ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు జనాల్లో విపరీతమైన క్రేజ్.. మే నెలలో దుమ్మురేపిన విడా V2

హీరో మోటోకార్ప్ (Hero Motocorp), దేశంలోనే అత్యంత నమ్మకమైన టూవీలర్ తయారీ సంస్థగా తన స్థానాన్ని బలపరుచుకుంటుంది. ఐసీఈ ఇంజిన్ ఆధారిత మోడళ్ల విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హీరో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తుంది. హీరో నుంచి వచ్చిన విడా బ్రాండ్ కింద అందిస్తున్న వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విస్తరిస్తూ విడా V2 ఇ-స్కూటర్‌కు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ పొందుతుంది. ఈ స్కూటర్ అందించే సాంకేతికత, స్టైలిష్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతోపాటు, ప్రజల్లో సుస్థిరమైన వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.

దీని ప్రభావం స్పష్టంగా మే నెల అమ్మకాలలో కనిపించింది. కంపెనీ నుంచి నివేదిక ప్రకారం, 2025 మేలో హీరో మోటోకార్ప్ ఏకంగా 8,361 యూనిట్ల విడా V2 ఇ-స్కూటర్లను విక్రయించింది. గడచిన ఏడాది ఇదే నెలలో కేవలం 3,640 యూనిట్లు మాత్రమే అమ్ముడైనవి. ఈసారి వచ్చిన వృద్ధి శాతం ఆశ్చర్యపరిచే స్థాయిలో 129.69 శాతంగా ఉంది. ఇది ఈ స్కూటర్‌కి ఉన్న డిమాండ్‌ను, అలాగే వినియోగదారుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.

Hero Electric Scooter Vida V2 Sales 8361

ఈ రికార్డు స్థాయి అమ్మకాలు, హీరో మోటోకార్ప్‌కి కేవలం వాణిజ్య విజయం మాత్రమే కాకుండా, దేశంలోని ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ దిశను కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో విడా V2 ఇ-స్కూటర్ అద్భుతమైన సేల్స్‌తో తన బలాన్ని మరింత పెంచుకుంది. ఏప్రిల్ 2025లో ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి గణనీయమైన స్పందన లభించింది. ఒక్క ఆ నెలలోనే 7,116 యూనిట్ల విడా V2 స్కూటర్లు సేల్ విక్రయమయ్యాయి.

ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.49 శాతం వృద్ధి. మేలో మరింత వేగం పుంజుకుని, రికార్డు స్థాయిలో 8,361 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. విడా V2కి ఉన్న తక్కువ ధర. ఇవి ప్రతిష్టాత్మక ఇ-స్కూటర్‌ మోడల్స్‌తో పోలిస్తే బడ్జెట్‌కు మించి కాకుండా అందుబాటులో ఉండటమే కాక, ప్రయాణంలో సౌకర్యం, ఆకర్షణీయమైన ఫీచర్లు అందించడం వల్ల వినియోగదారుల నమ్మకాన్ని గెలిచి ఇది బాగా అమ్ముడుపోతుంది.

Vida V2 Sales

మంచి రేంజ్, ఫాస్ట్ చార్జింగ్ సౌలభ్యం, ఆధునిక డిజైన్ లాంటి అంశాలన్నీ ఈ వాహనాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ప్రస్తుతం హీరో విడా V2 భారతీయ మార్కెట్లో మూడు వేరియంట్లలో V2 లైట్, V2 ప్లస్, V2 ప్రో అందుబాటులో ఉంది. వీటిలో ప్రతి వేరియంట్ ప్రత్యేకమైన ఫీచర్లతో, వేర్వేరు ధరల పరిధిలో లభిస్తుంది. ఈ ఆప్షన్లు వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా స్కూటర్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి.

హీరో విడా V2 ప్లస్ గురించి చూసినట్లయితే, దీని ధర రూ.1.15 లక్షలు(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. దీనిలో 3.44 కిలోవాట్(kWh) బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 85 కి.మీలుగా ఉంటుంది. ఇది మిడ్-రేంజ్ మోడల్‌గా అడుగుపెట్టింది. హీరో విడా V2 ప్రో మోడల్ ధర రూ. 1.35 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది టాప్-ఎండ్ మోడల్.

Hero Electric Scooter Vida V2 Sales

దీనిలో 3.94 కిలోవాట్(kWh) బ్యాటరీ ప్యాక్ అమర్చారు. పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 165 కిలోమీటర్లు నడుస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 కి.మీలుగా ఉంది. హీరో విడా VX2 గురించి చూసినట్లయితే రూ.65,000 నుండి రూ.70,000(ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలుకు ఉంటుంది. దీన్ని తాజాగా ఆవిష్కరించారు. ఇది 2.2 కిలోవాట్(kWh), 3.4 కిలోవాట్(kWh) బ్యాటరీ ప్యాక్‌ 100 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని అంచనా.

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2025, 10:03 [IST]
English summary
Hero electric scooter vida v2 sales 8361 recorded in may 2025 details
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+