అందరూ కొనేస్తున్న స్కూటర్ ఇదే.. 55 కి.మీల మైలేజ్‌తో సేల్స్‌లో దుమ్ములేపుతుంది

దేశయ టూవీలర్ తయారీదారుల్లో హీరో మోటోకార్ప్ (Hero Motocorp)కు ప్రత్యేకమైన స్థానం ఉంది. బైకుల విభాగంలో కానీ, స్కూటర్ సెగ్మెంట్‌లో కానీ ఇది పేద, మధ్య తరగతి వినియోగదారుల కోసం రోజువారి అవసరాలను తీర్చడానికి తక్కువ ధరలో తన వాహనాలను అందిస్తూ ప్రజల ఆదరాభిమానాన్ని పొందుతుంది. దీనిని రుజువు చేస్తూ హీరో జూన్ 2025లో దేశీయ మార్కెట్లో మంచి విక్రయాలను నమోదు చేసింది. ఒక్క నెలలోనే కంపెనీ 5,24,414 యూనిట్లను విక్రయించింది. ఇది 2024 జూన్‌లో నమోదైన 4,90,743 యూనిట్లతో పోల్చితే సుమారు 6.86 శాతం వృద్ధి. అంటే ఒకేసారి 33 వేల యూనిట్ల పెరుగుదల. ఇది హీరో మోటోకు మార్కెట్లో విశ్వాసం తిరిగి వస్తోందన్న సూచన. ఇదే సమయంలో నెలవారీ పరంగా కూడా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

మే 2025లో విక్రయించిన 4,88,499 యూనిట్లతో పోల్చితే జూన్‌లో 7.35 శాతం పెరుగుదల కనిపించింది. అంటే మార్కెట్లో కొత్త దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో డెస్టినీ 125 (Hero Destini 125) స్కూటర్. గతేడాది జూన్‌లో ఈ మోడల్‌ కేవలం 11,140 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగా, ఈ ఏడాది అదే నెలలో 20,140 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది దాదాపు 80.79 శాతం వృద్ధి.

Destini 125 Scooter Sales

అంటే కంపెనీ స్కూటర్ విభాగంలోనూ పట్టును బలోపేతం చేస్తోంది. హీరో మోటోకార్ప్ దశాబ్దాలుగా ఒక నమ్మకమైన బ్రాండ్‌గా పేరొందింది. బలాన్ని చూపించడం, అమ్మకాల పరంగా రెండు వరుస నెలల్లోనూ పెరుగుదల నమోదు చేయడం చూస్తే కంపెనీ తిరిగి తన ఫోకస్‌ను ఖచ్చితంగా స్థిరం చేసుకుంటోంది. ఫ్యూచర్‌లోనూ దీని దూకుడు కొనసాగితే, హీరో మార్కెట్‌లో తిరుగులేని పేరు అవుతుందన్నది చెప్పడంలో సందేహం లేదు.

అలాగే, డెస్టినీ మే 2025లో 15,018 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. జూన్ 2025లో ఈ సంఖ్య 20,140 యూనిట్లకు చేరుకోవడంతో నెలవారీగా చూసినప్పుడు 5,122 యూనిట్ల పెరుగుదల కనిపించింది. ఈ పెరుగుదల శాతం ప్రకారం చూసినప్పుడు, 34.11 శాతం వృద్ధిగా నమోదైంది. అంటే, ఒకే నెల వ్యవధిలో స్కూటర్ అమ్మకాల్లో ఇంత పెద్ద జంప్ రావడం విశేషమే. ఇది స్కూటర్ విభాగంలో హీరోకు వచ్చిన కొత్త ఊపును సూచిస్తోంది.

Destini 125 Scooter June 2025 Sales

హీరో డెస్టినీ 125 ప్రారంభ ధర వచ్చేసి రూ.82,192 నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసరికి దాదాపు రూ. ఒక లక్ష వరకు ఉంటుంది. 2025 హీరో డెస్టినీ 125 ఇప్పుడు మరింత మెరుగైన ఫీచర్లతో, పనితీరు పరంగా కూడా ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకుంది. ఈ స్కూటర్ ప్రధానంగా శక్తివంతమైన ఇంజిన్, మైలేజీ, టెక్నాలజీ ఫీచర్ల కలయికతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

ఇది 124.6 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది, ఇది 7000 ఆర్‌పీఎం వద్ద 9.12 PS పవర్‌ను, 10.4 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సివిటి గేర్‌బాక్స్ ద్వారా ఈ శక్తిని సమర్థవంతంగా వినియోగించవచ్చు. ఫ్యూయల్ సామర్థ్య పరంగా, డెస్టినీ 125 5.3 లీటర్ల ట్యాంక్‌తో లీటరుకు సగటుగా 55 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. మైలేజ్‌ను పరిగణనలోకి తీసుకునే వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

Hero Destini 125 Scooter June 2025 Sales 80 79 Percent

ఇది పలు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ZX, ZX+ వేరియంట్లు డిజిటల్ స్క్రీన్‌తో వస్తున్నాయి, ఇక VX వేరియంట్ మాత్రం అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. డెస్టినీ 125లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్, ఆటో క్యాన్సెల్ ఇండికేటర్లు, బూట్ ల్యాంప్‌లు వంటి ఫీచర్లు వినియోగదారులకు ఉపయోగపడతాయి. ZX+ వేరియంట్‌లో ప్రత్యేకంగా కాపర్ క్రోమ్ యాక్సెంట్‌లు, కుషన్డ్ బ్యాక్‌రెస్ట్ లాంటివి కూడా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 29, 2025, 17:27 [IST]
English summary
Hero destini 125 scooter june 2025 sales 80 79 percent growth details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+