ఇది బైకు కాదు ఒక ఎమోషన్.. అందుకే దీని కోసం కస్టమర్లు మే నెలలో ఎగబడ్డారు

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే కేవలం ఒక వాహనం కాదు, అది ఒక ఎమోషన్. ఇండియన్ బైకర్ల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ బ్రాండ్, పల్లెటూర్ల నుండి నగరాల వరకు అందరికీ సుపరిచితమే. దీని హెవీ లుక్, థంపీ సౌండ్, స్టైల్ చాలా మందిని ఆకర్షిస్తాయి. తాజాగా, మే నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని నివేదికలు చెబుతున్నాయి.

షోరూంల ముందు బుల్లెట్ బైక్‌ల కోసం కస్టమర్లు ఎగబడ్డారంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి మే నెలలో అమ్మకాలు ఎలా ఉన్నాయి, ఏ బైక్‌లు మ్యాజిక్ చేశాయి. పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం. రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) అనేది భారతదేశంలో ఒక ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ. గ్రామ గ్రామాన, పట్టణం పట్టణం, దేశంలో ఎక్కడ చూసినా ఈ బైక్‌ల గురించి మాటలు వినిపిస్తాయి.

Royal Enfield Bikes

ముఖ్యంగా యువత, బైక్ రైడింగ్‌ను ఇష్టపడే వారు ఈ బైక్‌లను బాగా మెచ్చుకుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మే ప్రీమియం బైక్‌లను అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ మే నెల మొత్తం మోటార్‌సైకిళ్ల అమ్మకాల గణాంకాల నివేదికను విడుదల చేసింది. ఈసారి కంపెనీ అంచనాలను మించి అమ్మకాలను పెంచుకుంది.

2025 మే నెలలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఏకంగా 89,429 బైక్‌లను విక్రయించింది. గతేడాది అంటే 2024 మే నెలలో ఇదే సమయంలో 71,010 యూనిట్లను మాత్రమే అమ్మారు. ఈ గణాంకాలను పోల్చి చూస్తే, అమ్మకాల శాతం ఏడాది పరంగా చూస్తే ఏకంగా 26శాతం పెరిగింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో ఒక మంచి వృద్ధి రేటు అని చెప్పొచ్చు. ఈ భారీ అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి.

Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల అమ్మకాల సంఖ్య ఇంతగా పెరగడానికి ముఖ్యమైన కారణం కొన్ని ప్రత్యేక మోడల్స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లాసిక్ 350 (Classic 350), హంటర్ 350 (Hunter 350), బుల్లెట్ 350 (Bullet 350), మీటియోర్ 350 (Meteor 350) వంటి 350సీసీ బైక్‌లను కస్టమర్లు ఎగబడి కొంటున్నారు. మే నెలలో 350సీసీ మోడల్స్ అమ్మకాలు 76,492 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఇది గతేడాది మే నెలతో పోలిస్తే 28శాతం పెరిగింది. ఈ మోటార్‌సైకిళ్లు వాటి స్టైలిష్ డిజైన్, మంచి ఇంజిన్, ఆధునిక ఫీచర్లతో రైడర్లను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సత్తా చాటింది. ఎగుమతులు 82శాతం పెరిగాయి. ఇది గత సంవత్సరం 7,479 యూనిట్ల నుంచి 13,609 యూనిట్లకు చేరుకుంది.

Royal Enfield Bikes Hunter

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) : ధర రూ. 1.95 లక్షల నుండి రూ. 2.33 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 349.34 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 41కిమీ మైలేజీ అందిస్తుంది. ఇందులో సెమీ-డిజిటల్ కన్సోల్, డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 (Royal Enfield Meteor 350): దీని ధర రూ. 2.08 లక్షల నుంచి రూ. 2.33 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). దీనిలో 349 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 41కిమీ మైలేజీ అందిస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్, డబుల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

Royal Enfield Shotgun

రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 (Royal Enfield Guerrilla 450): దీని ధర రూ. 2.39 లక్షల నుండి రూ. 2.54 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. దీనికి 452 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 29 కిమీ వరకు మైలేజీ ఇస్తుంది. ఇందులో TFT డిస్‌ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యాసిక్ కంట్రోల్ (స్విచబుల్ ABS, రైడ్-బై-వైర్ థ్రాటిల్) ఫీచర్లు ఉంటాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 (Royal Enfield Super Meteor 650) : దీని ధర రూ. 3.68 లక్షల నుండి రూ. 3.91 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇందులో 648 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరు 25 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది. ఇందులో సెమీ డిజిటల్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల పట్ల భారతీయులకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాటి రెట్రో స్టైల్, హెవీ ఇంజిన్ సౌండ్, బెస్ట్ పర్ఫామెన్స్ చాలా మందిని ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, లాంగ్ రైడ్‌లకు, అడ్వెంచర్ ట్రిప్పులకు ఈ బైక్‌లు చాలా అనుకూలంగా ఉంటాయి. అందుకే కస్టమర్లు వీటిని కళ్ళు మూసుకుని నమ్ముతున్నారు. మే నెలలో రికార్డు స్థాయి అమ్మకాలు దాని బ్రాండ్ పవర్, మార్కెట్ స్థానాన్ని మరోసారి నిరూపించాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 3, 2025, 9:28 [IST]
English summary
Customers insist on royal enfield bikes record breaking sales in may
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+