గ్రామీణ ప్రజల ఫస్ట్ ఛాయిస్.. రైతు కుటుంబాల ఫేవరెట్ టూవీలర్స్ ఇవే..బడ్జెట్ తక్కువ.. పర్ఫామెన్స్ ఎక్కువ

మనదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఇక్కడ గ్రామాల్లో నివసించే వారి సంఖ్య చాలా ఎక్కువ. పొలం పనులకు వెళ్లాలన్నా, పాల కేంద్రానికి పాలు తీసుకెళ్లాలన్నా, ఇతర పనుల కోసం వెళ్లాలన్నా టూ వీలర్స్ చాలా అవసరం. అందులోనూ బైక్‌లు తప్పనిసరి.

ముఖ్యంగా గ్రామీణ వాసులు తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఎక్కువ కాలం మన్నిక వచ్చే హోండా సీడీ 110 డ్రీమ్, బజాజ్ సీటీ 110ఎక్స్, హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ ప్లాటినా 100 వంటి మోటార్‌సైకిళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఈ బైక్‌ల ధర, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

Hero Splendor

మొదటగా హోండా సీడీ 110 డ్రీమ్ (Honda CD 110 Dream) బైక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మోటార్‌సైకిల్‌ను ఎలాంటి రోడ్లపై అయినా సులభంగా నడపవచ్చు. ఇది చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 76,401.

ఈ హోండా సీడీ 110 డ్రీమ్ మోటార్‌సైకిల్ ధరకు తగ్గట్టుగానే పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. కొంచెం ఎక్కువ కెపాసిటీ కలిగిన 109.51 సీసీ పెట్రోల్ ఇంజన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. అంతేకాకుండా ఇది లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. టూ-పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ సెటప్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Bajaj CT

బజాజ్ సీటీ 110ఎక్స్ (Bajaj CT 110X) గురించి చెప్పాలంటే.. దీనిని పేదల బైక్ అని పిలిచినా తప్పులేదు. అంత తక్కువ ధరలో ఇది గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 70,381. అంతేకాకుండా ఇది చూడటానికి చాలా సాధారణమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

కొత్త బజాజ్ సీటీ 110ఎక్స్ తగినంత పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్లను కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ మోటార్‌సైకిల్ 115.45 సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అలాగే ఆకర్షణీయమైన రంగుల్లో కూడా లభిస్తుంది. ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Bajaj Platina

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) మోటార్‌సైకిల్ గురించి సాధారణ గ్రామంలో ఉండే వారికి కూడా తెలుసు. ఇది దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌గా నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,096 నుండి రూ. 85,001 వరకు ఉంటుంది. ఇది 97.2 సీసీ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండి, లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe) ఈ బైక్ కూడా భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. రైతులు దీనిని బాగా ఇష్టపడతారు. ఇది చాలా తక్కువ ధరలో కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 62,500 నుండి రూ. 70,400 వరకు ఉంటుంది. ఇది 97.2 సీసీ పెట్రోల్‌తో లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

చివరగా బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100) మోటార్‌సైకిల్ గురించి మాట్లాడుకుందాం. దీనిని గ్రామీణ ప్రాంత ప్రజలు పోటీపడి కొనుగోలు చేస్తారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,400. ఇది 102 సీసీ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండి, లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, April 24, 2025, 7:02 [IST]
English summary
Favorite bikes of village farmers children long lasting and affordable too
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+