మార్కెట్లోకి అదిరిపోయే అడ్వెంచర్ టూరింగ్ బైక్ లాంచ్.. బైక్ లవర్స్‌కు పండగే.. సాహసాలకు ఇక సిద్దం కండి!
లగ్జరీ టూవీలర్ తయారీ కంపెనీ డుకాటీ (Ducati) ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన బైక్స్‌ను విడుదల చేయడంలో ప్రసిద్థి చెందిన సంస్థ. ఆన్‌రోడ్‌తో పాటు ఆఫ్‌రోడ్ వంటి కఠిన రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోయే మోడళ్లను లాంచ్ చేయడంలో డుకాటీకి మంచి పేరుంది. భారతీయ మార్కెట్లో ఈ కంపెనీ నుంచి టూవీలర్స్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. టూరింగ్, లాంగ్ రైడ్ వంటి వాటి కోసం ఇప్పటికే అధునాతన మోడళ్లను తీసుకొచ్చిన డుకాటీ తాజాగా దేశీయ మార్కెట్లో అదిరిపోయే బైక్‌ను దింపింది. ఈ కొత్త మోడల్ పేరు 'డిజర్ట్ ఎక్స్ డిస్కవరీ (Desert S Discovery)'. ఇది ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చింది. ఎక్కువ దూరం రైడింగ్ చేసే వారికి ఇది అత్యంత అనువైన మోడల్ అని కంపెనీ పేర్కొంటుంది. లాంగ్ రైడింగ్ సమయంలో ఉపయోగకరంగా ఉండేలా అధునాతన ఫీచర్స్‌ను దీనిలొ అందించారు.
డిజర్ట్ ఎక్స్ డిస్కవరీ ప్రారంభ ధర రూ.21,78,200. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసరికి మరింత ఎక్కువగాయ ఉంటుంది. అన్ని డుకాటి డీలర్‌షిప్‌లలో ఈ బైక్ కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇటలీకి చెందిన డుకాటీ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో గొప్ప పేరుంది. భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. అంతర్జాతీయ మోడళ్లను ఎప్పటికప్పుడు దేశంలో కూడా విడుదల చేస్తుంది.

ఇప్పుడు ఈ కొత్త బైక్‌తో డుకాటీ భారతీయ మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించే అవకాశం కూడా ఉంది. అడ్వెంచర్లను కోరుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. అలాగే, వీకెండ్స్ సమయాల్లో పని ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇలాంటి లగ్జరీ బైక్‌లపై రైడింగ్ చేయడం చాలా మందికి ఒక హాబీగా మారిపోయింది. ఇలాంటి తరుణంలో డుకాటీ డిజర్ట్ ఎక్స్ డిస్కవరీ బెస్ట్ ఆప్షన్ అవుతుందని కంపెనీ భావిస్తోంది.
డిజర్ట్ ఎక్స్ డిస్కవరీ ఇంజిన్ విషయానికి వస్తే, 937 సీసీ ఎల్-ట్విన్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 9,250rpm వద్ద 92Nm గరిష్ట టార్కును, 108 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జోడించారు. అడ్వెంచర్ అండ్ టూరింగ్ బైక్ కాబట్టి దీనిలో లేటెస్ట్ ఫీచర్స్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. క్రూయిజ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, రైడ్ మోడ్స్ వంటి ఇతర ఆప్షన్లు ఉన్నాయి.

ఇది రైడింగ్‌లో మంచి గ్రిప్‌ను అందించడానికి హీటెడ్ గ్రిప్‌లు, టూరింగ్ విండ్‌స్క్రీన్, అలాగే రేడియేటర్ గార్డ్, ఇంజిన్‌ను రక్షించడానికి బాష్ ప్లేట్, అడ్జెస్టబుల్ 46 mm usd ఫ్రంట్ ఫోర్క్స్, మెరుగైన కంట్రోల్ కోసం డ్యూయల్ 320 mm ఫ్రంట్ డిస్క్, 265 mm వెనుక బ్రేకులు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసుకోవడానికి ఐదు అంగుళాల టీఎఫ్‌టీ టచ్ స్క్రీన్‌ను కూడా దీనిలో అందించారు.
ఇంకా టర్న్ బై టర్న్ నేవిగేషన్ సపోర్ట్, అడ్వెంచర్ రైడింగ్ కోసం 21-అంగుళాల ఫ్రంట్ వీల్, స్టాండర్డ్‌గా సెంటర్ స్టాండ్ వంటి ఇతర ఆప్షన్స్ కూడా డిజర్ట్ ఎక్స్ డిస్కవరీలో ఉన్నాయి. సాహసాలను కోరుకునే వారి కోసం ఇది అత్యంత అనువైన డిజైన్‌తో వచ్చింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








