పేదల బండి మళ్లీ వచ్చేసింది.. మైలేజ్ కింగ్ ఈసారి మరింత స్టైలిష్‌గా.. బడ్జెట్లో బెస్ట్ ఆఫ్షన్ ఇదే!
బైక్ కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ పేదల బండిగా పేరుగాంచిన హీరో స్ప్లెండర్ ప్లస్ 2025 మోడల్ తాజాగా విడుదలైంది. తక్కువ ధరలో ఆకట్టుకునే డిజైన్, లేటెస్ట్ ఫీచర్లతో వస్తున్న ఈ బండిని ఎందుకు కొనుగోలు చేయాలో అందుకు తగిన 5 ముఖ్యమైన కారణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హీరో స్ప్లెండర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన పేదల బైక్. ఇది చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. గత గురువారం 2025 కొత్త 'స్ప్లెండర్ ప్లస్' బైక్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. ఈ మోటార్‌సైకిల్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అనేక ఫీచర్లను కలిగి ఉంది.

మీరు కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ మోటార్‌సైకిల్‌ను ఎందుకు తీసుకోవాలి అనేదానికి 5 ముఖ్యమైన కారణాలను ఈ కథనంలో వివరంగా ఒక్కొక్కటి చూద్దాం.
1. ధర, వేరియంట్స్ (Price & Variants): కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ చాలా తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.79,096 నుండి రూ.85,001 వరకు ఉంటుంది. ఇది స్టాండర్డ్ స్ప్లెండర్ ప్లస్ వేరియంట్‌తో పాటు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0 అనే మరిన్ని వేరియంట్‌లలో కూడా లభిస్తుంది.

2.డిజైన్,రంగులు (Design & Colors): కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్ మరింత ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మంచి LED హెడ్‌లైట్, LED DRLలను కలిగి ఉంది. అంతేకాకుండా బ్లూ బ్లాక్, బ్లాక్ రెడ్ పర్పుల్, స్పోర్ట్స్ రెడ్ బ్లాక్, ఫోర్స్ సిల్వర్ వంటి వివిధ రంగులలో కూడా అందుబాటులో ఉంది.
3. పర్ఫామెన్స్ (Performance): ఈ బైక్ పవర్ ఫుల్ 97.2సీసీ OBD2B ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.91 PS హార్స్‌పవర్‌ను, 8.05 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.

4.ఫీచర్లు (Features): కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్ అనేక ఎట్రాక్టీవ్ ఫీచర్లను కలిగి ఉంది. ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సపోర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కిల్ ఫంక్షన్, ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటి వివిధ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
5. సస్పెన్షన్ సెటప్ & బ్రేకింగ్ సిస్టమ్ (Suspension Setup & Braking System): ఈ బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్‌ల సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. రైడర్ల సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను అందించారు.

మొత్తం మీద కొత్త 2025 హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్‌సైకిల్ విడుదల దేశీయ వినియోగదారులకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది అత్యాధునిక డిజైన్, ఫీచర్లతో పాటు అందుబాటు ధరలో కూడా లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ బైక్‌కు కొనుగోలుదారుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








