ఒక్క చక్రంతో నడిచే ఎలక్ట్రిక్ బైక్! దీన్ని ప్రశంసించడానికి మాటలు రావడం లేదు.. షాక్‌లో కంపెనీ!
భారతదేశంలో స్పోర్ట్స్ బైక్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా యువతలో KTM బైక్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆస్ట్రియాకు చెందిన ఈ ప్రఖ్యాత మోటార్ సైకిల్ బ్రాండ్ KTM, భారత మార్కెట్లో డ్యూక్, RC, అడ్వెంచర్ వంటి శక్తివంతమైన మోడళ్లను అందిస్తోంది. వాటి ధరలు కొంచెం ఎక్కువైనా, వాటి స్టైల్, వేగం, పర్ఫార్మెన్స్ కారణంగా మన దేశంలో యువతలో అభిమానాన్ని ఏర్పరచుకున్నాయి. హై-స్పీడ్ రైడింగ్‌కు, ట్రిప్‌లకు వీటిని ప్రత్యేకంగా ఎంచుకునే యువత భారీగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఒక యువకుడు తన సృజనాత్మకతతో చాలా వినూత్నమైన బైక్‌ను రూపొందించాడు. ఈ బైక్‌కు అందించిన రూపం మాత్రం KTM బైక్‌లను తలపించేలా ఉంది. కానీ ఇందులో అసలు ప్రత్యేకత మరే బైక్‌లోనూ కనిపించదు, ఇది ఒకే ఒక చక్రంతో నడుస్తుంది.
సింగిల్ వీల్ బైక్ అంటే కేవలం స్టంట్స్ కోసమే వాడతారని చాలామంది అనుకుంటారు, కానీ ఈ యువకుడు తయారు చేసిన బైక్ మాత్రం వాస్తవంగా రోడ్డుపై నడవగలిగేలా, సాధారణ ప్రయాణాలకు అనువుగా కనిపిస్తోంది. ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైన ఒక వీడియో ప్రకారం, ఈ బైక్‌ను గుజరాత్ రాష్ట్రంలో తయారు చేసినట్లు తెలుస్తుంది. ఒక యువకుడు తన స్వంత శ్రమతో, స్థానిక వనరులతో ఈ సింగిల్ టైర్ బైకును రూపొందించడం గమనార్హం.

బైక్ స్ట్రక్చర్, బాడీ డిజైన్ మొత్తం KTM లుక్‌లో ఉండటంతో అది చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు.ఇది కేవలం ఒక ప్రయోగాత్మక బైక్ మాత్రమే కాదు, యువతలోని సృజనాత్మకత, ఇంజినీరింగ్ ప్రతిభ, టెక్నాలజీపై ఉన్న ఆసక్తికి నిదర్శనం కూడా. ఈ బైక్ ఒకే ఒక చక్రంతో నడుస్తుంది, పైగా ఇది పూర్తిగా విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. అద్భుతమైన డిజైన్‌తో పాటు, పరిసరాల ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉండటం దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న వీడియోలో, ఈ యువకుడు స్వయంగా బైక్ ఎలా పనిచేస్తుందో వివరిస్తూ, రోడ్డుపై నడుపుతూ చూపిస్తున్నాడు. రోడ్డుపై నడుపుతున్న ఈ ప్రత్యేక బైక్‌ను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఫోటోలు తీస్తూ, మరికొంతమంది ప్రశంసిస్తున్నారు. ఆ వీడియోలో బైక్ తయారీ ప్రక్రియను కూడా దశల వారీగా చూపించారు. మొదట, బైక్‌కు అవసరమైన ఫ్రేమ్‌ను రూపొందించేందుకు స్టీల్ ప్లేట్లు, లోహపు ట్యూబ్‌లు వాడారు.

ఇవి అవసరమైన పరిమాణంలో కత్తిరించి, తగిన యాంగిల్‌లో వంచి, తరువాత వెల్డింగ్ ద్వారా గట్టిగా కలిపారు. ఇది బైక్‌కు సరైన బలాన్నిస్తుంది. ఇంకా, బైక్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండిల్ బార్ తయారీ విధానాన్ని కూడా చూపించారు. డ్రైవింగ్‌కు అవసరమైన నియంత్రణ, వెళ్లే దిశపై పట్టు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించారు. ఇక ఇది తలకిందులుగా అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ వీల్ ద్వారా బైక్ పనిచేస్తుంది.
మోటార్ నేరుగా వీల్ యాక్సిల్‌కు కనెక్ట్ అయి, విద్యుత్ శక్తితో చక్రాన్ని తిప్పే విధంగా రూపొందించబడింది. ఈ వినూత్న ఎలక్ట్రిక్ బైక్ లో ప్రతీ భాగం, ప్రతీ అంశం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. ఈ బైక్‌లో మరో ప్రత్యేకతగా నిలిచింది సీటు. సాధారణ బైక్‌లకు భిన్నంగా, ఈ బైక్‌లో సీటు చక్రం పైనే అమర్చబడింది. ఈ కారణంగా డ్రైవింగ్ అనుభూతి పూర్తిగా వేరుగా ఉంటుంది.

సీటు డిజైన్ కోసం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేశారు. ఇది బైక్ సెంటర్ ఆఫ్ గ్రావిటీకీ సరిగ్గా బ్యాలెన్స్ అయ్యేలా ఉంటూ, వినియోగదారుడికి సౌకర్యం కలిగించేలా రూపొందించారు. బైక్ నిర్మాణంలో అంతా పూర్తయిన తర్వాత, దాని రూపాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. మొదట బైక్ బాడీ మొత్తం స్క్రబ్ చేసి, తుప్పు పట్టకుండా శుభ్రం చేశారు. చివరకు నారింజ, తెలుపు, నలుపు కలర్స్ జోడించారు.


Click it and Unblock the Notifications








