బడ్జెట్ లో మంచి బైక్ కోసం చూస్తున్నారా? పెట్రోల్ అవసరం లేని ఈ కొత్త బైక్‌ను ఒకసారి చూసేయండి

ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో డిమాండ్ రోజు రోజుకి పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు గణనీయంగా పెరిగి, వినియోగదారుల ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ విభాగంలో, స్టైల్, పనితీరు, టెక్నాలజీ కలయికతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్రాండ్‌గా ఒబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ నిలిచింది. ప్రముఖ స్టార్ట్-అప్ అయిన ఈ కంపెనీ, వినియోగదారుల అభిరుచులు, రైడింగ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తమ మోడళ్లను మరింత స్మార్ట్‌గా, ఆధునికంగా మార్చడంలో ముందంజలో ఉంది. ఆ ప్రయత్నాల ఫలితంగానే, తాజాగా ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా (Oben Rorr EZ Sigma) పేరుతో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వెర్షన్, ప్రీమియం లుక్‌తో పాటు, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో, ఎలక్ట్రిక్ బైక్ అభిమానులను ఆకర్షించేలా రూపుదిద్దుకుంది. దీని గురించి ఈ కథనంలో చూద్దాం.

ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా ఎలక్ట్రిక్ బైక్ రెండు వేరు వేరు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. 3.4 kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్ ధర రూ. 1.27 లక్షలు కాగా, 4.4 kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్ ధర రూ. 1.37 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. పట్టణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ బైక్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లో ప్రధాన అప్‌గ్రేడ్‌లతో మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తోంది.

Electric Bike Oben Rorr Ez Sigma Price Battery Range And All Top Things

ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు, 3.4 kWh బ్యాటరీ వేరియంట్ 140 కి.మీ. వరకు ప్రయాణించగలదు. మరింత శక్తివంతమైన 4.4 kWh బ్యాటరీ వేరియంట్ అయితే 175 కి.మీ.ల దూరాన్ని సులభంగా అధిగమిస్తుంది. రోర్ EZ సిగ్మా మోడల్ 7.5 kW శక్తివంతమైన మోటార్ 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, ప్రతి రైడ్‌ను శక్తివంతమైనదిగా మారుస్తుంది. బైకును డ్రైవింగ్ చేయడం కూడా చాలా సులువు.

ఒబెన్ రోర్ ఈజెడ్ సిగ్మా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉండి, కేవలం 1.5 నుండి 2 గంటల్లోనే 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత గంటకు 95 కి.మీ.ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఫీచర్ల విషయానికొస్తే, టెక్నాలజీ, స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ రైడర్‌కు అన్ని సమాచారం అందిస్తే, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో-ఫెన్సింగ్ బైకును ఎల్లప్పుడూ రక్షణలో ఉంచుతాయి.

Electric Bike Oben Rorr Ez Sigma Price Battery Range And All Top Things

USB ఛార్జింగ్ పోర్ట్ ద్వారా మొబైల్ పరికరాలను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ రైడింగ్ సమయంలో భద్రతను మరింత పెంచుతుంది. LED హెడ్‌లైట్‌లతో కూడిన నియో-రెట్రో స్టైలింగ్, ఆకర్షణీయమైన LED టెయిల్ ల్యాంప్‌లు రాత్రి సమయంలో రైడింగ్ అనుభవాన్ని మరింత అందంగా, ప్రత్యేకంగా మార్చుతాయి. అర్బన్ యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మోడల్ లుక్‌తో కట్టిపడేస్తుంది.

రైడింగ్ సమయంలో సేఫ్టీ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ప్రీ-లోడ్-అడ్జస్టబుల్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు అమర్చారు. ఇక బ్రేకింగ్ గురించి చూసినట్లయితే CBS తో పాటు 270mm ఫ్రంట్ డిస్క్, 240mm వెనుక డిస్క్ ను రైడర్లకు మరింత కంఫర్టబుల్ రైడింగ్‌ను అందించడానికి ఇచ్చారు. ఇది ఎకో, సిటీ, హవోక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

Electric Bike Oben Rorr Ez Sigma Price Battery Range And All Top Things

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2025, 15:10 [IST]
English summary
Electric bike oben rorr ez sigma price battery range and all top things
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+