ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పిచ్చెక్కించే డిజైన్లతో 14 కొత్త మోడల్స్.. అదిరిపోయే బైక్స్‌ను దింపుతున్న డుకాటీ..
టూవీలర్ తయారీ కంపెనీ డుకాటీ (Ducati) లగ్జరీ లుక్‌తో అదిరిపోయే బైకులను విడుదల చేస్తూ ప్రపంచంలో దిగ్గజ టూవీలర్ కంపెనీగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పలు మోడళ్లను లాంచ్ చేస్తూనే ఇండియాలో కూడా అధునాతన ఫీచర్లతో కూడిన బైకులను విడుదల చేస్తూ, చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. డుకాటీ బైకులంటే సాధారణంగా యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇండియాలో చాలా కాలంగా కంపెనీ తన వాహనాలను విక్రయిస్తుంది. ప్రతి ఏడాది కొత్త కస్టమర్లను సంపాదించడానికి కొత్త కొత్త డిజైన్లతో అదిరిపోయే బైకులను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కూడా పలు మోడళ్లను లాంచ్ చేయడానికి డుకాటీ ప్లాన్ చేసింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో టూవీలర్ పరిశ్రమ అభివృద్ధికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. దీంతో ఇక్కడి మార్కెట్లో పోటీ ఎక్కువ అయింది.
దేశీయంగా, అంతర్జాతీయంగా మంచి పేరున్న టూవీలర్ తయారీ కంపెనీలు ఇండియాలో మెరుగైన అమ్మకాలను సాధించడానికి పోటీ పడుతూ కొత్త లాంచ్‌లు చేస్తున్న నేపథ్యంలో డుకాటీ టూవీలర్ కంపెనీ సేల్స్ పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేయడానికి 2025 ఏడాదిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 కొత్త టూవీలర్స్‌ను తీసుకువస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ కొత్త ఏడాది బైక్ లవర్స్‌కు ఇది పెద్ద గుడ్‌న్యూస్ అని చెప్పవచ్చు.

ఈ సంవత్సరం భారతీయ టూవీలర్ పరిశ్రమలో అమ్మకాల పరంగా డుకాటీ కంపెనీ సరికొత్త గణాంకాలను నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ 14 మోడళ్లలో 7 మోడళ్ల పేర్లు మాత్రం కంపెనీ ప్రకటించింది. డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ, పానిగేల్ V4 7వ జనరేషన్, స్క్రాంబ్లర్ డార్క్ 2వ జనరేషన్, మల్టీస్ట్రాడా V2, స్ట్రీట్‌ఫైటర్ V2, పానిగేల్ V2, స్ట్రీట్‌ఫైటర్ V4 3వ జనరేషన్ వంటి మోడళ్ల పేర్లు వెల్లడించింది.
అయితే మిగిలిన మోడళ్ల వివరాలను త్వరలోనే వెల్లడిస్తుంది. ఇదిలా ఉంటే ఒక బైక్‌ను విడుదల చేసిన తరువాత ఒకదాని తర్వాత మరోదాన్ని మార్కెట్లోకి తీసుకువస్తుంది. ఇవన్నీ కూడా సరికొత్త డిజైన్లతో విడుదల కాబోతున్నాయి. 5 బైకులను మాత్రం లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసే అవకాశం ఉంది. డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ( Desert X),పానిగేల్ V4 7వ జనరేషన్ (Panigale V4 7G) మొదటి త్రైమాసికంలో విడుదల అవుతాయి.

ఆ తర్వాత రెండో త్రైమాసికంలో పానిగేల్ V2, స్క్రాంబ్లర్ డార్క్ 2వ జనరేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. మూడో త్రైమాసికంలో మల్టీస్ట్రాడా V2, స్ట్రీట్‌ఫైటర్ V2, పానిగేల్ V2, స్ట్రీట్‌ఫైటర్ V4 3వ జనరేషన్ మోడళ్లను మార్కెట్లోక లాంచ్ చేయడానికి ప్రణాళికలు వేసింది. ఈ బైకులన్నింటికి సంబంధించిన ధరలు రెండో వారం నుంచి డుకాటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. లాంచ్ తేదీలను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు అయినటువంటి హైదరాబాద్, కొచ్చి, పూణే, ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చండీగఢ్, అహ్మదాబాద్, కోల్‌కతాలోని డుకాటీ అధికారిక డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. 2025 ఏడాది కంపెనీకి అత్యంత కీలకం కానుంది. అమ్మకాల పరంగా దేశీయంగా ఉన్న కంపెనీల నుంచి పోటీ ఎక్కువగా ఉన్న తరుణంలో వీటి కంటే అధికరంగా సేల్స్‌ను నమోదు చేయడం డుకాటీకి చాలా ముఖ్యం.

ఇదే సమయంలో డుకాటీ కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే, తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని అన్నిప్రణాళికలు వేసింది. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు అదనంగా మరిన్ని ఓపెన్ చేయాలని చూస్తుంది. 2025లో కీలక నగరాల్లో వీటిని అత్యాధునిక సదుపాయాలతో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








