సెల్‎ఫోన్ కన్నా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు..వీటి రేంజ్, అద్భుతమైన ఫీచర్ల గురించి వింటే దిమ్మతిరగాల్సిందే

భారత మార్కెట్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల పట్ల వినియోగదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ స్కూటర్లలో కొన్ని అయితే స్మార్ట్‌ఫోన్ ధర కంటే కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 ప్రొ ధర సుమారు రూ.1.44 లక్షల నుంచి రూ.1.84 లక్షల వరకు ఉండగా, అంతకంటే తక్కువ ధరకే సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. తక్కువ ధరలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు, వాటి స్పెషాలిటీల గురించి వివరంగా తెలుసుకుందాం.

భారతదేశంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు లభిస్తున్న ఆదరణ కారణంగా కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో లభిస్తూ, పర్యావరణానికి మేలు చేస్తున్నాయి. మార్కెట్‌లో ప్రస్తుతం ఐఫోన్ కంటే తక్కువ ధరలో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం తక్కువ ధరకే కాదు, అద్భుతమైన ఫీచర్లు, మంచి రేంజ్‎తో కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Here are 5 electric scooters that are cheaper than the iPhone Pro Max

1. అల్ట్రావైలెట్ టెసెరాక్ట్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ ధరలో లభిస్తుంది. దీని ధర రూ.1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇది 3.5 kWh, 5 kWh, 6 kWh కెపాసిటీ గల మూడు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే, ఇది వరుసగా 162 కిలోమీటర్ల నుండి 261 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

కొత్త టెసెరాక్ట్ చాలా ఎట్రాక్టివ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ క్లస్టర్, కీలెస్‌ యాక్సెస్, పార్క్ అసిస్ట్, హిల్-హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ కోసం, ఇది ARAS (అడ్వాన్స్‌డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్), డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Here are 5 electric scooters that are cheaper than the iPhone Pro Max

2. హీరో విడా వి2 ప్రొ
హీరో విడా వి2 ప్రొ ధర రూ.1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 3.94 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 165 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 kmph. ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 40 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

కొత్త విడా వి2 ప్రొ స్కూటర్ గ్లోసీ బ్లాక్, మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్, మ్యాట్ వైట్, గ్లోసీ స్పోర్ట్స్ రెడ్, నెక్సస్ బ్లూ గ్రే, మ్యాట్ సయాన్ వంటి ఆకట్టుకునే రంగుల్లో లభిస్తుంది. 7-అంగుళాల టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కీలెస్‌ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రైడర్ల సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Here are 5 electric scooters that are cheaper than the iPhone Pro Max

3. ఓలా ఎస్1 ప్రొ ప్లస్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 4 kWh, 5.2 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 242 కిలోమీటర్ల నుండి 320 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 141 కిలోమీటర్లు. టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

4. ఏథర్ రిజ్టా
ఏథర్ రిజ్టా కూడా తక్కువ ధరలో లభిస్తుంది. దీని ధర రూ.1.11 లక్షల నుండి రూ.1.47 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ఇది 2.9 kWh, 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల నుండి 160 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. 7-అంగుళాల స్క్రీన్‌తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

Here are 5 electric scooters that are cheaper than the iPhone Pro Max

5. సింపుల్ వన్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 5.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 248 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 105 కిలో మీటర్లు. ఇది కేవలం 2.77 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ ధరల పెరుగుదల నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి, పర్యావరణహిత ప్రయాణాన్ని కోరుకునే వారికి అద్భుతమైన ఎంపికలు.

More from DriveSpark

Article Published On: Wednesday, September 10, 2025, 10:29 [IST]
English summary
Here are 5 electric scooters that are cheaper than the iphone pro max
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+