ఈ స్కూటర్ కొంటే పదేళ్ల పాటు ఎలాంటి టెన్షన్ లేదు! లీటర్‌కు 55 కి.మీ మైలేజ్! రూ.80 వేల ధర

భారత స్కూటర్ మార్కెట్‌లో హోండా యాక్టివా (Honda Activa) పేరు చెబితే, ప్రతి ఇంటిలో గుర్తొచ్చే బ్రాండ్. 2001లో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ స్కూటర్, అప్పటి నుంచి ఇప్పటివరకు వినియోగదారుల మన్ననలు సంపాదిస్తూ, నంబర్ వన్ స్థానం దక్కించుకుంది. మొదటి వాహనం ఎంచుకుంటున్న వారికి, రోజూ ఆఫీసుకు వెళ్తున్న వారికైనా, కుటుంబ ప్రయోజనాల కోసం చూసే వారికైనా హోండా యాక్టివా ప్రతి తరానికి, ప్రతి అవసరానికీ సరిపోయే విధంగా ఉంది. ఈ స్కూటర్‌కు అనువైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్, ఆర్థికంగా సరిపడే నిర్వహణ ఖర్చులు ఉన్నందువల్లే ఇది అనేక మందికి మొదటి ఆప్షన్‌గా మారింది. దేశంలోని పల్లె నుంచి పట్టణం వరకు ఇది రోడ్లపై కనిపిస్తుంది.

ఈ స్కూటర్ డిమాండ్‌ను మరోసారి రుజువు చేస్తూ, గత నెల జూన్‌లో 1,83,265 యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ గణాంకాలు చూస్తే దీనిని ఎంతమందిగా అభిమానం చేస్తున్నారు అనే విషయం స్పష్టమవుతుంది. సాదా సీదా రైడింగ్‌కు, రోజువారీ ప్రయాణాలకు ఇది అద్భుతమైన ఎంపిక. ట్రాఫిక్‌లో వేగంగా జరగాలంటేనేగాక, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం కావాలన్నా యాక్టివా ఉత్తమ పరిష్కారం. దాని డిజైన్ కూడా కుటుంబానికి, మహిళలకు, యువతకు అందరికి సూట్ అయ్యేలా ఉంటుంది.

Mileage Scooter

ఇది మార్కెట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు అదే డిమాండ్, అదే విశ్వాసంతో ముందుకెళ్తోంది. ప్రారంభంలో సాధారణ మోడల్ మాదిరిగా అడుగుపెట్టినప్పటికి రాను రాను ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో కంపెనీ దీనిని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్స్ చేస్తూ విడుదల చేయడం స్టార్ట్ చేసింది. ఇది ప్రస్తుతం ఎలక్ట్రిక్ వేరియంట్‌లో సైతం కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండటం విశేషం.

యాక్టివా 110 మోడల్, క్లాసిక్ వేరియంట్, దాని సరళమైన డిజైన్, ఆర్థిక మైలేజ్‌తో ప్రసిద్ధి చెందింది. ఇందులో 109.51 సిసి సామర్థ్యం గల OBD-2B ప్రమాణాలకు అనుగుణమైన ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 bhp శక్తిని, 9.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం 85 కిలోమీటర్లు కాగా, 50 నుండి 55 కిలోమీటర్ల మైలేజీను అందించగలదు. దీనికి ఎక్స్-షోరూమ్ ధర రూ.81,000.

Best Scooter In India

ఇది రోజువారీ ప్రయాణాల్లో ఖర్చు తక్కువగా ఉండాలని కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఎంపిక. కొంచెం అధిక పనితీరు కోరే వారికి యాక్టివా 125 మరింత శక్తివంతంగా అందుబాటులో ఉంది. ఇది 123.92 సిసి సామర్థ్యం గల అదే తరహా పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 8.4 bhp శక్తిని, 10.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు, మైలేజీ పరంగా 47 కిలోమీటర్లు అందిస్తుంది.

ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌ను కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక. దీని ధర రూ.94,000 నుండి రూ.97,000 వరకు మారవచ్చు. ఇక పెట్రోల్ అవసరం లేకుండా ఈవీలో కావాలనుకునేవారికి యాక్టివా E కూడా అందుబాటులో ఉంది. ఇది హోండా నుంచి పూర్తి స్థాయి EV వాహనంగా మార్కెట్లోకి వచ్చి, ఫ్యూచర్ ట్రాన్స్పోర్ట్‌ను కోరుకునే వారికి బెస్ట్‌గా నిలుస్తోంది. దీని ధర రూ.1.17 లక్షల నుండి రూ.1.52 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Activa Electric

కొత్త హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్‌ పూర్తి ఛార్జ్‌తో 102 కి.మీ. ప్రయాణించగలదు. రైడర్లకు అవసరమైన అన్ని ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ కూడా TFT కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్,స్మార్ట్ స్లిప్ట్ కీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు, వెనుక CBS బ్రేక్‌లు సమన్వయంతో పనిచేస్తూ, బ్రేకింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తాయి.

డెలీవరీ బాయ్స్ లేదా చిన్న షాపింగ్ బ్యాగ్ ఉంచేందుకు ఉపయోగపడే అండర్ సీట్ స్టోరేజ్, LED హెడ్‌ల్యాంప్ & DRLs, సీటు తీయకుండానే పెట్రోల్ నింపే వీలుతో పాటు, బటన్ ప్రెస్‌తో సీటు తెరచే సౌకర్యం. ఈవీలో అయితే బ్యాటరీ బయటకు తీసి ఛార్జ్ చేసుకోవచ్చు. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్ వంటి మొదలగు ఫీచర్స్ వీటిలో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, July 26, 2025, 10:23 [IST]
English summary
Budget friendly honda activa variants price mileage and all top things
Read more on: #honda motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+