పండుగ చేస్కోండిరా అబ్బాయిలు..రూ.5 లక్షలకే హార్లీ-డేవిడ్‌సన్ బైక్..చక్కర్లు కొట్టేందుకు రెడీ అవ్వండి

హార్లీ-డేవిడ్‌సన్.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ఖరీదైన, లగ్జరీ బైక్‌లు. అయితే, ఇకపై హార్లీ-డేవిడ్‌సన్ అంటే అందరికీ అందుబాటులో ఉండే బైక్‌లు కూడా గుర్తుకు రాబోతున్నాయి. కంపెనీ ఇప్పుడు కొత్తగా, తక్కువ ధర బైక్‌ల సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ కొత్త మోడల్ ధర సుమారుగా 5 లక్షల రూపాయలలోపు ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ సీఈఓ ఒక సమావేశంలో ధృవీకరించారు.

హార్లీ-డేవిడ్‌సన్ తీసుకొస్తున్న ఈ కొత్త బైక్ పేరు 'స్ప్రింట్'. ఈ బైక్‌ను 2021 నుంచే అభివృద్ధి చేస్తున్నారు. ఈ తక్కువ కెపాసిటీ గల బైక్‌ను అమెరికాతో సహా పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించనున్నారు. హార్లీ-డేవిడ్‌సన్ స్ప్రింట్ బైక్ వచ్చే ఏడాది, అంటే 2026లో మార్కెట్‌లోకి రావచ్చు. అయితే, దీనిని ఈ ఏడాది చివరిలో జరిగే 2025 EICMA ఆటో షోలో ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

Sprint Bike

లగ్జరీ బైక్‌లకు పేరొందిన హార్లీ-డేవిడ్‌సన్ ఇప్పుడు సాధారణ కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. కంపెనీ సీఈఓ తెలిపిన వివరాల ప్రకారం, హార్లీ-డేవిడ్‌సన్ రూ.5 లక్షల కన్నా తక్కువ ధరలో ఒక ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ కొత్త మోడల్ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో మరిన్ని కొత్త బైక్‌లను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

స్పింట్ అనే పేరుతో రాబోతున్న ఈ బైక్ అభివృద్ధి పనులు 2021 నుంచే జరుగుతున్నాయి. ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది 2026లో లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ అంతకంటే ముందే ఈ ఏడాది చివరలో జరగనున్న 2025 EICMA మోటార్‌సైకిల్ షోలో దీన్ని ప్రదర్శించనున్నారు. కొత్త ఎంట్రీ-లెవల్ రేంజ్‌లో మరో క్రూజర్ మోడల్‌ను కూడా తీసుకురావాలని హార్లీ-డేవిడ్‌సన్ భావిస్తోంది.

Sprint Bike

ఈ రెండు బైక్‌లు కూడా 2026లో మార్కెట్‌లోకి రావచ్చని అంచనా. సాధారణంగా, హార్లీ-డేవిడ్‌సన్ అంటే అధిక ధర కలిగిన లగ్జరీ బైక్‌లు గుర్తొస్తాయి. అయితే, ఇప్పుడు కంపెనీ తమ లక్ష్యాన్ని మార్చుకుని, యువ కస్టమర్లను ఆకర్షించాలనుకుంటోంది. అందుకే, అందుబాటు ధరలో బైక్‌లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.

అంతకుముందు, 2014లో హార్లీ-డేవిడ్‌సన్ స్ట్రీట్ 750 పేరుతో తక్కువ ధర బైక్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అప్పట్లో ఆ బైక్ ఊహించినంత అమ్మకాలను సాధించలేకపోయింది. కానీ, అది హార్లీ-డేవిడ్‌సన్ నుంచి అత్యధికంగా అమ్ముడైన మోడల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు రాబోయే ఈ కొత్త బైక్ కూడా స్ట్రీట్ 750లా విజయం సాధించవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త మోడల్ హార్లీ-డేవిడ్‌సన్ బ్రాండ్‌కు ఒక కొత్త మార్కెట్‌లో గుర్తింపు తెచ్చిపెట్టవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 4, 2025, 18:42 [IST]
English summary
Harley davidson to launch an affordable bike priced below rs 5 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+