హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ 117 విడుదల.. ఇదే రేటుకు క్రెటా కారు కొనొచ్చేమో.. అంత పెట్టి కొంటారా ?
ప్రపంచంలోనే ప్రఖ్యాత టూ వీలర్ తయారీ సంస్థ అయిన అమెరికన్ హార్లీ-డేవిడ్‌సన్ తన సరికొత్త స్ట్రీట్ బాబ్ 117 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ స్టైల్, ఇంజిన్ కెపాసిటీ, ధర ఇప్పుడు భారతదేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ బైక్ ధరతో మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ టాప్ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఒకవైపు బైక్ పై ఉన్న అభిరుచి, మరోవైపు కారుతో వచ్చే సౌకర్యం... ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పుడు ఈ కొత్త బైక్ వివరాలు, దాని ప్రత్యేకతలను తెలుసుకుందాం.

క్లాసిక్ బాబర్ మోడల్‌లో తిరిగి వచ్చిన హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ 117, పెద్ద మిల్వాకీ-ఎయిట్ 117 (1,923 సీసీ) వి-ట్విన్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.77 లక్షలుగా నిర్ణయించారు. ఈ భారీ ఇంజిన్ ఉన్న హార్లీ మోడళ్లలో ఇది అత్యంత తక్కువ ధర కలిగిన బైక్‌గా నిలిచింది. ఈ బైక్ హార్లీ సంప్రదాయ డిజైన్‌ను కొనసాగిస్తూనే, అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.
హార్లీ-డేవిడ్‌సన్ బిగ్-ట్విన్ సిరీసులోకి ప్రవేశించడానికి ఈ స్ట్రీట్ బాబ్ 117 మోడల్ ఒక మంచి ఆప్షన్. దీనిలో ఉన్న 1,923 సీసీ వి-ట్విన్ ఇంజిన్ 91 హెచ్‌పీ పవర్, 156 ఎన్‌ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇందులో మూడు రైడ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

సస్పెన్షన్ విషయానికొస్తే, ముందు భాగంలో 49 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందువైపు 4-పిస్టన్ ఫిక్స్‌డ్, వెనుకవైపు 2-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌లతో కూడిన డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.
ఈ బైక్ ప్రధాన ఆకర్షణ దాని బాబర్-ప్రేరిత డిజైన్. మినీ ఏప్-హ్యాంగర్ హ్యాండిల్‌బార్లు, ఒకే సీటు, బయటికి కనిపించే సస్పెన్షన్ వంటివి దీనిని స్పెషల్‌గా నిలబెడతాయి. హ్యాండిల్‌బార్‌పై అమర్చిన డిజిటల్-అనలాగ్ డిస్‌ప్లే ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. బైక్‌కు ముందు భాగంలో 19 అంగుళాల, వెనుక భాగంలో 16 అంగుళాల వీల్స్ ఉన్నాయి.

స్టాండర్డ్‌గా అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. అయితే ఎక్స్ ట్రా ధర చెల్లించి క్రాస్-స్పోక్డ్ వీల్స్‌ను కూడా పొందవచ్చు. బైక్ బరువు 293 కిలోలు కాగా, సీటు ఎత్తు 680 ఎంఎం. వైవిధ్యభరితమైన రంగులైన వివిడ్ బ్లాక్, బిల్లియర్డ్ గ్రే, సెంటర్‌లైన్, ఐరన్ హార్స్ మెటాలిక్, పర్పుల్ అబిస్ డెనిమ్ వంటి ఐదు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది.
హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ బాబ్ 117 ధర రూ. 18.77 లక్షలు(ఎక్స్-షోరూమ్) కాగా, ఇదే ధరలో హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ టాప్ వేరియంట్లు (ఎస్ఎక్స్ టెక్, నైట్ ఎడిషన్) కూడా లభిస్తాయి. సుమారు రూ. 18.7-18.8 లక్షల ధరలో వచ్చే ఈ ఎస్‌యూవీలో వెన్టిలేటెడ్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, టాప్ వేరియంట్లలో ఏడీఏఎస్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
ఒక వ్యక్తి స్ట్రీట్ బాబ్ 117 బైక్‌ను ఎంచుకోవాలా లేదా హ్యుందాయ్ క్రెటాను ఎంచుకోవాలా అనేది వారి లైఫ్ స్టైల్, అభిరుచిపై ఆధారపడి ఉంటుంది. స్ట్రీట్ బాబ్ 117 అనేది హార్లీ బైక్‌ల పర్ఫామెన్స్, డిజైన్‌కు ప్రాధాన్యత ఇచ్చే బైక్ ప్రియుల కోసం రూపొందించబడింది. మరోవైపు, హ్యుందాయ్ క్రెటా విశాలమైన ఇంటీరియర్, అడ్వాన్సుడ్ ఫీచర్లు, రోజువారీ వాడకానికి అనుకూలమైన సౌకర్యాలను అందిస్తుంది.
ఒకటి ప్యాషన్ సూచిస్తే, మరొకటి ప్రాక్టికాలిటీని సూచిస్తుంది. కాబట్టి, కొనుగోలుదారులు తమకు ఏది ఎక్కువ ముఖ్యం అనేది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. భారతదేశంలోని హార్లీ-డేవిడ్‌సన్ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications








