హోండా యాక్టివా e: నంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది.. త్వరలో గుడ్ న్యూస్?

విశ్వసనీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన హోండా యాక్టివా e: మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునేందుకు రెడీ అవుతుంది. జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ స్కూటర్‌ను ప్రదర్శించారు. ఇది స్టాండర్డ్, రోడ్‌సింక్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.1.17 లక్షల నుండి రూ.1.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

ఇందులో బ్యాటరీ మార్చుకునే సదుపాయం ఉంది. ప్రస్తుతం, ఇది బెంగళూరు, ఢిల్లీ , ముంబై మహానగరాలలో మాత్రమే బ్యటరీ-యాజ్-ఏ-సర్వీస్ ప్లాన్ కింద అమ్ముడవుతోంది. BaaS ప్లాన్ కింద, హోండా యాక్టివా ఇ స్కూటర్ యజమానులు తమ ఖాళీ అయిన బ్యాటరీని దగ్గర్లోని ఇ:స్వాప్ ఛార్జింగ్ స్టేషన్‌లో పెట్టి, దాని బదులు పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీని తీసుకోవచ్చు. దీని కోసం నెలకు రూ.678 రుసుము చెల్లించాలి.

Honda Activa e

ప్రస్తుతం హోండాకు బెంగళూరులో 83, న్యూఢిల్లీలో 10 ఇ:స్వాప్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే, ముంబైలో ఒక్క ఇ:స్వాప్ ఛార్జింగ్ స్టేషన్ కూడా లేదు. ఈ కారణంగానే యాక్టివా ఇ స్కూటర్ అమ్మకాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. అయితే ఈ సమస్యను హోండా కంపెనీ త్వరలోనే పరిష్కరించబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లో యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే వారికి ఛార్జింగ్ డాక్‎ను పరిచయం చేయడానికి హోండా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఛార్జింగ్ డాక్‎ను ఉపయోగించి యాక్టివా ఇ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌ను సులభంగా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే, స్కూటర్‌లో ఉపయోగించిన బ్యాటరీని ఈ పరికరం సహాయంతో ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. యూరప్‌లో అమ్ముడవుతున్న హోండా సియువి ఇ స్కూటర్లు ఇదే సిస్టమ్ కలిగి ఉన్నాయి. ముఖ్యంగా, యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సియువి ఇ మోడల్‌ను ఆధారంగా చేసుకుని తయారైంది.

Honda Activa e

హోండా సియువి ఇ స్కూటర్‌ను 270W ఛార్జింగ్ డాక్ ఉపయోగించినప్పుడు, దాదాపు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. అలాగే, 25% నుండి 75% వరకు ఛార్జ్ కావడానికి కేవలం 3 గంటలు మాత్రమే పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా లేటెస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో LED హెడ్‌లైట్, LED DRLలు, LED టెయిల్-ల్యాంప్‌లు, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఇది పర్ల్ షాలో బ్లూ, పర్ల్ మిస్టీ వైట్ & పర్ల్ సెరినిటీ బ్లూ వంటి వివిధ రంగులలో లభిస్తుంది. ఇందులో 1.5 కిలో వాట్ కెపాసిటీ గల రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కి.మీ. దూరం ప్రయాణించగలదు.

Honda Activa e

ఇది 7.0-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా పదుల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఎకాన్, స్టాండర్డ్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. రైడర్ల సేఫ్టీ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

మొత్తంగా చూస్తే, యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంట్లో ఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించడానికి కంపెనీ ఛార్జింగ్ డాక్‎ను అందించబోతోందని చెప్పడం చాలా మంచి పరిణామం. ఈ పరికరం అందుబాటులోకి వస్తే, వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఆ తర్వాత, నగరాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా యాక్టివా ఇని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. దీనివల్ల అమ్మకాల సంఖ్య మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 22, 2025, 17:40 [IST]
English summary
From baas to home charging hondas strategy for activa e
Read more on: #honda #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+