బుల్లెట్ బైక్ ప్రియులకు దసరా ముందే వచ్చింది భయ్యో.. ఏకంగా రూ.19 వేల వరకు తగ్గిన ధర!
భారతదేశంలో అగ్రగామి మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). ప్రతి నెల వేలాది బైక్‌లను విక్రయించే ఈ సంస్థ, ఇతర కంపెనీల మాదిరిగానే తమ బైక్‌ల ధరలలో జీఎస్టీ 2.0 మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం కొన్ని బైక్‌ల ధరలు తగ్గాయి. మరికొన్నింటి ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 350సీసీ కంటే ఎక్కువ బైక్‌లకు జీఎస్టీ పన్నును 40శాతానికి పెంచడమే ఈ మార్పులకు కారణం. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ తెలిపింది.
గోన్ క్లాసిక్ 350 (Goan Classic 350) బైక్‌పై గరిష్టంగా రూ. 19,665 ధర తగ్గింపు ప్రకటించాడు. దీని పాత ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.37 లక్షలు ఉండగా, ఇప్పుడు అది రూ. 2.17 లక్షలుగా తగ్గింది. అదే సమయంలో సూపర్ మీటియోర్ 650 బైక్ ధర గరిష్టంగా రూ. 29,486 పెరిగింది. దీని పాత ధర రూ. 3.71 లక్షలు నుండి కొత్త ధర రూ. 3.98 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) బైక్ పాత ధర రూ. 1.49 లక్షలు ఉండగా, జీఎస్టీ 2.0 మార్పుల వల్ల ఇప్పుడు రూ. 1.37 లక్షలకు తగ్గింది.

బుల్లెట్, క్లాసిక్, మీటియోర్ ధరలు
బుల్లెట్ 350 (Bullet 350) బైక్ పాత ధర రూ. 1.76 లక్షలు ఉండగా, కొత్త ధర రూ. 1.62 లక్షలుగా నిర్ణయించారు. క్లాసిక్ 350 (Classic 350) బైక్ ధర రూ. 1.97 లక్షలు నుండి రూ. 1.81 లక్షలకు తగ్గింది. మీటియోర్ 350 (Meteor 350) బైక్ పాత ధర రూ. 2.08 లక్షలు నుండి రూ. 1.91 లక్షలకు తగ్గింది.
పెరిగిన ధరలు
అదేవిధంగా, స్క్రామ్ 450 (Scram 450) బైక్ ధర రూ. 2.08 లక్షలు నుండి రూ. 2.23 లక్షలకు పెరిగింది. గురిల్లా 450 (Guerrilla 450) బైక్ ధర రూ. 2.39 లక్షలు నుండి రూ. 2.56 లక్షలకు పెరిగింది. హిమాలయన్ 450 (Himalayan 450) బైక్ ధర రూ. 2.85 లక్షలు నుండి రూ. 3.05 లక్షలకు పెరిగింది.

పెరిగిన 650సీసీ బైక్‌ల ధరలు
ఇంటర్సెప్టర్ 650 (Interceptor 650) బైక్ పాత ధర రూ. 3.09 లక్షలు ఉండగా, ఇప్పుడు ఇది రూ. 3.32 లక్షలకు పెరిగింది. కాంటినెంటల్ జీటీ (Continental GT) బైక్ ధర రూ. 3.25 లక్షలు నుండి రూ. 3.49 లక్షలకు పెరిగింది. క్లాసిక్ 650 (Classic 650) బైక్ ధర రూ. 3.36 లక్షలు నుండి రూ. 3.61 లక్షలకు పెరిగింది.
షాట్‌గన్, బియర్ ధరలు
షాట్‌గన్ 650 (Shotgun 650) బైక్ ధర రూ. 3.67 లక్షలు నుండి రూ. 3.94 లక్షలకు పెరిగింది. చివరగా, బియర్ 650 (Bear 650) బైక్ పాత ధర రూ. 3.46 లక్షలు ఉండగా, ఇది రూ. 3.71 లక్షలకు పెరిగింది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే. ఈ ధరల మార్పులు రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్లకు కొన్ని బైక్‌ల విషయంలో అనుకూలంగాను, మరికొన్నింటిలో ప్రతికూలంగాను ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాల పెరుగుదలకు ఈ ధర తగ్గింపు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనడం చాలామందికి ఒక కల. కానీ, వాటి అధిక ధరల కారణంగా చాలామంది వాటిని కొనకుండా వెనక్కి తగ్గుతుంటారు. సెప్టెంబర్ 22 నుండి అలాంటి వారు కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








