లైసెన్స్ అవసరం లేని స్కూటర్లు.. ఈ రాఖీకి అక్కాచెల్లెమ్మలకు ఇంతకన్నా మంచి గిఫ్ట్ ఉండదు

పెట్రోల్ ధరలు పెరుగుతున్న కొద్ది, పేద-మధ్యతరగతి కుటుంబాల ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పరిస్థితిలో ఇంధనంపై ఆధారపడకుండా, తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే మార్గాల కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక పెద్ద మార్గం చూపుతున్నాయి. వీటి ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, పెట్రోల్ అవసరం లేకుండా కేవలం విద్యుత్‌తో నడవడం. ఇంట్లో లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లలో సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ అందించడంతో పాటు, రన్నింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాలుష్యం లేని ప్రయాణం అందించడం వీటి మరో ప్రధాన బలం. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి, వాటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

ముఖ్యంగా వీటిని మహిళలు కూడా నడపచ్చు. రాఖీ పౌర్ణమి సందర్బంగా వీటిలో ఒకదాన్ని అక్కాచెల్లెళ్లకు బహుమతిగా ఇవ్వచ్చు. వీటిని సులభంగా నడపగలరు. వీటిలో గరిష్ట వేగం 25 కి.మీ/గం.లోపు ఉండటంతో, లైసెన్స్ అవసరం ఉండదు. కొన్నింటికి RTO రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. కాబట్టి మహిళలకు కూడా బెస్ట్. వీటిలో క్వాలిటీ బ్యాటరీలు, బలమైన డిజైన్, మంచి సేఫ్టీ ఫీచర్లు, ఉంటూ చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు ఉపయోగపడుతాయి.

Electric Scooters Without License Best Gift For Sisters On Raksha Bandhan

odysse Racer Neo: భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో నమ్మకమైన పేరుగా నిలిచింది ఒడిస్సే. దీని రేసర్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధర రూ.52,000 ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇది లైసెన్స్ అవసరం లేకుండా నడిపే విధంగా రిజిస్ట్రేషన్-ఫ్రీ సెగ్మెంట్‌కి చెందినది. ఇది ఒక్క ఛార్జ్‌లో గరిష్టంగా 90 నుండి 115 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఇందులో 2.7 Kwh బ్యాటరీ ప్యాక్ ఉంటాయి.

ఈ బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపుగా 4 నుంచి 8 గంటల సమయం పడుతుంది, అంతే కాదు, ఈ స్కూటర్ 250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఇది తక్కువ సౌండ్‌తో, తక్కువ వేగంతో సాఫీగా ప్రయాణించే విధంగా తయారైంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కి.మీ. మాత్రమే.స్కూటర్‌ను యువతతో పాటు వృద్ధులు, మహిళలు కూడా సులభంగా నడపగలరు.

Electric Scooters Without License Best Gift For Sisters On Raksha Bandhan

Ampere Reo 80: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్(GEML)కు చెందిన ఆంపియర్ రియో 80 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. మహిళలు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు అనుకూలంగా ఉంటుంది. దీని ధర వచ్చేసరికి రూ.63,405 నుంచి ఉంది. ఆంపియర్ రియో 80 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు నిజమైన రేంజ్‌ను అందిస్తుంది. ఇది 1.44 kwh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది.

దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు నిజమైన రేంజ్‌ను అందిస్తుందని గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ పేర్కొంది. అంటే ఇది రోజువారీ అవసరాలకు తగినంత రేంజ్‌ను కలిగి ఉంటుందని అర్థం. దీని టాప్ స్పీడ్ వచ్చేసి దాదాపు 25 కి.మీల వరకు ఉంటుంది. ఇందులో అమర్చిన బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేయడానికి దాదాపుగా ఐదున్నర గంటల సమయం పడుతుంది.

Electric Scooters Without License Best Gift For Sisters On Raksha Bandhan

Ujaas eGo: యుజాస్ ఇగో ఎలక్ట్రిక్ స్కూటర్ చిన్నదిగా, సింపుల్‌గా కనిపించినా, రోజువారి అవసరాలకు సరిపడే పనితీరును అందిస్తుంది. 250 వాట్ల మోటార్‌తో వచ్చే ఈ స్కూటర్ గరిష్టంగా 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 50 కి.మీ వరకు సాఫీగా నడుస్తుంది. ఛార్జింగ్ సమయం సుమారు 6 గంటలు కావడంతో, ఉదయం బయటకు వెళ్లే ముందు లేదా రాత్రికి రాత్రే సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

దీని ఎక్స్ షోరూమ్ ధర వచ్చసి రూ.43,974 నుంచి ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 1.56 Kwhగా ఉంటుంది. ఈ స్కూటర్, తక్కువ దూర ప్రయాణాలకు, లైసెన్స్ అవసరం లేని వర్గానికి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ బలంగా ఉండటంతో పాటు, కంపెనీ ఇచ్చే ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ కూడా విశ్వసనీయంగా ఉంటుంది. మహిళలతో పాటు అందరు కూడా దీన్నిఈజీగా నడపవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, August 8, 2025, 16:27 [IST]
English summary
Electric scooters without license best gift for sisters on raksha bandhan
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+