70కిమీ ఇచ్చే బైక్ కేవలం రూ.60వేలకే.. హీరో షోరూంల ముందు క్యూ కడుతున్న జనాలు

భారత మార్కెట్‌లో అత్యంత తక్కువ ధరలో లభించే బైక్‌లకు కస్టమర్ల నుంచి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలాంటి బైక్‌లలో ఒకటి హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్. కస్టమర్లు పెట్టే డబ్బుకు తగ్గ విలువైన ఉత్పత్తి కాబట్టి, ఈ బైక్ ప్రతీ నెలా అద్భుతమైన అమ్మకాల సంఖ్యను నమోదు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుత మే నెలలో కూడా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసి సత్తా చాటింది.

హీరో మోటోకార్ప్ సంస్థ ప్రస్తుత 2025 మే నెలలో 1,07,768 హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లను విక్రయించింది. గత 2024 మే నెలలో కేవలం 87,143 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే, ఇప్పుడు 20,625 హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇది 23.67 శాతం వృద్ధి.

Hero HF Deluxe

దీని ద్వారా ప్రస్తుత 2025 మే నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 టూవీలర్ల జాబితాలో, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి 4 స్థానాల్లో వరుసగా హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా, హోండా షైన్, బజాజ్ పల్సర్ ఉన్నాయి.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్‌లో 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజిన్ అమర్చబడింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 5.9 kW పవర్‌ను, 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.05 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Hero HF Deluxe

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ఇంధన ట్యాంక్ కెపాసిటీ 9.60 లీటర్లు. అదే సమయంలో ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీ.గా, సీటు ఎత్తు 805 మి.మీగా ఉంది. ఈ బైక్ కిక్ స్టార్ట్ మోడల్ బరువు 110 కిలోలు కాగా, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ బరువు 112 కిలోలు.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ ప్రారంభ ధర కేవలం రూ. 59,998. దీని టాప్ వేరియంట్ ధర రూ. 70,618. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ ధరకు తగ్గ విలువైన ఉత్పత్తిగా పరిగణించబడుతున్నందువల్లే, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ అమ్మకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

Hero HF Deluxe

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: భారత మార్కెట్‌లో టీవీఎస్ స్పోర్ట్, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100 వంటి బైక్‌లకు హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఒక లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, ఈ బైక్‌ను ఉపయోగిస్తున్న చాలామంది చెబుతున్నారు. కాబట్టి, తక్కువ ధరలో ఎక్కువ మైలేజీనిచ్చే బైక్‌ను కోరుకునే కస్టమర్లకు, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఒక అద్భుతమైన ఆప్షన్.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 30, 2025, 9:26 [IST]
English summary
Hero hf deluxe sales skyrocket affordable bike delivers 70 kmpl mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+