కస్టమర్ బాధ అర్థం చేసుకున్న హార్లీ..పాత బైక్‌ లోపాలన్నీ సరిచేసి అప్‌డేటెడ్ ఫీచర్లతో రూ.2.79లక్షలకే కొత్త బైక్

అమెరికన్ మోటార్‌సైకిల్ దిగ్గజం హార్లీ-డేవిడ్‌సన్ (Harley-Davidson) భారత మార్కెట్‌ను ఆకర్షించేందుకు దేశంలోనే అత్యంత తక్కువ ధర కలిగిన ఎక్స్440 (X440) సిరీస్‌లో భాగంగా, కొత్త ఎక్స్440 టి(X440 T) మోటార్‌సైకిల్‌ను రూ.2.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఈ కొత్త బైక్‌ను ఒకే వేరియంట్‌లో పియరల్ బ్లూ, రెడ్, వైట్, వివిడ్ బ్లాక్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

కొత్త ఎక్స్440 టి బైక్ సాధారణ ఎక్స్440 మోడల్ కంటే మెరుగైన లుక్, అడ్వాన్సుడ్ ఫీచర్లను కలిగి ఉంది. కస్టమర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, పాత ఎక్స్440 బైక్ వెనుక భాగంలోని లోపాలను ఇందులో హార్లీ-డేవిడ్‌సన్ సరిచేసింది. ఇందులో కొత్త సబ్-ఫ్రేమ్, టెయిల్ సెక్షన్ ను పూర్తిగా మార్చారు.

Harley-Davidson Launches X440 T at Rs 2 79 Lakh Slashes Prices of Existing X440 Variants

ఇది బైక్‌కు మరింత సమగ్రమైన, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అలాగే ఇందులో తక్కువగా, వెడల్పుగా ఉండే హ్యాండిల్‌బార్, బార్-ఎండ్ మిర్రర్స్ ఉన్నాయి. హ్యాండిల్‌బార్ మధ్యలో కాక్‌పిట్ ప్రాంతం చక్కగా ఏర్పాటు చేయబడి, కేబుల్స్ అడ్డంగా లేకుండా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.

కొత్త ఎక్స్440 టి బైక్ రైడ్-బై-వైర్ థ్రాటిల్ ఫీచర్‌తో వస్తుంది. ఇది రోడ్, రైన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రైన్ మోడ్‌లో బైక్ టార్క్ సామర్థ్యం 10 శాతం తగ్గుతుంది. దీనివల్ల తడి రోడ్లపై ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుంది. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో స్విచ్ ఆన్/ఆఫ్ చేయగలిగే ట్రాక్షన్ కంట్రోల్, వెనుక చక్రానికి ఏబీఎస్ (ABS) ఉన్నాయి.

Harley-Davidson Launches X440 T at Rs 2 79 Lakh Slashes Prices of Existing X440 Variants

అలాగే, అత్యవసర బ్రేకింగ్ సమయంలో అన్ని ఇండికేటర్లు వెలిగే ప్యానిక్ బ్రేకింగ్ అలర్ట్ ఫీచర్, ఈ విభాగంలో తొలిసారిగా వచ్చింది. కొత్త స్టైల్ మరియు టెక్నాలజీ ఫీచర్లు ఉన్నప్పటికీ, ఎక్స్440 టి బైక్ ఇంజిన్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇందులో పాత ఎక్స్440 బైక్‌లో ఉన్న అదే 440సీసీ, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజిన్ గరిష్టంగా 27 బీహెచ్‌పీ పవర్, 38 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఛాసిస్, సస్పెన్షన్ సిస్టమ్, మొత్తం రైడింగ్ అనుభూతి పాత ఎక్స్440 బైక్‌కు అలవాటు పడిన వారికి అదే అనుభూతిని అందిస్తుంది.

Harley-Davidson Launches X440 T at Rs 2 79 Lakh Slashes Prices of Existing X440 Variants

కొత్త ఎక్స్440 టి విడుదల సందర్భంగా హార్లీ-డేవిడ్‌సన్ పాత ఎక్స్440 మోడళ్ల ధరలను కూడా భారీగా తగ్గించింది. X440 S వేరియంట్ ధర రూ. 2,79,500 నుంచి రూ.2,54,900కు తగ్గింది (రూ. 24,600 తగ్గింపు), అలాగే X440 Vivid వేరియంట్ ధర రూ. 2,59,500 నుంచి రూ. 2,34,500కు తగ్గింది (రూ. 25,000 తగ్గింపు).

ఈ కొత్త బైక్ రాకతో పాత ఎక్స్440 డెనిమ్(Denim) వేరియంట్‌ను కంపెనీ అమ్మకాల నుంచి నిలిపివేసింది. కొత్త ఎక్స్440 టి బైక్ బుకింగ్‌లు ఇప్పటికే హార్లీ-డేవిడ్‌సన్, హీరో ప్రీమియా డీలర్‌షిప్‌లలో అలాగే ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి.

అమెరికన్ దిగ్గజం హార్లీ-డేవిడ్‌సన్ భారతీయ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కస్టమర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ X440 Tని విడుదల చేయడం, అలాగే పాత మోడళ్ల ధరలను భారీగా తగ్గించడం సాహసోపేతమైన నిర్ణయం. సవరించిన వెనుక భాగం, రైడ్-బై-వైర్ టెక్నాలజీ, రెండు రైడింగ్ మోడ్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లతో X440 T బైక్‌ను మరింత పూర్తి స్థాయి ఉత్పత్తిగా మార్చారు.

బేస్ మోడల్ ధర కూడా గణనీయంగా తగ్గడంతో, హార్లీ-డేవిడ్‌సన్ ఇప్పుడు భారతీయ రెట్రో రోడ్‌స్టర్ విభాగంలో రూ. 2 - 3 లక్షల ధర పరిధిలో ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. మొత్తంమీద ఈ ధర తగ్గింపు, కొత్త టెక్నాలజీ అప్‌డేట్ కారణంగా X440 ప్లాట్‌ఫామ్ ఇప్పుడు కస్టమర్‌లకు మరింత ఆకర్షణీయమైన మరియు విలువైన ఎంపికగా మారింది అనడంలో సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, December 8, 2025, 7:28 [IST]
English summary
Harley davidson launches x440 t at rs 2 79 lakh slashes prices of existing x440 variants
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+