హోండా అదిరిపోయే ఆఫర్.. యాక్టివా కొంటే మూడేళ్లు ఫ్రీ.. అదనంగా రూ.5,500కూడా.. త్వరపడండి
స్కూటర్ల రారాజు హోండా యాక్టివా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ గెయిర్ లెస్ స్కూటర్ కొనాలన్నా చాలామంది మొదటిగా అడిగేది 'యాక్టివా తీసుకున్నావా?' అనే! కైనెటిక్ హోండా తర్వాత దేశంలో విప్లవం సృష్టించిన ఈ మోడల్ ఇప్పటికీ హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది.
కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా గెయిర్ లెస్ స్కూటర్లకు ఆకర్షితులయ్యారంటే అది హోండా యాక్టివా మహిమే. నేటి మోడళ్లలో ఉండే లేటెస్ట్ ఫీచర్లు దీనికి లేకపోయినా, విశ్వసనీయతకు మారుపేరుగా యాక్టివాను దేశం మొత్తం కొనుగోలు చేసింది. ప్రస్తుతం మన దేశంలో ఈ స్కూటర్ లేని వీధి లేదంటే అతిశయోక్తి కాదు.

పాత యాక్టివాను వాడిన వారు కూడా అది పాతబడితే మళ్లీ యాక్టివానే కొంటున్నారంటే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు కారణం హోండా సర్వీస్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులే. ఇప్పుడు హోండా తమ కొత్త యాక్టివా 110, యాక్టివా 125 మోడళ్లను కొనే వారికి అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది.
కొత్త యాక్టివా 110, యాక్టివా 125 స్కూటర్లు కొనే వారికి మూడు సంవత్సరాల ఉచిత సర్వీస్ ప్యాకేజీ, రూ.5,500 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను హోండా టూ-వీలర్స్ ఇండియా ప్రకటించింది. ఇటీవల 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌తో వచ్చిన కొత్త మోడళ్లపై ఈ ఆఫర్ ఉండటం విశేషం. యాక్టివా సిరీస్ ఇప్పుడు OBD 2B ప్రమాణాలతో కూడిన ఇంజన్‌తో వస్తోంది.

భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో యాక్టివా 110cc, 125cc మోడళ్లు ముందుంటాయి. తాజాగా ప్రకటించిన ఈ లిమిటెడ్ టైం ఆఫర్లు 2025 ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఈ ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోవడానికి దగ్గరలోని డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.
2025 హోండా యాక్టివా ఎక్స్-షోరూమ్ ధర రూ. 80,950 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో తాజా OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసిన 109.51cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి 8,000 rpm వద్ద 7.8 bhp పవర్‌ను, 5,500 rpm వద్ద 9.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫ్యూయెల్ కెసాసిటీని పెంచడానికి హోండా యాక్టివా 110 మోడల్‌లో ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందించింది. దీనితో పాటు 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌లో భాగంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త 4.2-ఇంచ్ TFT డిస్‌ప్లేను కూడా ఈ పాపులర్ స్కూటర్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ భారతదేశంలోని అన్ని హోండా టూ-వీలర్స్‌లో స్టాండర్డ్‌గా వస్తోంది.
ఈ డిస్‌ప్లే నావిగేషన్, కాల్, SMS అలర్ట్‌లు, మరిన్ని ఫీచర్లను అందించే హోండా రోడ్‌సింక్ యాప్‌తో అనుకూలంగా ఉంటుంది. స్కూటర్‌లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. 2025 హోండా యాక్టివా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న HMSI డీలర్‌షిప్‌లలో లభిస్తుంది. ఇది టీవీఎస్ జూపిటర్, హీరో ప్లెజర్ ప్లస్ వంటి వాటికి పోటీనిస్తుంది.

మరోవైపు 2025 హోండా యాక్టివా 125 వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 94,922 నుండి రూ. 97,146 వరకు ఉంది. OBD2B కంప్లయింట్‌గా అప్‌డేట్ చేసిన 123.92cc సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఇందులో అందించారు. ఇది మెరుగైన ఫ్యూయెల్ కెపాసిటీ కోసం ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్‌ను, CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి 8.3 bhp పవర్‌తో గరిష్టంగా 10.15 Nm టార్క్‌ను అందిస్తుంది.
110 మోడల్‌లో ఉన్నట్లుగానే ఇందులో కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త 4.2-ఇంచ్ TCT డ్యాష్‌బోర్డ్‌ను అందించారు. ఇది USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్‌ల వంటి ఫీచర్లను అందించే హోండా రోడ్‌సింక్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెగ్మెంట్‌లో ఇది సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో, యమహా రే ZR, టీవీఎస్ జూపిటర్ 125, టీవీఎస్ ఎన్‌టార్క్ వంటి ప్రముఖ స్కూటర్లతో పోటీపడుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








