కొండల్లో కూడా చొచ్చుకుపోయే డుకాటి బైక్.. స్టన్నింగ్ లుక్స్, సూపర్ ఫీచర్స్.. సొంతం చేసుకునే అవకాశం వచ్చింది
దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ డుకాటి ఇండియా (Ducati India) సరికొత్త బైక్స్‌లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి పలు మోడళ్లను లాంచ్ చేసి మెరుగైన అమ్మకాలను నమోదు చేయగా, కంపెనీ ఈ కొత్త ఏడాదిలో కూడా అధునాతన బైక్స్‌ను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. 2025లో డుకాటి నుంచి వచ్చే మోడళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తాజాగా కంపెనీ మంచి శుభవార్త చెప్పింది. డుకాటి ఇండియా కొత్తగా డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ (desert-x-discovery) అనే బైకును విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ను ఇటీవల ప్రారంభించింది. చాలా కాలంగా డుకాటి నుంచి ఎప్పుడు కొత్త బైక్ వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారికి ఇది పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు. ఈ బైక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
కొత్తగా స్టైలిష్ బైక్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారు దీనిని బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. డెసర్ట్ X డిస్కవరీ స్టాండర్డ్ బైక్ మాదిరిగా ఉంటుంది. ఇంజన్ కేసింగ్‌కు పూర్తి రక్షణ ఉండటంతో పాటు, లగేజీ కేస్ కూడా పక్కన ఉంది. దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, ఇది 937 సీసీ Testastretta ఇంజిన్‌తో రన్ అవుతుంది. క్విక్ షిఫ్ట్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది.

ఇంజిన్ 9,250 rpm వద్ద 108 bhp పవర్, 6,500 rpm వద్ద 92 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ ఆఫ్‌రోడ్ రైడర్లకు అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. రాళ్లు, గుంతల నుంచి వెళ్తున్న ఈజీగా రైడింగ్ చేయడానికి అత్యంత అనువైన బైక్. ఆఫ్-రోడింగ్‌లో వెళ్లేటప్పుడు బైక్‌ను కాపాడటానికి రేడియేటర్ గార్డ్ కూడా ఉంది. బురద, వర్షంలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఇంజిన్‌కు రక్షణగా బాష్ ప్లేట్‌ను అందించారు.
ఇటీవల కాలంలో దూర ప్రాంతాలకు బైక్ రైడ్‌లు ఎక్కువ అయ్యాయి. చాలా మంది యూత్ అధునాతన డిజైన్లతో కూడిన మోడళ్లను కొనుగోలు చేయడానికి మరింత ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ క్రమంలో సరికొత్త డుకాటి బైక్ రైడర్లను ఆకట్టుకుంటుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇది ప్రధానంగా టూర్ల కోసం బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం అల్యూమినియం కేసులు, సబ్‌ఫ్రేమ్‌తో అమర్చారు.

ముఖ్యంగా చలి కాలంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా బైక్‌ను రైడ్ చేయడానికి హ్యాండిల్‌ను సులువుగా పట్టుకోవడానికి వాటికి ప్రత్యేకంగా వేడిగా ఉండే విధంగా తయారు చేశారు. 2025 డుకాటి డెసర్ట్ X డిస్కవరీ ఒక అడ్వెంచర్ బైక్‌గా అలాగే, సాధారణ రోడ్లపై కూడా రయ్ మంటూ దుసుకుపోతుంది. రైడర్లకు ఈ బైక్ సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.
డుకాటీ కంపెనీ ఈ బైక్ లాంచ్ డేట్, ధర గురించి ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతానికి బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేసింది. దీనిలో ఫీచర్స్ కూడా బోలెడు ఉన్నాయి. టూరింగ్ విండ్‌స్క్రీన్ వంటి కొత్త అప్‌డేట్స్, ఎంత సమయం కూర్చుని ఉన్న కూడా అలసట చెందని మెత్తని సీటు వంటివి ఈ బైకులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








