పెట్రోల్ టెన్షన్ లేదు.. పైసా ఖర్చు లేకుండా రోజూ 80 కి.మీ. ప్రయాణం.. సైకిల్ ధరకే ఎలక్ట్రిక్ మొపెడ్!

ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ అయిన కొమాకి ఎలక్ట్రిక్, స్మార్ట్ రైడింగ్‌ను ఇంకా సులువు చేయడానికి తమ కొత్త XR1 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ అధునాతన మొపెడ్ రీజనరేటివ్ కైనటిక్ ఎనర్జీతో నడుస్తుంది. అంటే, బ్యాటరీ ఖాళీ అయినా కూడా దీన్ని నడపొచ్చు.

ప్రయాణం మధ్యలో బ్యాటరీ అయిపోతుందేమో అనే భయం లేకుండా నడపొచ్చు అని కంపెనీ చెబుతోంది. అసలు ఈ స్కూటర్ ధర ఎంత? దీని ప్రత్యేకతలు ఏంటి? వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

Komaki XR1

ఈ మధ్య వచ్చే లెటెస్ట్ సైకిల్స్ ధరలే రూ.25-30 వేల వరకు ఉంటున్నాయి. కానీ, ఈ కొమాకి స్కూటర్ ధర విషయానికి వస్తే, ఇండియాలో ఇది కేవలం రూ.29,999 ఎక్స్-షోరూం ధరతో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 80 కిలోమీటర్ల దూరం నడపొచ్చు. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి లేదా నెమ్మదిగా సరదాగా రైడ్ చేయడానికి ఈ స్కూటర్ చాలా బాగుంటుందని కంపెనీ తెలిపింది.

ఈ స్కూటర్ ప్రత్యేకమైన రీజనరేటివ్ పవర్ సిస్టమ్ కలిగి ఉంది. ఇది బ్యాటరీ ఛార్జ్ అయిపోయిన తర్వాత కూడా ప్రయాణాన్ని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. అంటే, మీ బ్యాటరీ మీటర్ సున్నాకు చేరుకున్నా కూడా ఈ ఎలక్ట్రిక్ మొపెడ్ ఆగకుండా నడుస్తుంది. దీని ద్వారా, కొమాకి తమ ఎలక్ట్రిక్ మొపెడ్ అన్ లిమిటి్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని చెబుతోంది.

Komaki XR1

ఈ మొపెడ్ చాలా సౌకర్యవంతంగా, మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు పర్యావరణానికి మేలు చేసేలా ఉంది. రోజువారీ ప్రయాణాలను సులభతరం చేయడానికి, పర్యావరణానికి హాని చేయకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. స్టైల్‌తో పాటు చాలా పటిష్టమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో షాక్-అబ్సార్బింగ్ సస్పెన్షన్, హై-గ్రిప్ టైర్లు ఉన్నాయి. ఇవి ఎలాంటి రోడ్డులో అయినా సురక్షితంగా నడపడానికి సహాయపడతాయి.

ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల, కొమాకి XR1 పర్యావరణానికి చాలా మంచిది. జేబుకు కూడా భారం కాకుండా ఉంటుంది. ఇది జీరో-ఎమిషన్ రైడ్‌ను అందిస్తుంది. అంటే కాలుష్యం ఉండదు. అంతేకాకుండా, దీనికి రెండు సీట్లు ఉంటాయి, కాబట్టి డ్రైవర్, వెనుక కూర్చునే వ్యక్తి కూడా సౌకర్యంగా ప్రయాణించవచ్చు.

Komaki XR1

ఇంకా, ముందు భాగంలో ఒక పెద్ద బాస్కెట్ ఉంది. ఇందులో నిత్యావసరాలు, సంచులు లేదా ఇతర వస్తువులను సులువుగా తీసుకెళ్లొచ్చు. మొత్తంగా చూస్తే, ఈ మొపెడ్ స్టైలిష్ డిజైన్, మోడర్న్ లుక్‌తో ఉంది. నగర ప్రయాణీకులకు ఇది చాలా మంచి ఆప్షన్ అని కొమాకి చెబుతోంది.

కొత్త స్కూటర్ గురించి కొమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ-వ్యవస్థాపకుడు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ.. కొమాకిలో వినియోగదారులకు సౌకర్యాన్ని అందించే లక్ష్యంతో పర్యావరణ అనుకూల వాహనాలను అందించడానికి మేము నిరంతరం కట్టుబడి ఉన్నాము. మా వాహనాలు తక్కువ ధరలో వినియోగదారులకు అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి."

"ఈ ప్రయత్నంలో, XR1 సిరీస్ ఒక ముఖ్య ఆవిష్కరణ. ఇది బ్యాటరీ ఖాళీ అయిన తర్వాత కూడా పూర్తి రైడింగ్‌ను అందిస్తుంది. నగరం లోపల ప్రయాణించే వారి అవసరాలను తీర్చడానికి దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశాం. ఇది రైడింగ్‌ను సౌకర్యవంతంగా చేస్తుంది" అని ఆయన అన్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: రూ.30,000 లోపు ఎలక్ట్రిక్ మొపెడ్, పైగా బ్యాటరీ అయిపోయినా నడిచే ఫీచర్.. ఇది నిజంగా చాలామందికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా రోజూ తక్కువ దూరం ప్రయాణించే వారికి, విద్యార్థులకు, చిన్న చిన్న పనులు చేసుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పర్యావరణానికి మంచిది.

More from DriveSpark

Article Published On: Thursday, June 26, 2025, 13:50 [IST]
English summary
Cycle price moped performance komaki xr1 is a game changer in ev segment
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+