కేవలం రూ.65 వేలకే 90 కి.మీ మైలేజ్ ఇచ్చే బైక్! రోజూ ఆఫీసు వెళ్లేవారికి బెస్ట్.. 100 కొట్టిస్తే చాలు!
భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఏ బైక్ అయినా విజయాన్ని సాధించాలంటే ఒక విషయం మాత్రం ఖాయం.. తక్కువ ధరతో పాటు అధిక మైలేజీ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మన దేశంలో పెద్దఎత్తున పనిచేసే జనాభా రోజూ దూర ప్రయాణాలు చేస్తుంటారు. పెరుగుతున్న ఇంధన ధరలను చూసి చాలామందికి ప్రతిరోజూ పెట్రోల్ ఖర్చు భారంగా అనిపిస్తోంది. అలాంటి సమయంలో తక్కువ ఖర్చుతో నడిచే, లీటరుకు ఎక్కువ కిలోమీటర్లు ఇచ్చే బైక్‌కి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇదే సందర్భంలో బజాజ్ కంపెనీకి చెందిన ప్లాటినా (Bajaj Platina) ఎప్పటినుంచో వినియోగదారుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ బైక్ మార్కెట్లోకి వచ్చిన నాటి నుంచి మైలేజ్ కింగ్ అనే పేరును గట్టిగా నిలబెట్టుకుంది.
తక్కువ ధర, సింపుల్ మెయింటెనెన్స్, తక్కువ రన్నింగ్ ఖర్చులు.. మొత్తంగా మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌కి బాగా సరిపోయేలా ఉంటుంది. రోజువారీ పని కోసం బైక్ అవసరమయ్యే వారికి ప్లాటినా ఒక సేఫ్, విశ్వసనీయ ఎంపికగా మారింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ బైక్ రియల్-వరల్డ్ రైడింగ్‌లో కూడా అద్భుత మైలేజీని ఇస్తుంది. సగటున 75 నుండి 90 కిలోమీటర్ల వరకు లీటరుకు ఇస్తుందని చాలా మంది వినియోగదారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ బైక్ రెండు ప్రధాన వెర్షన్లలో బజాజ్ ప్లాటినా 100, బజాజ్ ప్లాటినా 110 డ్రమ్‌లలో మార్కెట్లో లభిస్తోంది. ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా ప్లాటినా 100ను ఎంతో ఆకర్షణీయమైన ధరలో అందిస్తున్నారు. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 65,407, ఇది రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి, డెలివరీ రైడర్లకు, బడ్జెట్‌లో బైక్ కొనాలనుకునే వారికి ఒక బెస్ట్ ఛాయిస్‌గా మారుతోంది. ప్లాటినా 110 డ్రమ్ వెర్షన్ ధర రూ.69,284(ఎక్స్-షోరూమ్).
బజాజ్ ప్లాటినా 100లో అమర్చిన 102 సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ ఉంది. బజాజ్ ప్రత్యేకంగా రూపొందించిన DTS-i టెక్నాలజీ ఇంధనాన్ని అత్యంత సమర్థవంతంగా దహనం చేస్తుంది. ఈ ఇంజిన్ పెట్రోల్‌ను తక్కువగా వాడి ఎక్కువ దూరం ప్రయాణించేలా డిజైన్ చేయబడింది, అందుకే ప్లాటినా మైలేజ్ బైక్ అనే పేరు సంపాదించింది. ప్రాక్టికల్ రోడ్డుపై ఈ బైక్ ఇస్తున్న మైలేజ్‌నే చూస్తే దాని అసలు సామర్థ్యం తెలుస్తుంది.

ఇంకో పెద్ద ప్రయోజనం దాని 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్. ట్యాంక్‌ను పూర్తిగా నింపితే ఫుల్ ట్యాంక్‌తో 700 నుండి 800 కి.మీ వరకు కవర్ చేయవచ్చు. ప్లాటినా 110పై దృష్టి పెడితే, ఇది ప్లాటినా 100తో పోలిస్తే మరింత శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉండటం దీని ప్రధాన ప్రత్యేకత. రోజువారీ ప్రయాణంతో పాటు కొంచెం ఎక్కువ పవర్ అవసరమయ్యే పరిస్థితుల్లో కూడా ఈ బైక్ స్మూత్‌గా, స్టబుల్‌గా పనిచేస్తుంది.
ఈ మోడల్‌లో 115.45 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అమర్చారు. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగుపడుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది, అలాగే బైక్ ఎప్పుడూ సున్నితంగా స్టార్ట్ అవుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.6 bhp పవర్‌ను 7000 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. అంటే నగరాల్లో ట్రాఫిక్‌లో zig-zagగా కదిలేటప్పుడైనా, ఫ్లైఓవర్లను ఎక్కేటప్పుడైనా బైక్‌కు సరిపడ శక్తి అందుతుంది.

అదే సమయంలో 9.81 Nm టార్క్‌ను 5000 rpm ఇస్తుంది. తక్కువ వేగాల్లో కూడా ఇంజిన్ ఇబ్బంది పడకుండా సులభంగా కదలడం ప్లాటినా 110కి ఒక పెద్ద ప్రయోజనం. డిజైన్, ఫీచర్స్ పరంగా పరిశీలిస్తే ముందుభాగంలో హాలోజన్ హెడ్‌లైట్లు అమర్చడం వల్ల రాత్రిపూట స్పష్టమైన లైటింగ్ అందిస్తుంది. అదనంగా, LED డే టైమ్ రన్నింగ్ లైట్లు (DRLs) ఉండటం వల్ల పగటిపూట కూడా రోడ్డుపై బైక్ మరింత సులభంగా కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications








