ఒక్కసారి డ్రైవ్ చేస్తే దీని లవ్‎లో పడిపోతారు.. డుకాటి డెజర్ట్‌ఎక్స్ డిస్కవరీ అడ్వెంచర్ టూరింగ్ స్పెషాలిటీ ఇదే

మీకు అడ్వెంచర్స్ చేయడం అంటే ఇష్టమా.. అయితే మంచి ఇంజిన్ ఉన్న మోటార్ సైకిల్ కోసం చూస్తున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.. డుకాటీ ఇండియా తన కొత్త, లగ్జరీ డుకాటీ ఎక్స్ డిస్కవరీ బైక్స్ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ బైక్ ను గతంలో పలుమార్లు ఆన్ లైన్లో టీజ్ చేశారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. త్వరలోనే దీనిని కొనుగోలు చేసిన వాళ్లకు డెలివరీ అందించనుంది.

ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటి ఇటీవల ఇండియాలో డెజర్ట్ఎక్స్ డిస్కవరీ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఈ డెజర్ట్ఎక్స్ డిస్కవరీ మోటార్ సైకిల్ అన్ని డుకాటి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన డుకాటి మోటార్స్ సైకిల్స్ ఇప్పుడు ఇండియాలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. డుకాటి ఫ్లాగ్‌షిప్ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Ducati Desert X Discovery Bookings

డుకాటీ డెజర్ట్ ఎక్స్ డిస్కవరీ అడ్వెంచర్ ఆఫ్ రోడింగ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ బైక్ డిజైన్ దాని డెసర్ట్ ఎక్స్ బైక్‌ మాదిరి ఉంటుంది. అయితే దీనికి ఎరుపు, నలుపు పెయింట్ ఇచ్చారు. ఇది బైక్ లుక్ మరింత ఎట్రాక్టివ్ గా చేస్తుంది. హార్డ్ కేస్ పానియర్స్(లగేజీ క్యారియర్), ఇంజిన్ కవర్ ప్రొటెక్షన్, పెద్ద బెల్లీ గార్డ్ తో వస్తుంది. దూర ప్రయాణాలకు మంచి ఆఫ్షన్.

ఇంజిన్ విషయానికి వస్తే.. డుకాటీ డెజర్ట్ ఎక్స్ డిస్కవరీలో 937సీసీ, ఎల్ ట్విన్ ఇంజన్ ఉంటుంది. ఇది 9,250rpm వద్ద 108 bhp పవర్, 92 nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది బై-డైరెక్షనల్ క్విక్షిఫ్టర్‌ను కలిగి ఉంటుంది. దీంతో గేర్ షిఫ్టింగ్‌ చాలా స్మూత్‌గా, వేగంగా అవుతుంది.

Ducati Desert X Discovery View

ఈ బైక్ ను హైటెక్ ఫీచర్లతో కంపెనీ రూపొందించింది. ఇందులో మీ అవసరం బట్టి పవర్ మోడ్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. హై స్పీడ్ స్టంట్స్ కోసం సేఫ్టీ ఫీచర్ వీల్ కంట్రోల్ అందించారు. స్మూత్ డౌన్ షిఫ్టింగ్ కోసం ఇంజన్ బ్రేక్ కంట్రోల్ ఉంది. లాంగ్ రైడ్స్ కోసం క్రూయిజ్ కంట్రోల్ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా కూల్ వెదర్‎లో కూడా సౌకర్యవంతమైన రైడింగ్ కోసం వేడి గ్రిప్స్ అందించారు.

అలాగే నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్ కోసం టీఎఫ్‌టీ డిస్‌ప్లే అందించారు. ఈ డుకాటీ నయా డిస్కవరీ బైక్ కు మంచి సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఇందులో 46ఎంఎం పూర్తిగా అడ్జస్టబుల్ యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్ సస్పెన్షన్ ఇచ్చారు. ఈ బైక్ ఆఫ్-రోడింగ్ కోసం అద్భుతమైనటువంటి కెవైబీ కంప్లీట్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది.

దీనిలో డ్యూయల్ 320MM ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, సింగిల్ 265MM రియర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఇది 21ఇంచుల ఫ్రంట్, 18 ఇంచుల బ్యాక్ స్పోక్ వీల్స్ కలిగి ఉంది. ఇక డుకాటీ డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ ధర రూ.21 లక్షలు(ఎక్స్ షోరూమ్). ఇప్పటికే ఈ బైక్స్ బుకింగ్స్ డుకాటీ డీలర్ షిప్స్ వద్ద ప్రారంభం అయ్యాయి. డెజర్ట్ఎక్స్ డిస్కవరీ లాంచింగ్ గురించి మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడారు.

Ducati Desert X Discovery Price

"ఈ మోటార్ సైకిల్ భారతదేశం అంతటా సాహస ప్రియుల హృదయాలను దోచుకుంటుందని మేము విశ్వసిస్తున్నాము.'' అని అన్నారు. భారత మార్కెట్లో డుకాటి వృద్ధిలో డెసర్ట్ ఎక్స్ డిస్కవరీ ఒక కీలక అడుగు వేస్తుందని కంపెనీ నమ్మకంగా ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 21, 2025, 12:18 [IST]
English summary
Ducati desertx discovery launched in india adventure touring bike with 937cc engine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+