పెట్రోల్ వద్దు.. CNG ముద్దు.. సుజుకి యాక్సెస్ Vs టీవీఎస్ జూపిటర్.. CNG స్కూటర్ల రసవత్తర పోరు షురూ!

పెట్రోల్ ధరలతో విసిగిపోయారా.. అయితే మీకో గుడ్‎న్యూస్. ఇకపై టూ వీలర్స్ ప్రపంచంలోకి CNG స్కూటర్ల యుగం అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే భారత మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న TVS, ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అదే TVS జూపిటర్ 125 CNG.

అయితే, ఈ పోటీలో వెనుకబడి ఉండదనుకున్న సుజుకి, తన అత్యంత ప్రజాదరణ పొందిన యాక్సెస్ మోడల్‌ను CNG వెర్షన్‌లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ రెండు దిగ్గజ స్కూటర్ల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? ఎక్కువ మైలేజ్, తక్కువ ఖర్చుతో CNG స్కూటర్లు భారత మార్కెట్‌ను ఎలా మార్చబోతున్నాయో వివరంగా చూద్దాం.

Bye Bye Petrol The CNG Scooter Era Begins Suzuki Access Vs TVS Jupiter in a Head-to-Head Battle

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు వినియోగదారులను ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికల వైపు చూసేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో CNG స్కూటర్లు ఒక ఆశాజనకమైన పరిష్కారంగా ముందుకు వస్తున్నాయి. CNG స్కూటర్లు సాధారణంగా పెట్రోల్ స్కూటర్ల కంటే ఎక్కువ మైలేజ్‌ను అందిస్తాయి. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది.

TVS మోటార్ కంపెనీ తన జూపిటర్ 125 మోడల్‌కు CNG వెర్షన్‌ను తీసుకురావడానికి దాదాపు సిద్ధంగా ఉంది. ఈ స్కూటర్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌గా గుర్తింపు పొందనుంది. 2026 మధ్య నాటికి ఇది భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని అంచనా. TVS జూపిటర్ 125 CNG, ఒక కిలో CNGకి సుమారు 84 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగలదని భావిస్తున్నారు.

Bye Bye Petrol The CNG Scooter Era Begins Suzuki Access Vs TVS Jupiter in a Head-to-Head Battle

ఇది సుమారు 1.4 లీటర్ల CNG ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.పెట్రోల్ కోసం 2 లీటర్ల రిజర్వ్ ట్యాంక్ కూడా ఉంటుంది. ఇది వినియోగదారులకు CNG పంపులు అందుబాటులో లేని చోట్ల కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణించే సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ఈ మోడల్ తన పవర్ఫుల్ 125cc ఇంజిన్‌తో పాటు, మెరుగైన మైలేజ్‌ను అందిస్తూ వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

TVS జూపిటర్ 125 CNG రాకకు ముందే, దానికి గట్టి పోటీనిచ్చేందుకు సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవల జపాన్ మొబిలిటీ షో 2025లో సుజుకి యాక్సెస్ CNG వెర్షన్‌ను ప్రదర్శించడం ఈ అంచనాలకు బలం చేకూర్చింది. సుజుకి యాక్సెస్ CNG మోడల్‌లో 6 లీటర్ల భారీ CNG ట్యాంక్ ఉండవచ్చని సమాచారం.

Bye Bye Petrol The CNG Scooter Era Begins Suzuki Access Vs TVS Jupiter in a Head-to-Head Battle

ఇది TVS జూపిటర్ కంటే గణనీయంగా ఎక్కువ సామర్థ్యం. అయితే, ఈ ట్యాంక్ సీటు కింద అమర్చబడి ఉండటం వల్ల డిక్కీలో సామాన్లు పెట్టుకోవడానికి స్థలం తగ్గే అవకాశం ఉంది. సుజుకి యాక్సెస్ కూడా ఒక కిలో CNGకి 80 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వగలదని భావిస్తున్నారు. దీనికి 2 లీటర్ల పెట్రోల్ రిజర్వ్ ట్యాంక్ కూడా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ CNG మోడల్ గనుక భారతదేశంలో విడుదల అయితే, అది TVS జూపిటర్ 125 CNGకి గట్టి పోటీనిస్తుంది అనడంలో సందేహం లేదు. యాక్సెస్ మోడల్ ఇప్పటికే పెట్రోల్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటిగా ఉంది. CNG వెర్షన్ విజయవంతమైతే సుజుకి యాక్సెస్ పెట్రోల్, ఎలక్ట్రిక్ (త్వరలో రాబోతోంది), CNG అనే మూడు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చి, హోండా యాక్టివా వంటి ప్రత్యర్థులకు తీవ్ర సవాల్‌ను విసిరే అవకాశం ఉంది.

Bye Bye Petrol The CNG Scooter Era Begins Suzuki Access Vs TVS Jupiter in a Head-to-Head Battle

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ CNG స్కూటర్లు రాబోయే కొద్ది సంవత్సరాలలో భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో పెను మార్పులు తీసుకురావచ్చు. పెట్రోల్ ధరల భారం నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి, ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికగా నిలుస్తాయి.

అయితే, CNG రీఫిల్లింగ్ మౌలిక సదుపాయాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తేనే ఈ స్కూటర్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. సుజుకి తన యాక్సెస్ CNG మోడల్‌ను ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి. అంతలోపు TVS జూపిటర్ 125 CNG మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Thursday, October 30, 2025, 14:02 [IST]
English summary
Bye bye petrol the cng scooter era begins suzuki access vs tvs jupiter in a head to head battle
Read more on: #tvs #suzuki #cng #scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+