబిలిటీ, స్టైలింగ్, ఆధునిక ఫీచర్ల కోసం చూస్తున్న వారికి బాగా ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








