స్టైలిష్ గా తిరగాలా? ఎక్కువ దూరం వెళ్లాలా?.. 125సీసీ సెగ్మెంట్‌లో ఈ రెండు బైక్‌లకు తిరుగులేదు! 

భారతదేశంలో అత్యంత పాపులారిటీ పొందిన 125సీసీ మోటార్‌సైకిళ్లలో హీరో గ్లామర్ 125, హోండా షైన్ 125 ముందు వరుసలో ఉంటాయి. ఇవి స్టైలిష్ డిజైన్‌తో పాటు అందుబాటు ధరలో మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. ఇటీవల ఈ రెండు బైక్‌లు కూడా కొన్ని అప్‌డేట్‌లతో మార్కెట్‌లోకి వచ్చాయి. మరి ఈ రెండింటిలో జనాలకు ఏది బాగా నచ్చుతుందో తెలుసుకునేందుకు వాటి ధర, పనితీరు, ఫీచర్లను పోల్చి చూద్దాం!

ధర (Price): హీరో గ్లామర్ 125 వేరియంట్‌ను బట్టి రూ. 84,698 నుండి రూ. 90,698 వరకు ధర పలుకుతోంది. అదేవిధంగా హోండా షైన్ 125 ధర రూ. 84,551 నుండి రూ. 91,072 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఈ రెండు బైక్‌ల ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి.

Honda Shine 125 Small

డిజైన్, కలర్స్(Design, Colors): ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా సింపుల్, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. హీరో గ్లామర్ క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ మెటాలిక్ సిల్వర్, టెక్నో బ్లూ మ్యాట్ బ్లాక్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. హోండా షైన్ మాత్రం పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పర్ల్ సైరన్ బ్లూతో సహా 6 కలర్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉంది. రంగుల ఎంపిక విషయంలో హోండా షైన్ కొంచెం ముందుంది.

పనితీరు (Performance): కొత్తగా విడుదలైన హీరో గ్లామర్ 125, హోండా షైన్ 125 బైక్‌లు OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. ఇది కార్బన్ ఉద్గారాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే రైడర్‌ను హెచ్చరిస్తుంది.

Hero Glamour 125

హీరో గ్లామర్ 125 ధర ప్రకారం పవర్ ఫుల్ పవర్‌ట్రెయిన్ ఆఫ్షన్ కలిగి ఉంది. ఇది 124.7సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 10 PS హార్స్‌పవర్, 10.4 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 63 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

హోండా షైన్ 125 మోటార్‌సైకిల్ 123.94సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 10.63 PS హార్స్‌పవర్, 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కూడా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 55 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. పర్ఫామెన్స్ పరంగా ఈ రెండు బైక్‌లు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ, ఫ్యూయెల్ కెపాసిటీలో హీరో గ్లామర్ కొంచెం మెరుగ్గా ఉంది.

Honda Shine 125

ఫీచర్లు (Features): ఈ రెండు మోటార్‌సైకిళ్లు కూడా ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. హీరో గ్లామర్ 125 డిజిటల్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. సేఫ్టీ కోసం ముందు, వెనుక డిస్క్/డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.

హోండా షైన్ 125 బైక్ ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. రైడర్ సేఫ్టీ కోసం ముందు డ్రమ్/డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. పై సమాచారం బడ్జెట్ ఆధారంగా వినియోగదారులు ఏ బైక్ కావాలో ఎంచుకుని కొనుగోలు చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 26, 2025, 10:12 [IST]
English summary
Hero glamour 125 vs honda shine 125 which popular bike do you like
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+