బడ్జెట్ ధరలో ఫ్యామిలీ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీలు.. 5 సంవత్సరాల వారంటీ!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్రోల్ బైక్స్, స్కూటర్లతో పాటు ఈవీ మోడళ్లకు కూడా ఆదరణ పెరగడంతో తయారీదారులు పోటా పోటీగా వరుస లాంచ్‌ల్ చేస్తున్నారు. మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ కంపెనీలు ప్రస్తుతం తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. అయితే పెద్ద బ్రాండ్‌లకు పోటీగా చిన్న సంస్థలు కూడా ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ను విడుదల చేస్తున్నాయి. వాటిలో ప్రముఖ కంపెనీ గోదావరి(godawari) ఎలక్ట్రిక్ మోటార్స్ చాలా కాలంగా పెద్ద కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా నిలవడానికి దేశీయ వినియోగదారుల కోసం తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసే అమ్మకానికి తీసుకొస్తుంది. ఈ కంపెనీ దేశంలో ఇబ్లు ఫియో ఎక్స్ మోడల్ ద్వారా బాగా పేరు సంపాదించింది. ఆగస్టు 2024లో ఈ ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇది మెరుగైన సేల్స్‌ను నమోదు చేస్తూనే ఉంది.
Eblu Feo Xను 2024లో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ప్రారంభ ఎడిషన్‌లో అధికారికంగా ప్రారంభించారు. దీన్ని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని బ్రాండ్ ఉత్పత్తి కేంద్రంలో స్థానికంగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పడు ఇది 2025లో కొత్త అప్‌డేట్‌లను పొందింది. కొత్త ఇబ్లు ఫియో ఎక్స్ రూ.99,999ల ఎక్స్ షోరూమ్‌కు విడుదల అయింది. ఫ్యామిలీ కస్టమర్లకు ఇది అనుకూలంగా ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌తో 110 కి.మీలు ప్రయాణిస్తుంది.

ఇది పాంటోన్ బ్లూ, వైన్ రెడ్, జెట్ బ్లాక్, టెలిగ్రే, ట్రాఫిక్ వైట్ వంటి ఐదు కలర్స్‌లలో కొనుగోలుకు లభిస్తుంది. ప్రధానంగా ఎక్కువ లగేజీని తీసుకెళ్ళడానికి సీటు క్రింది భాగంలో 28 లీటర్ల స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. గోదావరి Eblu Feo X ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, 7.4-అంగుళాల స్మార్ట్ మల్టీ-కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటివి ఉన్నాయి.
ఇంకా కాల్ అలర్ట్, టైప్ C USB ఛార్జింగ్ పోర్ట్, ముందు చీకట్లో ప్రకాశవంతమైన వెలుతురు కోసం పూర్తి LED లైటింగ్, గుంతల రోడ్లపై కూడా సునాయాసంగా ప్రయాణించడానికి టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ సెటప్, రైడింగ్‌లో రక్షణ కోసం కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS), డిస్క్ బ్రేక్‌లు వంటివి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కొత్త ఇ-స్కూటర్‌లో ఉన్నాయి. ఇది 12-అంగుళాల ట్యూబ్‌లెస్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

ఇబ్లు ఫియో ఎక్స్ స్కూటర్ ఎకో, నార్మల్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌ను కలిగి ఉంటుంది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఇది రివర్స్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. గోదావరి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 2.36 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీంతో ఇది పూర్తి ఛార్జ్‌తో 110 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 60 కి.మీలుగా ఉంది. 60V హోమ్ ఛార్జర్‌ని వాడినట్లయితే ఈ స్కూటర్ బ్యాటరీని 5 గంటల 25 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇ-స్కూటర్‌పై కంపెనీ ప్రత్యేకంగా 5 సంవత్సరాల లేదా 50,000 కి.మీ వారంటీని ఆఫర్ చేస్తుంది. భారత మార్కెట్లో ఇప్పటివరకు దీనికి 1,000 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్లు వచ్చాయని సమాచారం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








