హీరో సరికొత్త డెస్టినీ 125 స్కూటర్‌ లాంచ్.. 59 కి.మీల బెస్ట్ మైలేజ్.. ధర కూడా రూ.80 వేలు మాత్రమే!

భారతదేశపు ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటార్‌కార్ప్(Hero Motorcorp) హోండా, టీవీఎస్ వంటి కంపెనీలకు పోటీగా నిలుస్తూ అమ్మకాల్లో ప్రతి ఏడాది మెరుగైన గణాంకాలను నమోదు చేస్తుంది. హీరో బైక్స్, స్కూటర్లు దేశంలో మంచి ఆదరణ కలిగి ఉన్నాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టూవీలర్లను లాంచ్ చేయడంలో ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం కొత్త మోడళ్లను విడుదల చేస్తున్న హీరో సంక్రాంతి నాడు వినియోగదారులకు మంచి శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సరికొత్త 2025 డెస్టినీ 125 (2025 Destini 125) స్కూటర్‌ను దేశంలో విడుదల చేసింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరో తన కొత్త స్కూటర్‌తో ఘనంగా ఎంట్రీ ఇచ్చింది. భారత్‌లో స్కూటర్లకు బాడా డిమాండ్ ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. పురుషులతో పాటు, మహిళలు నడపడానికి స్కూటర్లు ఈజీగా ఉంటాయి.

హీరో 2025 డెస్టినీ 125 స్కూటర్‌ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ VX‌ ప్రారంభ ధర రూ.80,450 (ఎక్స్ షోరూమ్), అదే ZX మిడిల్ వేరియంట్ ధర రూ.89,300 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తుంది. చివరగా ZX ప్లస్ టాప్ వేరియంట్ ధర రూ.90,300 (ఎక్స్ షోరూమ్) వద్ద కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్‌తో కనిపిస్తుంది. కర్వీ బాడీవర్క్ స్టైలిష్‌గా ఉంటుంది.

Hero Destini 125 Launched In india

ఈ స్కూటర్‌ 125 cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 9 bhp హార్స్ పవర్, 10.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్‌కు ఈ స్కూటర్ 59 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్‌ను CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ సిస్టంతో జత చేశారు. ఇది కళ్లు చెదిరే డిజైన్‌ అందంగా కనిపిస్తుంది. ఫీచర్లు కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్నాయి.

దీని వినూత్నమైన కర్వీ బాడీవర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది. ముందు అధునాతన LED హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్‌లు, ఆకర్షణీయమైన టెయిల్ లైట్‌ వంటివి ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, బూట్ ల్యాంప్, పూర్తి-డిజిటల్ డిస్‌ప్లే, i3S స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ సపోర్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, బయటి వైపు పెట్రోల్ ఫిల్లింగ్ ట్యాంక్, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) వంటి పలు ఫీచర్స్ ఉన్నాయి.

సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సెటప్‌ను అమర్చారు. గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఇది చాలా సునాయాసంగా వెళ్తుంది. ప్రయాణంలో రైడర్లకు స్కూటర్ స్కిడ్ కాకుండా ఉండటానికి సురక్షితమైన రైడింగ్ కోసం డ్రమ్, డిస్క్ బ్రేక్‌లను అందించారు. లగేజీ పెట్టుకోడానికి హీరో 2025 డెస్టినీ 125 స్కూటర్‌‌లో సీట్ కింది భాగంలో 19 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది.

ప్రస్తుతం మార్కెట్లో స్కూటర్ల సెగ్మెంట్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. తయారీ కంపెనీలు వరుస బెట్టి సరికొత్త డిజైన్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ కస్టమర్లను సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125 వంటి మోడళ్లు భారీ సేల్స్‌ను సాధిస్తున్న తరుణంలో హీరో కొత్తగా 2025 డెస్టినీ 125 స్కూటర్‌తో వీటికి ప్రత్యర్థిగా నిలవడానికి సిద్ధమైంది.

కొత్త మోడల్ లాంచ్ నేపథ్యంలో హీరో మోటోకార్ప్ ఇండియా బిజినెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రంజీవ్‌దీప్ సింగ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, అదిరిపోయే డిజైన్‌, తక్కువ ధర, హై పెర్ఫామెన్స్‌తో మార్కెట్లోకి వచ్చే టూవీలర్లకు భారత్‌లో ఎప్పుడు ఆదరణ ఉంటుంది. అధునాతన టెక్నాలజీకి ఐకాన్‌గా వచ్చిన హీరో డెస్టినీ 125 కూడా మంచి అమ్మకాలను సాధిస్తుందని అన్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 15, 2025, 7:20 [IST]
English summary
Hero destini 125 scooter launched in india at starting price rs 80450 all top things check here
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+