రూ.100 పెట్రోల్ కొట్టిస్తే చాలు.. బంగారం లాంటి బైక్! దీన్ని పడగొట్టె బండి ఇంకా పుట్టలేదు మామా

నమ్మకమైన టూవీలర్‌కు మరో పేరు చెప్పాలంటే - అది హీరో స్ప్లెండర్‌ (Hero Splendor)నే. సంవత్సరాలుగా మార్కెట్‌లో కొనసాగుతున్న ఈ మోడల్‌కి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇది కేవలం ఒక బైక్‌ మాత్రమే కాదు.. లక్షలాది మందికి జీవిత భాగస్వామి లాంటిది. గ్రామాలలో పొలాల మధ్య తిరిగే రైతు దగ్గర నుంచి, ఢిల్లీ ట్రాఫిక్‌లో ఆఫీస్‌కు వెళ్తున్న ఉద్యోగి వరకూ, హీరో స్ప్లెండర్ ప్రతి ఒక్కరికీ నమ్మకంగా తోడుగా నిలుస్తోంది. దీని సరళమైన డిజైన్‌, సులభమైన నిర్వహణ, మెరుగైన మైలేజ్, బలమైన నిర్మాణం కలసి దీన్ని ఒక ఇండియా లవ్స్ బైక్‌గా నిలిపాయి.

ఒక్కసారి పెట్రోల్ వేస్తే బజార్‌కి, పిల్లల స్కూల్‌కి, ఉద్యోగానికి, డాక్టర్‌ దగ్గరకు, ఎక్కడికైనా తీసుకెళ్లే నమ్మకమైన బైక్ ఇది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ఈ బైక్‌కు ఉండే డిమాండ్ మరోలెవల్‌లో ఉంటుంది. ఎప్పటికప్పుడు మారే మోడళ్ల మధ్య స్ప్లెండర్‌ను జనాలు ఎందుకు మరిచిపోరంటే, అది ఇచ్చే విశ్వాసం, ప్రాక్టికాలిటీ వల్లే.

Splendor June 2025 Sales

ఇది బడ్జెట్‌కి తగిన ధరలో లభించడమే కాకుండా, సులభంగా మెయింటైన్‌ చేయగలిగే విధంగా ఉంటుంది. అందుకే ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యే బైక్స్‌లో స్ప్లెండర్ ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటుంది. ప్రతిరోజూ కనిపించే ఈ బైక్‌కి జూన్ నెల కూడా అద్భుతమైన విజయాన్ని అందించింది. గత నెలలోనే ఏకంగా 3,31,057 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 2024 జూన్‌లో నమోదైన 3,05,586 యూనిట్లతో పోలిస్తే 8.34 శాతం వృద్ధి.

కొత్త బైక్‌లు, కొత్త బ్రాండ్‌లు మార్కెట్లో ఉన్నా, స్ప్లెండర్‌కు ఉన్న నమ్మకాన్ని ఏదీ బదిలీ చేయలేకపోతున్నదని. ప్రస్తుతం మార్కెట్లో స్ప్లెండర్ రెండు ప్రధాన వేరియంట్లలో స్ప్లెండర్ ప్లస్, సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్‌లలో లభిస్తోంది . రెండింట్లోనూ చూడగానే ఆకట్టుకునే డిజైన్‌కి తోడు, ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌టెక్ వేరియంట్‌ ప్రత్యేకంగా యూత్‌ను లక్ష్యంగా చేసుకుని స్టైలిష్‌గా తీర్చిదిద్దబడి ఉండగా, ప్లస్ వేరియంట్‌ అయితే క్లాసిక్ స్ప్లెండర్‌కు నిజమైన వారసుడిగా నిలుస్తోంది.

Budget Friendly Bike Splendor

హీరో స్ప్లెండర్ ప్లస్ ధర పరంగా చూస్తే, ఇది రూ. 79,476 నుంచి రూ. 83,251 (ఎక్స్-షోరూమ్) వరకు లభిస్తుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఇది స్టాండర్డ్, స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్,స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్‌ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ బైక్‌కు గుండె లాంటి ఇంజిన్ 97.2cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ మోటార్‌. ఇది 7.91 PS పవర్, 8.05 Nm టార్క్‌‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. మైలేజ్ విషయానికి వస్తే, స్ప్లెండర్ ప్లస్ సగటున 73 కిలోమీటర్ల వరకు ఇవ్వగలదు. ఇది రోజువారీగా ప్రయాణించే యూజర్లకు బెస్ట్ బైక్. ఇది 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ కెపాసిటీ కలిగి ఉంది. దీని వల్ల పెద్ద దూరాలు సులభంగా కవర్ చేయవచ్చు. ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 87 kmphగా ఉంది. ఇది యువతతో పాటు పెద్దలకూ ఇష్టమైన బైక్‌.

Super Splendor June 2025 Sales

హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ క్లాసిక్ స్ప్లెండర్‌కు ఆధునికతను జోడించిన మోడల్. ఫ్యామిలీకి అనువైన బైక్ కావాలి, అయితే ఇంకా కొంచెం పవర్‌తో వస్తే బాగుంటుందని భావించే వినియోగదారులకు ఇది సరైన ఎంపిక. ధర విషయంలో ఇది కొంచెం ప్రీమియం రేంజ్‌లో ఉంది. దీని ధర రూ. 88,628 నుంచి రూ. 92,528 వరకు (ఎక్స్-షోరూమ్). అయితే దీనికిచ్చే ఫీచర్లు, పనితీరు చూస్తే ధర పూర్తిగా న్యాయంగా అనిపిస్తుంది.

ఈ బైక్‌కి 124.7 cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 10.72 PS పవర్, 10.6 Nm టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌‌తో ఈ బైక్, సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవే రైడింగ్‌లోనూ మంచి కంఫర్ట్ ఇస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, ఇది సగటున 69 కిలోమీటర్ల పెవరకు ఇస్తుంది. పైగా, 12 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉన్నందున పదే పదే పెట్రోల్ పోయించుకోవాల్సిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Thursday, July 24, 2025, 11:57 [IST]
English summary
Hero budget friendly bike splendor june 2025 sales more details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+