వినాయక చవితికి కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే!

ఆగస్టు 27న వినాయక చవితి పండుగ వస్తోంది. ఈ పండుగ రోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయడం చాలామందికి ఒక మంచి సెంటిమెంట్. మీరు కూడా ఈ వినాయక చవితికి కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కొన్ని బెస్ట్ బైకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ బైకులు రూ.70,000ల నుంచి ప్రారంభమై, ఒక లీటరు పెట్రోల్‌కు 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

1. బజాజ్ ప్లాటినా 100 : బజాజ్ ప్లాటినా 100 అనేది రోజువారీ ప్రయాణాలకు చాలా నమ్మకమైన బైక్. సిటీ ట్రాఫిక్‌లో కూడా సులభంగా నడపవచ్చు. దీనికి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ దీని మైలేజ్. ఇది ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.70,611.

Ganesha Festival 2025 Best Bikes Under Rs 1 Lakh with High Mileage

మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా సరసమైన ధర. ఈ బైక్‌లో 102 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీ. వరకు ఉంటుంది. ఇందులో అనలాగ్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ (CBS), ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

2. హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ : హీరో సూప‌ర్ స్ప్లెండ‌ర్ ఎక్స్‌టెక్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన బైక్. దీనికి అడ్వాన్సుడ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.88,628 నుంచి రూ.92,528 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది చాలా మంచి డిజైన్‌తో వస్తుంది. మ్యాట్ నెక్సస్ బ్లూ, మ్యాట్ గ్రే, బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభిస్తుంది.

Ganesha Festival 2025 Best Bikes Under Rs 1 Lakh with High Mileage

ఈ బైక్‌లో 124.7 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 69 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలదు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఐడిల్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్రమ్/డిస్క్ బ్రేక్ ఆప్షన్లు ఉన్నాయి.

3. టీవీఎస్ రేడియన్ : టీవీఎస్ రేడియన్ బైక్ దాని దృఢమైన నిర్మాణం, ఎక్కువ కాలం మన్నే నాణ్యతకు పేరుగాంచింది. రోజువారీ ప్రయాణాలకు, లాంగ్ డ్రైవ్స్‌కు కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ.73,518 నుంచి రూ.86,845 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది మెటల్ బ్లాక్, ఆల్ బ్లాక్, టైటానియం గ్రే, రాయల్ పర్పుల్, స్టార్‌లైట్ బ్లూ వంటి రంగుల్లో లభిస్తుంది.

Ganesha Festival 2025 Best Bikes Under Rs 1 Lakh with High Mileage

ఈ బైక్‌లో 109.7 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది లీటరుకు 73 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వగలదు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

4. హోండా షైన్ 100 డిఎక్స్ :హోండా షైన్ 100 డిఎక్స్ బైక్ నమ్మదగిన బైకులలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.74,959. ఇది చాలా మంచి డిజైన్‌తో వస్తుంది. పర్ల్ ఇగ్నీయస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ వంటి రంగుల్లో ఇది లభిస్తుంది. ఈ బైక్ ఒక లీటరుకు 70 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఎల్‌సీడీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Ganesha Festival 2025 Best Bikes Under Rs 1 Lakh with High Mileage

5. హీరో ప్యాషన్ ప్లస్ : హీరో ప్యాషన్ ప్లస్ దాని స్టైలిష్ లుక్ కోసం యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ.82,000. ఇది బ్లాక్ హెవీ గ్రే, బ్లాక్ గ్రే స్ట్రైప్, స్పోర్ట్ రెడ్, బ్లాక్ నెక్సస్ బ్లూ వంటి రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్‌లో 97.2 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 70 కి.మీ./లీ వరకు మైలేజ్ ఇవ్వగలదు. ఇందులో డిజిటల్ అనలాగ్ క్లస్టర్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు అమర్చబడి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 14, 2025, 16:56 [IST]
English summary
Ganesha festival 2025 best bikes under rs 1 lakh with high mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+