అందరూ ఎదురుచూసిన క్షణం ఇదే.. ప్రపంచ బైక్ షో ఎంట్రీ వివరాలు తెలుసుకోండి
ప్రతి సంవత్సరం టూవీలర్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒక అంతర్జాతీయ ప్రదర్శన ఉంటుంది, అదే EICMA (Esposizione Internazionale Ciclo Motociclo e Accessori). ఇది ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ అభిమానులందరికీ ఇది ఒక పండుగలా ఉంటుంది. ఈ ప్రదర్శనలో ఆటోమొబైల్ కంపెనీలు తమ తాజా టెక్నాలజీని, రాబోయే మోడళ్లను, భవిష్యత్ కాన్సెప్ట్‌లను ప్రపంచానికి పరిచయం చేస్తాయి. సాధారణంగా మోటార్ షోలు అంటే కార్లు, బైక్‌లు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలు అన్నీ ఉంటాయి. కానీ EICMA మాత్రం పూర్తిగా టూవీలర్ వాహనాలకే అంకితమై ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్లు.. హోండా, యమహా, సుజుకి, కవాసకి, డుకాటి, ట్రయంఫ్, KTM, బజాజ్, హీరో, రాయల్ ఎన్‌ఫీల్డ్, TVS వంటి కంపెనీలు తమ కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తాయి.
కేవలం వాహనాలు మాత్రమే కాదు, ఇక్కడ కొత్త ఇంజిన్ టెక్నాలజీలు, బ్యాటరీ ఇన్నోవేషన్లు, రైడింగ్ గేర్‌లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్లు కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. EICMA 2025 ఈ ఏడాది నవంబర్ 4న అధికారికంగా ప్రారంభమైంది. మొదటి రెండు రోజులు.. నవంబర్ 4, 5 మీడియా, ఇండస్ట్రీ ఎగ్జిబిటర్లకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. ఈ రెండు రోజులలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు, టోమొబైల్ నిపుణులు తాజా మోడళ్లను దగ్గరగా పరిశీలిస్తారు.

కొత్త టెక్నాలజీలపై విశ్లేషణలను ప్రజలకు అందిస్తారు. నవంబర్ 6 నుండి 9 వరకు ఇది ప్రజలకు తెరవబడుతుంది. నాలుగు రోజులపాటు మిలాన్ నగరం బైక్ సౌండ్‌లతో మార్మోగుతుంది. ప్రతి స్టాల్ వద్ద కొత్త ఆవిష్కరణలతో రైడర్ల ఉత్సాహం ఉరకలేస్తుంది. భారతదేశం నుండి కూడా హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్, TVS, బజాజ్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇవన్నీ తమ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌లు, హై-పర్ఫార్మెన్స్ మోడళ్లను ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమయ్యాయి.
EICMA 2025 ప్రదర్శనకు ఇప్పటికే టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బైక్ అభిమానులు ఈ ప్రదర్శనను ప్రత్యక్షంగా చూసేందుకు ఉత్సాహంగా టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఈసారి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కూడా సులభంగా కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో టిక్కెట్ ధర 20 యూరోలు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2,000. అయితే ఎగ్జిబిషన్ వేదిక వద్ద స్వయంగా టిక్కెట్ కొనుగోలు చేస్తే ధర కొంచెం ఎక్కువగా ఉంది.

ఎగ్జిబిషన్ వేదిక వద్ద 25 యూరోలు, అంటే సుమారు రూ. 2,500 గా ఉంటుంది. కేవలం పెద్దలకు మాత్రమే కాకుండా, చిన్నారుల కోసం కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. 4 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టిక్కెట్ ధరపై డిస్కౌంట్ లభిస్తుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే, 4 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. ఈ విధంగా, EICMAలో టిక్కెట్ ధరలను సౌకర్యవంతంగా నిర్ణయించారు
అదనంగా, దివ్యాంగులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీని ద్వారా EICMA నిర్వాహకులు అందరికీ సమాన అవకాశాలను అందించే దిశగా ముందడుగు వేశారు. ఇది ప్రతి ఒక్కరికీ మోటార్‌సైకిల్ ప్రపంచంలోని సాంకేతికత, డిజైన్, ఆవిష్కరణలను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇస్తుంది. అలాగే, పాఠశాలల నుండి గ్రూప్‌గా వచ్చే విద్యార్థులకు కూడా ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి.

ఈ సంవత్సరం జరిగే EICMA 2025లో భారతీయ బ్రాండ్లు కూడా గణనీయంగా పాల్గొంటున్నాయి. హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్, TVS, బజాజ్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడళ్లను, ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టులను ఈ వేదికపై ప్రదర్శించనున్నాయి. ఈసారి, భారత ఆటోమొబైల్ రంగం ప్రపంచ స్థాయిలో తన ప్రతిభను ప్రదర్శించబోతోంది అనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








