ఫుల్ ట్యాంక్‌తో 600 కి.మీల పైనే! రోజూ ఉద్యోగాలకు వెళ్ళే వారు హాయిగా కొనచ్చు.. గతనెలలో భారీ సేల్స్

హీరో గ్లామర్ (Hero Glamour) భారత మార్కెట్లో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న బైక్. 125 సీసీ సెగ్మెంట్‌లో ఇది ఎప్పటినుంచో నమ్మదగినదిగా, మైలేజ్‌ఫ్రెండ్లీగా, స్టైలిష్ కమ్యూటర్‌గా పేరుపొందింది. ప్రతి నెలా దీని అమ్మకాలు హీరో బ్రాండ్ శక్తిని, అలాగే వినియోగదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తుంటాయి. అక్టోబర్ 2025 లో కూడా హీరో గ్లామర్ తన హవాను కొనసాగించింది. ఈ నెలలో మార్కెట్‌లో పోటీ ఎంత కఠినంగా ఉన్నా, గ్లామర్ మాత్రం తన స్థానాన్ని మళ్లీ ఒకసారి బలంగా నిలబెట్టుకుంది. మూడు వేర్వేరు వెర్షన్‌లతో అందుబాటులో ఉన్న ఈ 125 సీసీ మోడల్, మొత్తం 28,823 యూనిట్లు అమ్ముడవడం ద్వారా తన ఆకట్టుకునే పనితీరును మరోసారి ప్రూవ్ చేసింది.

ఈ అమ్మకాల సంఖ్య గ్లామర్‌కు ఉన్న ప్రజాదరణను మాత్రమే కాదు, ఈ సెగ్మెంట్‌లో ఇది ఎంత బలమైన పోటీదారో కూడా తెలియజేస్తుంది. రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, లేదా మధ్యతరగతి కుటుంబాలు.. అందరికీ సరిపోయే రీలాైబిలిటీ, మైలేజ్, మెయింటెనెన్స్ కంఫర్ట్, హీరో నెట్‌వర్క్‌పై నమ్మకం ఇవన్నీ గ్లామర్ విజయానికి ప్రధాన కారణాలు. ప్రత్యేకంగా ఈ నెలలో పండగ సీజన్ కావడంతో కొనుగోలుదారుల మనసులో మరింత డిమాండ్ కనిపించింది.

Hero Glamour October 2025 Sales 18 34 Percent Growth

అక్టోబర్ 2025లో హీరో గ్లామర్ సాధించిన అమ్మకాలను అర్థం చేసుకోవాలంటే, గత ఏడాది ఇదే నెలలోని గణాంకాలను చూసుకోవాలి. అక్టోబర్ 2024లో హీరో గ్లామర్ మొత్తం 24,356 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలో గ్లామర్ తన సత్తాను గణనీయంగా మెరుగుపరుచుకుంది. అక్టోబర్ 2025లో అమ్ముడైన 28,823 యూనిట్లతో పోలిస్తే, గత ఏడాదితో పోల్చితే 4,467 బైకులు అదనంగా అమ్ముడయ్యాయి.

ఈ పెరుగుదలను శాతం ప్రాతిపదికన చూసినా అది మరింత ఆకట్టుకుంటుంది. హీరో గ్లామర్ అమ్మకాలలో 18.34% వృద్ధి నమోదు చేసింది. 125cc సెగ్మెంట్‌లో కొత్త మోడళ్ల రాక, పెరిగిన పోటీ, కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు ఉన్నప్పటికీ గ్లామర్ ఇంత పెద్ద గ్రోత్ సాధించడం ప్రత్యేకమే. ఈ బలమైన అమ్మకాల వల్ల గ్లామర్ అక్టోబర్ 2025లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 బైకుల జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకుంది.

Hero Glamour October 2025 Sales 18 34 Percent Growth

హీరో గ్లామర్ ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు వేర్వేరు వెర్షన్‌లతో అందుబాటులో ఉంది, ప్రతి ఒక్కటి 125 సీసీ సెగ్మెంట్‌లోనే వచ్చినప్పటికీ, ఫీచర్లు, స్టైల్, టెక్నాలజీ పరంగా వినియోగదారులకు వేరువేరు అనుభూతిని అందిస్తాయి. మొదటిది స్టాండర్డ్ హీరో గ్లామర్, తర్వాత మరింత ఫీచర్లతో వచ్చిన గ్లామర్ XTEC, ఇక చివరిది మరింత ప్రీమియం లుక్, అదనపు స్టైల్ టచ్‌లు కలిగిన గ్లామర్ X వేరియంట్.

ఈ మోడల్ రూ. 81,063 నుంచి ప్రారంభమవుతుంది, టాప్ వేరియంట్ ధర రూ. 84,751 వరకు ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండేలా, మంచి మైలేజ్ కోరుకునే వారికి పరఫెక్ట్‌గా సరిపోతుంది. అదే సమయంలో, మరింత ఆధునిక టెక్నాలజీ కోరుకునే యువతరం కోసం హీరో గ్లామర్ XTEC ను అందిస్తోంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ కన్సోల్, కాల్/ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ వంటి అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తుంది.

Hero Glamour October 2025 Sales 18 34 Percent Growth

XTEC ప్రారంభ ధర రూ. 84,106, టాప్ మోడల్ ధర రూ. 88,346. ఫీచర్ల పరంగా చూస్తే, ఈ ధర బెస్ట్. స్టైల్, ప్రీమియం ప్రెజెన్స్ కోరుకునే వారికి హీరో గ్లామర్ X వెర్షన్ అందుబాటులో ఉంది. ఇది మరింత అగ్రెసివ్ డిజైన్, స్పోర్టీ అటిట్యూడ్, ఎక్స్‌ట్రా గ్రాఫిక్స్, అప్‌గ్రేడెడ్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 82,967, టాప్ వేరియంట్ ధర రూ. 92,186గా ఉంది.

రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాలు షాపింగ్ వంటి ఇతర అవసరాలకు తిరగడానికి గ్లామర్ మంచి మైలేజ్ ఇవ్వడంలో చాలా ప్రసిద్ధి. ఇది లీటరుకు దాదాపుగా 65 కి.మీల వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే ఈ మైలేజ్ రోడ్డు, డ్రైవింగ్ పరిస్థితులను బట్టి మారుతుంది. మరో విషయం ఏమిటంటే, దీని ట్యాంక్‌ను ఫుల్ చేస్తే దాదాపుగా 600 కి.మీల పైనే ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 27, 2025, 11:45 [IST]
English summary
Hero glamour october 2025 sales 18 34 percent growth compared to previous
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+